Homeఅంతర్జాతీయంఅమెజాన్ నది పై ఆయిల్ కంపెనీల కన్ను... ప్రమాదంలో పగడాల దిబ్బ...

అమెజాన్ నది పై ఆయిల్ కంపెనీల కన్ను… ప్రమాదంలో పగడాల దిబ్బ…

ఎన్నో జీవజాతులకు నెలవైన అమెజాన్ నది ముఖద్వారం వద్ద ఉన్న పగడాల దిబ్బ ప్రమాదంలో పడింది.. ఈ దిబ్బ కింద ఉన్న చమురును వెలికితీసే ప్రణాళికతో ఈ పగడాల దిబ్బకు, దానిమీద ఉన్న జీవావరణానికి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అమెజాన్ నది ముఖద్వారం వద్ద ఉన్న పగడాల దిబ్బను ఎప్పుడు కనుగొన్నారు..? ఈ పగడాల దిబ్బపై కన్నేసిన ఆయిల్ కంపెనీ ఏది..? దీనికి శాస్త్రవేత్తల ఆందోళతో సమస్యకు పరిష్కారం లభించిందా..?

అమెజాన్ నది ముఖద్వారం వద్ద ఎన్నో జీవజాతులకు నెలవైన పగడాల దిబ్బ ప్రమాదంలో పడిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దిబ్బ కింద ఉన్న చమురును వెలికితీసే ప్రణాళికలతో ఈ పగడాల దిబ్బకు, దాని మీద ఉన్న జీవావరణానికి ముప్పు ఉన్నట్లు వారు చెప్తున్నారు.

బ్రెజిల్ తీర ప్రాంతంలో అమెజాన్ నది.. అట్లాంటిక్ మహా సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ పగడాల దిబ్బ ఉంది. దీనిని 2016లో కనుగొన్నారు. ఈ పగడాల దిబ్బలో ఔషధ పరంగా, శాస్త్రీయపరంగా ఉపయోగపడే ఎన్నో రకాల గుర్తు తెలియని జీవజాతులు ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. దీనిపై ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది.

ప్రస్తుతం బ్రెజిలియన్ ఆయిల్ కంపెనీ పెట్రోబ్రాస్ ఈ పగడాల దిబ్బపై కన్నేసింది. అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ పగడాల దిబ్బకు దగ్గర్లో తన
కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తోంది. పెట్రోబ్రాస్ కార్యకలాపాలతో అరుదైన ఈ సముద్ర జాతులకు, ఔషధపరంగా, శాస్త్రీయంగా ఎంతో విలువైన ఈ ఎకోసిస్టమ్‌కు తీవ్ర ముప్పు వాటిల్లనుంది.

అమెజాన్ పగడాల దిబ్బ చాలా అద్భుతంగా, ప్రత్యేకంగా ఉంటుంది. చాలా వరకు నది పరివాహక ప్రాంతాల్లో ఉండే దిబ్బలు పెద్దగా లోతు లేని నీటిల్లోనే ఉంటాయి. కానీ ఈ అమెజాన్ పగడాల దిబ్బ మాత్రం లోతైన నీటిలో ఉంది.. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ నది నుంచి సముద్రంలోకి వచ్చే మట్టి నీళ్లతో ఈ పగడాల దిబ్బ కొన్నిసార్లు కనిపించకుండా పోతుంది.

అమెజాన్ నది నుంచి వచ్చే మట్టి నీళ్లలో 220 మీటర్ల లోతులో ఈ పగడాల దిబ్బను రీసెర్చర్లు కనుగొన్నారు. ఈ దిబ్బలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే మసక మసకగా వెలుతురు వస్తుంది. ఈ దిబ్బను కనుగొన్నప్పటి నుంచి కూడా దీనిపై పెద్దగా అధ్యయనాలు జరగలేదు.. ఇది చాలా విస్తారమైన ప్రాంతం. అందుకే అక్కడున్న విషయాలు ఇప్పటికీ మనకు తెలియవు.. ఈ ప్రాంతంలో కనిపించే సముద్ర జాతులు.. ప్రపంచంలో మరే ప్రాంతంలో కూడా కనిపించవు.. ఈ పగడాల దిబ్బ నుంచి వెలికితీసిన ఒక సముద్రపు పాచిపై సావో పౌలో యూనివర్సిటీలో అధ్యయనం చేస్తున్నారు. దీనిలో క్యాన్సర్‌ను నిర్మూలించే ఔషధాలున్నాయని రీసెర్చర్లు భావిస్తున్నారు.

