Homeఅంతర్జాతీయం41వ ప్రధానిగా క్రిస్ ప్రమాణ స్వీకారం...

41వ ప్రధానిగా క్రిస్ ప్రమాణ స్వీకారం…

న్యూజీలాండ్ కొత్త ప్రధానిగా ఇంటలీజెంట్ అని చెబుతున్న క్రిస్ హిప్ కిన్స్ ఎన్నికయ్యారు. దేశపు 41వ ప్రధానిగా క్రిస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసారు. లేబర్ పార్టీ తరపును ప్రధాని పదవికి క్రిస్ ఒక్కరే పోటీ పడగా పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంది. న్యూజిలాండ్ ప్రధానిగా కొనసాగిన జాసిండా అర్డెర్న్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగియాల్సి ఉంది.

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన న్యూజీలాండ్ దేశానికి 41వ ప్రధానిగా బాధ్యతల స్వీకరించారు. లేబర్ పార్టీ తరఫున ప్రధాని పదవికి క్రిస్ ఒక్కడే పోటీ పడగా, పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంది. 44 ఏళ్ల క్రిస్ గతంలో కోవిడ్ నియంత్రణ విభాగాన్ని పర్యవేక్షించడంతో పాటు, పోలీస్ మినిస్టర్‌గా కూడా పని చేశారు. న్యూజిలాండ్ ప్రధానిగా కొనసాగిన జాసిండా అర్డెర్న్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో క్రిస్ ఎన్నిక అనివార్యమైంది. నిజానికి ఆమె పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగియాల్సి ఉంది. తన పదవికి న్యాయంచేయలేకపోతున్నానని, ఈ క్రమంలోనే ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో నూతన ప్రధాని అభ్యర్థి కోసం లేబర్ పార్టీ ప్రయత్నించింది.

ఈ పదవికి క్రిస్ పోటీపడగా, మరెవరూ ఆయనకు పోటీ లేకపోవడంతో ఎన్నుకుంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం క్రిస్ మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా పటిష్టంగా ఉంచేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, గృహ ధరల పెరుగుదలతోపాటు శాంతి భద్రతలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పారు. క్రిస్ పదవీ కాలం ఈ అక్టోబర్‌తో ముగుస్తుంది. అక్టోబర్ 14న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దీంతో మళ్లీ నూతన ప్రభుత్వం కొలువుదీరుతుంది.

రాబోయే ఎన్నికల్లో కూడా లేబర్ పార్టీయే విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్రిస్ మొదటిసారిగా 2008లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వివిధ హోదాల్లో పని చేశారు. రెండేళ్ల క్రితం దేశంలో కోవిడ్ సమస్య ఎదురైనప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవడంలో క్రిస్ పని తీరు అందరినీ ఆకర్షించింది.కోవిడ్ సమయంలో ప్రధానిగా జెసిండా తీసుకున్న కీలక నిర్ణయాలతో దేశం మహమ్మారిని జయించిన విధానం ప్రపంచ దేశాలను ఎంతగానో ఆకట్టుకుంది.

టీవీ షోల్లో లైవ్ ల ద్వారా జెసిండా దేశ ప్రజలకు ఇచ్చిన సందేశాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అంతేకాదు జెసిండా తీసుకున్న నిర్ణయాలతో న్యూజిలాండ్ కోవిడ్ ను జయించిన విధానాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి. తన పాలనతో ప్రజలతో మమేకం అయిన జెసిండా అనూహ్యంగా ప్రధాని పదవినుంచి తప్పుకుని రాజీనామా చేశారు. దేశానికి నాయకత్వం వహించే సత్తా..ప్రధాని పదవికి న్యాయం చేయలేకపోతున్నానని జెసిండా పేర్కొనటం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. జెసిండా తీసుకున్న రాజనామా నిర్ణయాన్ని గవర్నర్ జనరల్ సిండీ కిరో ఆమోదించారు. ఆమె రాజీనామాను ఆమోదించారు.

కాగా 2023 అక్టోబర్‌లో జరగనున్న జనరల్ ఎలక్షన్స్‌లో లేబర్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన హిప్కిన్స్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మరి హిస్కిన్స్ మరోసారి తన పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా? అనేది వేచి చూడాలి.. హిప్‌కిన్స్ 1978 లో హట్ వ్యాలీలో డౌగ్,రోజ్‌మేరీ హిప్‌కిన్స్‌ల కుమారుడు హిస్కిన్స్. తల్లి న్యూజిలాండ్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్‌కు ప్రధాన పరిశోధకురాలుగా పనిచేసారు..వాటర్లూ ప్రైమరీ స్కూల్ ఇంటర్ చదివిన క్రిస్ విక్టోరియా యూనివర్శిటీ ఆఫ్ వెల్లింగ్టన్‌లో అండర్ గ్రాడ్యుయేట్ చదివారు. విక్టోరియా యూనివర్శిటీలో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా గెలిచి పలు కార్యక్రమాలు నిర్వహించారు.

1997లో ఫస్టియర్ స్టూడెంట్ గా ఉన్న సమయంలోనే క్రిస్ పార్లమెంటులో తృతీయ సమీక్ష గ్రీన్ బిల్లును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఆ సమయంలో ప్రభుత్వం ఎంతోమంది విద్యార్ధులను అరెస్ట్ చేసింది.అరెస్ట్ అయినవారిలో క్రిస్ కూడా ఒకరు. విద్యార్ధులపై కేసులు నమోదు చేశారు. పోలీసులు విద్యార్దులను కోర్టులో సమర్పించారు. నిరసనకారులు హింసాత్మకంగా వ్యవహరించారని అందుకే అరెస్ట్ చేశఆమని పోలీసులు కోర్టుకు తెలిపారు. కానీ కోర్టు మాత్రం నిరసన శాంతియుతంగా జరిగిందని..అరెస్టు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని న్యాయమూర్తి తీర్పు చెబుతూ కేసులు కొట్టివేశారు.

హిప్‌కిన్స్ విక్టోరియా యూనివర్శిటీ ఆఫ్ వెల్లింగ్‌టన్ నుంచి రాజకీయాలు, క్రిమినాలజీలో మేజర్‌గా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ డిగ్రీ అందుకున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, హిప్కిన్స్ ఇండస్ట్రీ ట్రైనింగ్ ఫెడరేషన్‌కు పాలసీ అడ్వైజర్‌గా..తార్నాకిలోని టాడ్ ఎనర్జీకి ట్రైనింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఎన్నో ఉద్యోగాలు చేశారు.అలా అంచెలంచెలుగా ఎదిగిన క్రిస్ హిప్కిన్స్ దేశ ప్రధాని అయ్యారు.

Must Read

spot_img