డీజే టిల్లు ఈ మూవీ గురించి తెలియని వారుండరు. పేరుకు చిన్న సినిమా అయిన సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక డీజే టిల్లుగా హీరో జొన్నలగడ్డ సిద్దు ఫర్ఫామెన్స్ గురించి చెప్పనక్కరలేదు. అట్లుంటది మనతోని అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు. సిద్దు ఆటిట్యూడ్, డైలాగ్స్ యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతోంది. సీక్వెల్ లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. తాజాగా అందాల బ్యూటీ అనుపమ పుట్టిన రోజు సందర్బంగా మేకర్స్ బర్త్ డే విషెస్ చెపుతూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇప్పటివరకూ 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం.

ఈ పోస్టర్లో అనుపమ ఫస్ట్ పార్ట్ లోని రాధికను గుర్తుచేసింది. సేమ్ టు సేమ్ మొదటి భాగంలో నటించిన నేహా శెట్టి లానే ఉంది. తనకు ఉన్నట్టుగానే అనుపమ నోస్ పిన్ పెట్టుకుని అందంగా కనిపించి ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన రోజు సందర్భంగా గతంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అంతకుముందు సినిమా ప్రకటన సందర్భంగా రిలీజ్ చేసిన చిన్న వీడియో కూడా విశేషంగా ఆకట్టుకుంది. తొలి పార్ట్ నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ.. డీజే టిల్లు స్క్వేర్ కూడా తీస్తోంది. ఈ మూవీ అనౌన్స్ అయిన సమయంలో, అనుపమ పరమేశ్వరన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, సిద్ధూకి అనుపమకి సెట్ లో గొడవ జరిగాయంటూ…రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఈ పోస్టర్ విడుదలైన తర్వాత ఇప్పుడు క్లారిటీ వచ్చింది.