Homeఅంతర్జాతీయంమారుతోన్న టెక్నాలజీ .. కొత్త అప్ డేట్ల

మారుతోన్న టెక్నాలజీ .. కొత్త అప్ డేట్ల

గూగుల్ సరికొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. దీంతో .. ఇంతకీ ఏమిటీ .. ఈ సిమ్.. దీనివల్ల ఒనగూరే లాభాలేమిటి..? అసలు ఈ కొత్త సిమ్ .. సందడేంటో చూద్దామా..

రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ దాడులకు చెక్ పెట్టేందుకు కొత్త టెక్నాలజీ పుట్టుకువస్తూనే ఉంది. దీనిలో భాగంగా సిమ్ స్వైపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే .. గూగుల్ ఈ సిమ్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అయితే పెరిగిపోతున్న మోసాలతో.. ఈసిమ్ కు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోందట.

టెక్నాల‌జీ రోజు రోజుకు చాలా మారిపోతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త అప్‌డేట్ ఇస్తూ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఆండ్రాయిడ్ చాలా ముందు ఉంటుంది. తాజాగా ఆండ్రాయిడ్ 13 వ‌ర్షన్ రాబోతుంది. ఇందులో స‌రికొత్త ఫీచ‌ర్ అందిచ‌బోతుంది గూగుల్. అదే.. ఈ-సిమ్‌. దీని ద్వారా ఒకే సిమ్‌లో రెండు నంబ‌ర్ల‌ను వాడుకొనే వీలు ఉంటుంది. ఈ ఫీచ‌ర్‌ను ఆం డ్రాయిడ్ 13తో అందిస్తున్న‌ట్టు గూగుల్ తెలిపింది. మల్టిపుల్ ఎనేబుల్ ప్రొఫైల్స్ అనే టెక్నాల‌జీతో ఈ -సిమ్ ప‌ని చేస్తుంది. ఇందులో రెండు ప్రొఫైల్స్ ఉంటాయి. దీని ద్వారా ఒకే ఈ-సిమ్‌లో రెండు నంబ‌ర్లు వాడుకోవ‌చ్చు.

గూగుల్ ఈ కొత్త ఫీచర్ను తీసుకురావడం కోసం 2020లో పేటెం ట్ హక్కు ల కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని ఇంజినీరింగ్ ఫిక్స ల్ హార్డ్వేర్లో పరీక్షిస్తున్నట్లు వెల్ల‌డించింది. ఇప్ప టికే ఉన్న సిమ్ ఇం టర్ఫేస్ను ఈ-సిమ్ రెండు డిజిటల్ కనెక్షన్లుగా విభజిస్తుందని నివేదికలో వివరించింది.ఈ-సిమ్ అనేది ఎలక్ట్రానిక్ సిమ్ కార్డు. ప్రస్తుతం మనం వాడే సాధారణ మొబైల్ సిమ్కు డిజిటల్ వెర్షన్నే ఈ-సిమ్ అని పిలుస్తారు. ఈ-సిమ్ టెక్నాలజీలో సిమ్ కార్డు భౌతిక రూపం లో ఉండదు. ఇదొక ‘ఎం బెడెడ్ సిమ్‌.

ఈ – సిమ్ కోసం నెట్వర్క్ ప్రొవైడర్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే కోడ్ ఇస్తారు. దాన్నే ఈ – సిమ్ విధానం అంటారు. ప్రస్తుతం దేశంలో జియో, వీఐ, ఎయిర్టెల్ ఈ సౌకర్యం అందిస్తున్నాయి. దేశీయ టెలికాం రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త పుంతలు తొక్తుతోంది. ఫలితంగా కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే పెద్ద పరిమాణంలో ఉండే సాధారణ సిమ్ కార్డుల స్థానంలో మైక్రో సిమ్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు కొత్తగా ఈ-సిమ్ కార్డులు రానున్నాయి. ఇలాంటి సిమ్ కార్డులను అన్ని ప్రధాన టెలికాం కంపెనీలు అందజేస్తున్నాయి.

చాలా మంది యూజ‌ర్ల‌కు ఇంకా ఈ ఇ-సిమ్ కార్డు గురించి తెలియ‌దు. అయితే దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ-సిమ్ అంటే ఎల‌క్ట్రానిక్ లేదా ఎంబెడెడ్ సిమ్‌. దీని ద్వారా భౌతికంగా సిమ్ అవ‌స‌రం లేకుండానే టెలికాం స‌బ్‌స్క్రిప్ష‌న్ స‌ర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవ‌చ్చు.ఈ-సిమ్‌కు స‌పోర్ట్ చేసే డివైస్‌ల‌లోనే ఇది ప‌ని చేస్తుంది. ఈ డివైస్‌ల‌లో ఈ-సిమ్ ప్రొఫైల్‌ను డిజిట‌ల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే ఒక డివైస్‌లో ఎన్నో ఈ-సిమ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉన్నా..

