
వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ హిట్ సెంటిమెంట్ తీసుకువస్తున్నాడు. మాస్ ఫార్ముల పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో..తనకు బాగా కలిసోచ్చిన రొమాంటిక్ జోనర్ లోకి వెళ్లిపోయాడు. దీంతో భీష్మతో హిట్ కొట్టిన దర్శకుడితో ఇప్పుడు నితిన్ కొత్త ప్రత్నయం చేస్తున్నాడు.
ఈ మూవీ అయినా హిట్ అవుతుందా ?
అఆ తరువాత అన్ని సినిమాలు వరుస ఫ్లాపుల్ని సొంతం చేసుకున్నాయి. ఆ సమయంలో నితిన్ కు ‘భీష్మ’తో సాలీడ్ హిట్ ని అందించిన మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చాడు వెంకీ కుడుముల. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నితిన్ లోని కొత్త కొణాన్ని పరిచయం చేశాడు. అయితే ఈ మూవీ తరువాత మరోసారి వరుసగా నితిన్ ఫ్లాపుల బాట పట్టింది. చంద్రశేఖర్ ఏలేటీ డైరెక్షన్ లో చేసిన ‘చెక్’, వెంకీ అట్లూరితో చేసిన ‘రంగ్ దే, మాస్ట్రో, కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డిన నమ్మి చేసిన ‘మాచర్ల నియోజక వర్గం’ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్ని అందించి షాకిచ్చాయి. వరుసగా భీష్మ తరువాత నాలుగు ఫ్లాపుల్ని దక్కించుకున్న నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఓ మాసీవ్ యాక్షన్మూవీని చేస్తున్నాడు.
రెగ్యులర్ షూటింగ్ మారేడుమిల్లిలో మొదలైంది. ఇదిలా వుంటే మళ్లీ సాలీడ్ సక్సెస్ లని దక్కించుకోవాలనే ఆలోచనలో వున్న నితిన్ మరోసారి సక్సెస్ కోసం ‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుములనే నమ్ముకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో వీరిద్దరు కాంబినేషన్ లో ఓ విభిన్నమైన నేపథ్యంలో ఓ మూవీని ప్రారంభించబోతున్నారు.ఈ మూఈ స్టోరీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త తాజాగా బయటికి వచ్చి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో హీరో ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ మరో నెల రోజుల్లో చనిపోయే వ్యక్తిగా కనిపించనున్నాడట.
స్క్రిప్ట్ కూడా పూర్తయిందని నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. ఈ మూవీ లైన్ ని బట్టి చూస్తుంటే ప్రభాస్ నటించిన ‘చక్రం’ మూవీకి మరో వెర్షన్ లా ఈ మూవీ వుంటుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. త్వరలో చినిపోతానని తెలిసిన హీరో తల్లితండ్రుల్ని ప్రేమించిన ప్రేయసిని వదిలి ఎక్కడా దూరంగా ఓ అనాధలా బ్రతుకుతూ తన చుట్టూ వున్న వారిని నవ్విస్తూ చివరికి చనిపోవడం తెలిసిందే. నితిన్ – వెంకీల మూవీ స్టోరీ కూడా ‘చక్రం’ మూవీకి
మరో వెర్షన్ ల వుండేలా వుందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.