ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తోన్న మూవీ ఎన్టీఆర్ 30. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న ప్రాజక్ట్ కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఈ మూవీ..అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులే అవుతుంది.అప్పటి నుంచి సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ సినిమా ఇంతవరకు మొదలు పెట్టనేలేదు. దీంతో షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది అతిపెద్ద మిస్టరీగా మారింది. అయితే.. ఇప్పుడా సస్పెన్స్‌కి తెరపడింది. ఈ సినిమా షూటింగ్‌కి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
RRR తరువాత స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లాన్ మొత్తం మారిపోయింది. RRRతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాడు. RRR తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. వీరిద్దరి కలయికలో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ రావడంతో ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి నెలలు గడుస్తున్నా మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. దీంతో ఈ మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లేనా? అంటూ అభిమానుల్లో అనుమానం మొదలైంది.
రీసెంట్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టామంటూ కొరటాల శివ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరీల్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో చర్చిస్తున్న ఫొటోలని వదిలారు. దీంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో నడుస్తోందని అంతా భావిస్తున్నారు.ఆ ఫొటోలు షేర్ చేసి కూడా చాలా రోజులు అవుతున్నా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కనుందనే సమచారాన్ని మాత్రం మేకర్స్ అభిమానులకు అందించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ జనవరిలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకోనుందని సంక్రాంతికి పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
రెగ్యులర్ షూటింగ్ ని ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టే అవకాశం వుందని తాజా సమాచారం.ఇదిలా వుంటే హీరో ఎన్టీఆర్ రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక వెకేషన్ కు వెళ్లాడు. అక్కడే న్యూ ఇయర్ వేడుకలు ముగించుకుని తారక్ ఫ్యామిలీతో హైదరాబాద్ తిరిగి రానున్నాడట. వచ్చీ రాగానే కొరటాల మూవీపై దృస్టి పెట్టనున్నాడని సంక్రాంతి రోజున ఈ మూవీని లాంఛనంగా భారీ స్థాయిలో ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో యువ సుధా ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కినేని సినిమా ఆఫీస్ ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.