HomeUncategorizedకవల సోదరులతో కొత్త సినిమా పోస్టర్ విడుదల…

కవల సోదరులతో కొత్త సినిమా పోస్టర్ విడుదల…

రామకృష్ణ, హరికృష్ణ కవలలు హీరోలుగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రాన్ని టీఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా రామకృష్ణ, హరికృష్ణ మాట్లాడుతూ…‘సినీ రంగంలోకి రావాలన్నది మా కల ప్రేక్షకుల అభిమానం పొందేలా మంచి చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నాం’ అన్నారు. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మా కంటూ ఓ స్థానం ఏర్ప‌రుచుకునేందుకు టీఎస్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ‌ను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ సంద‌ర్భంగా తొలి చిత్రానికి శ్రీ‌కారం చుట్టినట్లు తెలిపారు.

మా పిల్లలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ ఇద్దరినీ ఈ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకులు ఆద‌రించి, ఆశ్వీరదించాలని కోరారు. నటనలో మంచి పేరు తెచ్చుకుంటారనే నమ్మకం ఉందని, త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నట్లు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్టంట్ మాన్ బ‌ద్రీ మాట్లాడుతూ… హీరోలిద్దరూ గర్వపడేలా ఎద‌గాలని అభిప్రాయపడ్డారు. న‌టుడు అనేవాడు క‌ష్ట‌ప‌డితేనే గొప్పగా ఎదుగుతాడని వివరించారు. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు కొడుకులు న‌టులుగా ఇండ‌స్ట్రీలో త‌మ‌కంటూ ఓ స్థానం సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

అనంతరం ‘బస్ స్టాప్’ కోటేశ్వరరావు, ‘మీలో ఒక్క‌డు’ చిత్ర నిర్మాత కుప్పిలి శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. చిన్న సినిమాలు రావాలని, చిన్న నిర్మాత‌లు న‌టుల పాలిట దేవుళ్లులని అభిప్రాయపడ్డారు. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఫ్యాషన్‌తో సినిమా తీస్తున్నారు. సూప‌ర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ టీఎస్ఆర్ మూవీ మేకర్స్ టీంకు, చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘ర‌చ్చ’ ర‌వి, వి వెంకటేశ్వర్లు, అరుంధతి శ్రీనివాస్, నటుడు విజయభాస్కర్, గబ్బర్ సింగ్ బ్యాచ్ రమేష్, రింజీమ్ రాజు, కోట కరుణకుమార్, ఇండోప్లెక్స్ ప్రభాకర్ , బివి శ్రీనివాస్ , యాదమరాజు , నరేష్ ,రమణ, రేఖ నిరోషా.. పలువురు పాల్గొన్నారు.

Must Read

spot_img