అవతార్ -2కి పోటీగా చిన్న సినిమాలు…

ఈ వీకెండ్ కి ఐదు ఆరు సినిమాలు క్యూ కట్టేశాయి. ఒక సినిమాకు మరొక సినిమాకు పొంతనే లేదు. కోలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఓ హాలీవుడ్ సినిమా కూడా పోటీకి వస్తుంది. గత వారం కంటే.. ఈ సినిమా సినీ లవర్స్ కి ఫుల్ మీల్స్ గ్యారంటీ అనే విధంగా సినిమా ట్రైలర్స్ ఉన్నాయి. ఇంతకీ ఈ వారం ప్రేక్షకులు ముందుకు వచ్చే సినిమాలేంటీ..? ఆ వివరాలు మీకోసం. డిసెంబర్ సెకండ్ వీక్ వచ్చేసింది. గత వారం కంటే ఈ వీక్ సినిమాల సందడి పెరుగుతుందని అందరూ ఊహించారు. అయితే కొంచెం డిఫరెంట్‌గా ఆ సందడి కాస్తా తగ్గింది. పాన్ వరల్డ్ మూవీ అవతార్ 2 థియేటర్లలోకి వస్తుండటంతో పెద్ద చిత్రాలన్నీ సైడ్ అయిపోయాయి. చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. డిసెంబర్ 16న హాలీవుడ్ మూవీ అవతార్ -2 ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. అవతార్ కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో పాండోరాను కోల్పోయిన నావీ తెగ.. సముద్రంతో ఎలాంటి బంధాన్ని ఏర్పర్చుకుంది.? అనే విషయాలను చూపించనున్నారు.


కేజీఎఫ్ , కాంతార వంటి సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ మంచి ఊపు మీద ఉంది. అలాంటి బీజీఎమ్ తో తీమ్ తోనే శాసనసభ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ ప్రధాన పాత్రల్లో రాజేంద్రప్రసాద్, నటి సోనియా అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అరుణ్ విజయ్, పలక్ లాల్వనీ
జంటగా దర్శకుడు జీఎన్‌ఆర్ కుమరవేలన్ తెరకెక్కించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఆక్రోశం. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 16న విడుదల చేస్తున్నారు.

అల్లు వంశీ, ఇతి ఆచార్య ప్రధాన పాత్రల్లో ఎన్‌.ఎస్‌.మూర్తి దర్శకుడిగా రూపొందించిన చిత్రం పసివాడి ప్రాణం. లైవ్‌ కమ్‌ యానిమేషన్‌ టెక్నాలజీతో ఈ మూవీని తెరకేక్కించగా.. ఇందులో సీరియల్ నటి సుజిత కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ 16న థియేటర్ల విడుదల కానుంది. ఇవే కాదు హీరోయిన్ శ్రీలీల కన్నడంలో నటించిన కిస్ మూవీ తెలుగులో ఐ లవ్‌ యు ఇడియట్ పేరుతో రిలీజ్ కానుంది. దీనికి ఏపీ అర్జున్ దర్శకుడు కాగా.. విరాట్ హీరోగా నటించాడు. మరో హీరోయిన్ అపూర్వ గౌడ కీలక పాత్రలో కనిపిస్తుంది. అటు మరో చిన్న సినిమా సుందరాంగుడు కూడా ఈ వారం విడుదలకు సిద్దం అవుతోంది. ఇవి రెండూ కూడా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.