ఈ అధ్యయనంతో చాలా అద్భుత ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయని రియో డె జానీరో యూనివర్సిటీ బయాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ రాడ్రిగో లియావో డె మౌరా తెలిపారు.. ఈ పగడాల దిబ్బను కనుగొనడంలో ప్రముఖ శాస్త్రవేత్త ఇతనే.. బ్రెజిలియన్ ఆయిల్ కంపెనీ పెట్రోబాస్ ప్రస్తుతం చేపడుతున్న ఈ ప్రణాళికలపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కంపెనీ పగడాల దిబ్బకు దగ్గర్లో డ్రిల్ చేయడం ద్వారా చమురును వెలికితీయాలని చూస్తోంది. కానీ అలా చేయడం వల్ల చమురు లీకై, ఈ పగడాల దిబ్బ మీద ఉన్న అరుదైన సముద్ర జీవ జాతులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఒకవేళ ఈ ప్రాంతంలో చమురు వెలికితీత సమయంలో లీకైతే, దీని ప్రభావం ఎంతవరకూ ఉండనుందో తెలుసుకునేందుకు పెట్రోబ్రాస్ ఈ పగడాల దిబ్బపై ఈ నెలలోనే ప్రయోగాలు ప్రారంభిస్తుంది. బ్రెజిల్ పర్యావరణ సంరక్షణ విభాగం ఐబామా కనుక ఈ వెలికితీతకు అనుమతిస్తే, వెంటనే చమురు తవ్వకం ప్రారంభం కానుంది. ఇది తీరానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ,శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్న పగడాల దిబ్బకు మాత్రం చాలా దగ్గర్లోనే ఉంది.. ఈ ప్రాంతంలో చమురు వెలికితీతకు సాధ్యమవుతుందని, పర్యావరణాన్ని కాపాడతామని బ్రెజిలియన్ పర్యావరణ శాఖ మంత్రి జోక్విమ్ లైట్ తెలిపారు.

ఈయన ప్రభుత్వం త్వరలోనే దిగిపోబోతుంది. కానీ, మంత్రి ఈ వ్యాఖ్యలపై ప్రొఫెసర్ మౌరా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు పగడాల దిబ్బలు పెద్దగా లోతు లేని నీటిపైనే తేలియాడుతూ ఉంటాయి. పగడాలు పెరిగేందుకు అవసరమైన శక్తిని సూర్యరశ్మి ద్వారా ఇది పొందుతూ ఉంటాయి. అయితే అమెజాన్ పరివాహక ప్రాంతంలో ఉన్న పగడాల దిబ్బ పూర్తిగా భిన్నమైంది. ఈ పగడాల దిబ్బ లోతైన నీటిలో, పెద్దగా వెలుతురు తగలని ప్రాంతంలో ఉంది.

ఈ పగడాల దిబ్బలో ఉన్న మొక్కలు తక్కువ వెలుతురులోనే సూర్యరశ్మిని, నీటిని, కార్బన్‌డయాక్సైడ్‌‌లను.. కార్బోహైడ్రేట్స్, ఆక్సిజన్‌లాగా మార్చుకుంటాయి. వెలుతురును మరింత సమర్థవంతంగా వినియోగించుకునే ఎర్ర సముద్ర పాచి ఈ పగడాల దిబ్బలో ఉండటం వల్లనే అది సాధ్యమవుతుంది.

ఈ సముద్ర దిబ్బ విస్తీర్ణం 56 వేల చదరపు కిలోమీటర్ల ఉన్నట్లు భావిస్తున్నారు. ఎన్నో రకాల స్పాంజ్‌లు, పగడాల జాతులతో పాటు.. 70 రకాల జాతుల చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలకు ఇది నెలవుగా ఉంది.

బ్రెజిలియన్ తీరంలో వేలాది మంది కుటుంబాలకు ఆహారాన్ని, ఆదాయాన్ని ఈ పగడాల దిబ్బ అందిస్తోంది. పెట్రోబ్రాస్ ప్రణాళికలపై వీరిలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆయిల్ కంపెనీ షిప్‌లతో ఆ సముద్ర దిబ్బలో సృష్టించిన గందరగోళ పరిస్థితులతో చేపలు తమకు దొరక్కుండా పోతాయని చేపలు పట్టే మహిళలు బావిస్తున్నారు. ఇవి సముద్రంలోకి మరింత దూరానికి వెళ్తే, తమకున్న చిన్న చిన్న పడవలు అంత దూరం వెళ్లలేవని ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో ఉత్తర బ్రెజిల్‌లోని తీర ప్రాంతంలో చమురు ఒలికిపోవడంతో ఆ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. టూరిజం పరిశ్రమ స్తంభించిపోయింది.