ఒక స‌మ‌యంలో ఒక ఈ-సిమ్ ప్రొఫైల్ మాత్ర‌మే పని చేస్తుంది. ఒక‌వేళ సిమ్ కార్డుల‌ను బ‌య‌ట‌కు తీయ‌లేని డివైస్‌లైతే ఫోన్‌ను మార్చాల్సిన అవ‌స‌రం లేకుండా మీరు స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను మార్చుకోవ‌చ్చు.ఒక‌వేళ అంత‌ర్జాతీయంగా ప్ర‌యాణిస్తుంటే మీరు సులువుగా ఈ-సిమ్ కార్డ్‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల స్టోర్‌కు వెళ్లి, ప్ర‌త్యేకంగా సిమ్ కార్డు కొనాల్సినఅవ‌స‌రం ఉండ‌దు. దీంతో స‌మ‌యం ఆదా అవుతుంది. ఈ-సిమ్‌ను సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. యాపిల్ తాజాగా తీసుకొచ్చిన కొత్త ఐఫోన్ మోడళ్లలో ఉండే ఒక టెక్నాలజీపై చాలా మందిలో ఆసక్తి నెలకొంది. అదే ‘ఈ-సిమ్’. ప్రస్తుతం మనం వాడుతున్న సిమ్ కార్డులు ప్లాస్టిక్ సిమ్ కార్డులు. ఈ-సిమ్‌ టెక్నాలజీలో సిమ్ కార్డు భౌతిక రూపంలో ఉండదు.

అయితే చిన్న చిప్‌ రూపంలో ఉండే ఈ-సిమ్‌ను స్మార్ట్ ఫోన్‌లో ఎంబెడ్ చేస్తారు. ఇది తీయడం వీలుకాదు. ఇది నానో సిమ్ కన్నా చిన్నగా ఉంటుంది. ఈ-సిమ్ పనిచేయాలంటే అందుకు అనువైన నెట్‌వర్క్ ఉండాలి.ఈ-సిమ్ ఉంటే మరో నంబరు వాడాలనుకున్నప్పుడు ఫోన్‌లో సిమ్ ట్రేను తెరవాల్సిన అవసరం ఉండదు. ఒకే కార్డుపై రెండు ఫోన్ నంబర్లు కలిగి ఉండేందుకు ఈ-సిమ్ వీలు కల్పిస్తుంది.

వ్యాపార, ఉద్యోగ అవసరాల కోసం ఒక నంబరును, వ్యక్తిగత అవసరాలకు ఇంకో నంబరును వాడుకోవచ్చు. అయితే ఏకకాలంలో ఒక నంబరునే వాడేందుకు వీలుంటుంది. వాయిస్, డేటా ప్లాన్లు వేర్వేరుగా తీసుకోవచ్చు. వేరే దేశం వెళ్లినప్పుడు అవసరమైతే డేటా రోమింగ్ సిమ్‌ను కూడా వాడుకోవచ్చు. నెట్‌వర్కులను మార్చుకోవడం, నంబర్లు మార్చి వాడటంలోనే కాదు ఈ-సిమ్‌తో ఇతరత్రా ప్రయోజనాలూ ఉన్నాయి. సరైన సాఫ్ట్‌వేర్‌ ఉంటే ఈ-సిమ్‌లను ‘రీరైట్’ చేయొచ్చు. ఫోన్ కాల్‌తో ఆపరేటర్‌ను త్వరగా, తేలిగ్గా మార్చుకోవచ్చు.

సిమ్‌కార్డును భౌతికంగా రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ-సిమ్‌ను 2016లో సామ్‌సంగ్ గేర్ ఎస్‌2 3జీ మోడల్‌లో వాడారు. యాపిల్ వాచ్ 3లోనూ దీనిని వాడారు. ఈ-సిమ్‌లు బాగా చిన్నవిగా ఉండటంవల్ల, స్మార్ట్ వాచీల్లాంటి చిన్నపాటి డివైస్‌లలో ఎక్కువగా ఉపయోగపడతాయి. గూగుల్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 2లోనూ ఈ-సిమ్ ఉంటుంది. యాపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్ టెన్ ఎస్, టెన్ ఎస్ మాక్స్ మోడళ్లను భౌతిక సిమ్ కార్డు స్లాట్‌తో విక్రయిస్తారు. ఈ ఫోన్లుకావాలిగాని, ఈ-సిమ్ వద్దు అనుకుంటే దీనిని వాడకుండా ఉండొచ్చు.

