తెలుగు సినీ పరిశ్రమతో పాటు, దేశమంతా గర్వించేలా చేసింది ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట. ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో ఆ సినిమా హీరోలు ఎన్‌టీఆర్, రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఇది దేశం మొత్తం గర్వించదగిన విషయమని, ఆర్ఆర్ఆర్ సాధించిన విజయాన్ని దేశమంతా వేడుక చేసుకుంటున్నదని అన్నారు.
నాటు నాటు పాట రాసిన చంద్రబోస్ గారికి, సంగీత దర్శకుడు కీరవాణికి వారు అభినందనలు చెప్పారు. అలాగే దర్శకుడు రాజమౌళి యువ దర్శకులకు రోల్ మోడల్ అని చెప్పారు.