అతిపెద్ద చేపల మార్కెట్ రాత్రికి రాత్రే కనుమరుగైంది. చమురు సముద్రంలో కలిసిందనే వార్తలతో చాలా మంది కొనుగోలుదారులు వారి నుంచి చేపలు కొనడం ఆపివేశారు. దీంతో అమ్మకాలు 80 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గిపోయినట్టు సీవర్కర్ల యూనియన్ కాన్ఫ్రెమ్ కార్లోస్ పింటో తెలిపారు.

నవంబర్ 8వ తారీఖున పెట్రోబ్రాస్ స్థానిక మత్స్యకారులతో సమావేశం నిర్వహించింది. బ్రెజిల్ ఉత్తర భాగాన ఉన్న పట్టణం ఒయాపోక్‌లోని ఫిషింగ్ కమ్యూనిటీలో ఉన్న సభ్యులతో పెట్రోబ్రాస్ ఈ సమావేశం నిర్వహించింది.

‘‘ఈ సమావేశంలో మా ప్రశ్నలకు లభించిన సమాధానాలు అచ్చం రెడీమేడ్‌గా ఉన్నట్టు అనిపించాయని చెబుతున్నారు మత్స్యకారులు… అక్కడి మత్స్యకారులు ఏది అడిగినా కూడా వారు అది తీర ప్రాంతానికి దూరంగా ఉన్నట్టు చెప్పడం వారిని షాక్ కు గురిచేసింది… సమావేశం చివరిలో మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ చమురు వెలికితీతను వ్యతిరేకస్తున్నట్లు చెప్పారు. కానీ… పెట్రోబ్రాస్ కంపెనీ ప్రతినిధులు ఏం చెప్పకుండానే వెనుతిరిగారు..

మత్స్యకారుల అనుమానాలు, అంచనాలను నివృత్తి చేసేందుకు ఫిషింగ్ కమ్యూనిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని పెట్రోబ్రాస్ చెబుతోంది. పెట్రోబ్రాస్ శాస్త్రవేత్తలతో జరిపిన సమావేశంలో.. మీరు మరింత అర్థం చేసుకోవాలని… సున్నిత ప్రదేశాలను మ్యాప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు’’ ప్రొఫెసర్ మౌర…

అయితే… సైంటిస్టులతో సమావేశం జరిగినప్పటి నుంచి తాము బయోవైవిధ్యంపై ప్రభావం చూపే అంశాలను అధ్యయనం చేస్తున్నామని పెట్రోబ్రాస్ అంటోంది.

వచ్చే ఐధేళ్ల పాటు బ్రెజిల్ ఉత్తర తీర ప్రాంతమంతటికీ తాము ప్రాధాన్యత ఇస్తామని పెట్రోబ్రాస్ ఈ నెలలో సంకేతాలిచ్చింది. చమురు అన్వేషణకు కంపెనీ కేటాయించిన 600 కోట్ల డాలర్ల బడ్జెట్‌లో సగం డబ్బును ఇక్కడే ఖర్చు పెడుతుంది. అయితే రాబోయే ప్రభుత్వ అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లులా డా సెల్వా ఈ వెలికితీత ప్రణాళికకు మద్దతు ఇస్తారో లేదో తెలియదు.

ఆయన పార్టీ అధికార ప్రతినిధి మాత్రం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. కానీ చివరిసారి లులా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, రియో డె జానీరో శాంటోస్ సౌత్ బేసిన్‌లో వెలికితీసిన ఆయిల్ నుంచి వచ్చిన ఆదాయాలను సామాజిక కార్యకలాపాల నిధి కోసం ఉపయోగించారు.

కానీ ఈ పగడాల దిబ్బలో ఉన్న జీవవైవిధ్యమే దీనికున్న ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటని ప్రొఫెసర్లు రాడ్రిగో లియావో డె మౌరా, సెజర్ కార్డేరో అన్నారు. ఇతర విషయాలలో కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘‘ఒకవేళ ప్రజలు చేపలను పట్టలేకపోతే, మరో ఆదాయ వనరును వారు వెతుక్కోవాల్సి ఉంది.

బ్రెజిలియన్ తీరంలో వేలాది మంది కుటుంబాలకు ఆహారాన్ని, ఆదాయాన్ని ఈ పగడాల దిబ్బ అందిస్తోంది. పెట్రోబ్రాస్ ప్రణాళికలపై వీరిలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆయిల్ కంపెనీ షిప్‌లతో ఆ సముద్ర దిబ్బ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Must Read

spot_img