దీనిని వాడటానికి వీలుకాకపోయినా, ఇబ్బంది ఉండదు. ఈ-సిమ్ ‘గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ ఆధారిత టెక్నాలజీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ నెట్‌వర్కుల సమూహమే జీఎస్‌ఎంఏ. జీఎస్‌ఎంఏ ఆధారిత టెక్నాలజీ కావడం వల్ల ఈ-సిమ్‌ను ఎక్కడైనా వాడొచ్చని చెప్పొచ్చు. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే మాత్రం దీనిని అన్ని దేశాల్లో వాడలేం. ఆస్ట్రియా, భారత్, కెనడా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, జర్మనీ, హంగేరీ, స్పెయిన్, యూకే, అమెరికాల్లో మాత్రమే నెట్‌వర్క్‌లు ఈ-సిమ్‌ను సపోర్ట్ చేస్తాయి. అదీ అన్ని నెట్‌వర్కులు కాదు.

మీరు ఈ 10 దేశాల వెలుపల ఉంటుంటే, భౌతిక సిమ్‌కార్డు అవసరమయ్యే పక్షంలో ఐఫోన్ టెన్ ఎస్, టెన్ ఎస్ మాక్స్‌ మోడళ్లలో ఉండే డ్యూయల్ సిమ్ సామర్థ్యం ఉపయోగపడుతుంది. చైనాలో అయితే రెండు భౌతిక సిమ్‌కార్డులు పెట్టేందుకు వీలుగా ఈ మోడళ్లలోని సిమ్‌ట్రేలో మార్పులు చేశారు. ఇ-సిమ్ టెలికాం పరిశ్రమ భవిష్యత్తు. అదేవిధంగా ఇది ఇప్పుడిప్పుడే భారతదేశంలో అడుగుపెడుతోంది. ఇది మామూలు సిమ్ కార్డు లాంటిది కాదు. మీరు ఇ-సిమ్ తీసుకుంటే, మీరు మీ ఫోన్‌లో ఎలాంటి కార్డ్‌ని చొప్పించాల్సిన అవసరం లేదు.

ఇది మీ సర్వీస్ టెలికాం కంపెనీ వర్చువల్ గా ఏర్పాటు చేస్తుంది. ఇందులో మీరు SIM కార్డ్ లో ఉండే అన్ని ఫీచర్లను పొందుతారు. ఇ-సిమ్‌తో మంచి విషయం ఏమిటంటే, ఫోన్ వేడెక్కినప్పుడు లేదా నీటితో తడిసినప్పుడు ఇ-సిమ్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. చాలా మంది వినియోగదారులు తమ సిమ్ కార్డ్ కొంతకాలం తర్వాత సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తారు కానీ ఇ-సిమ్ విషయంలో అలాంటి ఇబ్బంది ఉండదు. ఇది వర్చువల్ సిమ్, కాబట్టి నష్టం పరిధి అస్సలు ఉండదు. ప్రస్తుతం భారతదేశంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.

వాటిలో చాలా స్మార్ట్ ఫోన్స్ E-SIM కి మద్దతు ఇస్తాయి. ఈ-సిమ్‌ అనేది కొన్ని సంవత్సరాల క్రితమే మార్కెట్లోకి వచ్చినా.అంతగా ప్రాచుర్యం పొందలేదు.కానీ ప్రస్తుతం సైబర్ మోసాలు భారీగా పెరుగుతుండటంతో అత్యధిక మంది ఇపుడు ఈ సిమ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. టెలికాం సంస్థలు, బ్యాంకులు ఎంత జాగ్రత్తగా వున్నా ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇక ‘ఈ-సిమ్‌’ కార్డు వలన మోసాలకు తావుండదని నిపుణులు సూచిస్తున్నారు.

సిమ్ లానే .. కానీ సిమ్ కాదు.. వర్చువల్ మెథడ్ లో రూపొందే ఈ సిమ్ ఫీచర్లు .. భవిష్యత్ తరానికి వరంలా మారనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి డిమాండ్ వస్తుండడంతో, ఇక భవిష్యత్ అంతా ఈ సిమ్ దేనని వీరంతా అభిప్రాయపడుతున్నారు.

Must Read

spot_img