Homeసినిమాగ్లామ‌ర్‌తోనే కాదు.. విల‌నిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మ‌లు !

గ్లామ‌ర్‌తోనే కాదు.. విల‌నిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మ‌లు !

టాలీవుడ్‌లో లేడీ విలన్స్‌ చాలా అరదుగా కనిపిస్తారు. అప్పట్లో రమ్యకృష్ణ మహిళా ప్రతినాయికగా అలరించగా.. ఇప్పుడు అదే స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చింది నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌. వరుసగా ప్రతినాయికగా అదరగొడుతుంది.

హీరోయిన్లు అంటే గ్లామర్ ఆవిష్కరణతో కనువిందు చేయడమే కాదు.. నటిగా ఎలాంటి పాత్రలను అయినా ఛాలెంజింగ్ గా తీసుకుని నిరూపించాలి. టాలీవుడ్ లో అలాంటి టాప్ 10 హీరోయిన్లు ఎవరున్నారు..? అన్నది ఆరా తీస్తే… నిజానికి అంత ఫ్లెక్సిబుల్ గా నటించగలమని నిరూపించిన వారు అరుదుగానే కనిపిస్తారు. సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసి అద్భుతంగా నటించిన వారి జాబితా విస్త్రతమైనది కాదు. హాలీవుడ్ లో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో అద్భుతంగా నటించే భామల స్ఫూర్తితో ఇటీవల సౌత్ స్టార్ హీరోయిన్లు కొన్ని ప్రయోగాలు చేసి సఫలమవుతున్నారు.

ఇక దక్షిణాది పరిశ్రమలో ఈ తరహా నెగెటివ్ పాత్రలతో మెప్పించిన నాయికల జాబితా చాలానేఉంది.నరసింహా చిత్రంలో నీలాంబరి అనే ప్రతినాయక పాత్రలో రమ్యకృష్ణ అత్యుత్తమ నటనను కనబరిచింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో నువ్వా నేనా? అంటూ పోటీపడి నటించిన రమ్యకృష్ణకు గొప్ప పేరొచ్చింది. మహేష్ బాబు నిజం చిత్రంలో గోపీచంద్ నెగెటివ్ షేడ్ పాత్రలో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని అందించాడు. అయితే గోపీచంద్ తో కనిపించిన రాశీ నెగెటివ్ పాత్రలో అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది.

అడివి శేష్ క్షణంలో అనసూయ నిజమైన సస్పెన్స్ ఎలిమెంట్ ఉన్న పాత్రతో ఆకట్టుకుంది. సినిమాలో ఆశ్చర్యం కలిగించేలా విలన్ షేడ్ తో ఆ పాత్రకు మంచి న్యాయం చేసింది. పుష్ప చిత్రంలోను నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో అనసూయ నటనకు గొప్ప పేరొచ్చింది. పుష్ప సీక్వెల్లోను సుకుమార్ ఆమె పాత్రను ఎన్ లార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది.

నేటితరం అందాల భామల్లో ఆర్.ఎక్స్ 100 చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రతో పాయల్ రాజ్ పుత్ పరిచయమైంది. ఆరంగేట్రమే అద్భుత నటనతో కుర్రకారు గుండెల్లో నిదురించింది ఈ బ్యూటీ. ప్రియుడిని మోసం చేసే వెన్నుపోటు దారుగా పాయల్ నెగెటివ్ షేడ్ పాత్రో అభినయం యూత్ కి పిచ్చిగా నచ్చింది. ఆ తర్వాత పాయల్ వరుస చిత్రాలతో బిజీ అయింది. పందెం కోడి 2, యశోద, క్రాక్ చిత్రాలలో వరలక్ష్మి శరత్ కుమార్ .. మ్యాస్ట్రో చిత్రంలో తమన్నా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ఎవడు లో రెజీనా.. యుగానికి ఒక్కడులో రీమా సేన్.. చారులతలో ప్రియమణి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలతో ఆకట్టుకున్నారు.

Must Read

spot_img