Homeసినిమాలైగర్ ఎఫెక్ట్‌తో ఢీలా పడ్డ పూరీ, బాలయ్యతో కొత్త సినిమా ?

లైగర్ ఎఫెక్ట్‌తో ఢీలా పడ్డ పూరీ, బాలయ్యతో కొత్త సినిమా ?

లైగర్’ సినిమా విడుదలై దాదాపు ఐదు నెలలు కావొస్తుంది. అయితే, ఇంకా గొడవలు సెటిల్ కాలేదని ఫిల్మ్ నగర్ టాక్. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లైగర్’… 2022లో విడుదలైన డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఒకసారి చిరు అన్నారు. ఆ తర్వాత చెర్రీ అన్నారు.. ఇప్పుడు మరో హీరో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని మలిచిన తీరు అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు.

ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. కాగా, ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు రాబట్టి అదరహో అనిపించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఇప్పటకే తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే తన తరువాత చిత్రాన్ని టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట బాలయ్య.

గతంలో వీరిద్దరి కాంబనేషన్‌లో పైసా వసూల్ అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య లుక్ సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. అయితే ఇప్పుడు మరోసారి పూరీ బాలయ్యతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. లైగర్ ఎఫెక్ట్‌తో ఢీలా పడ్డ పూరీ, బాలయ్యతో సినిమా చేసి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడట. ఈ క్రమంలోనే పూరి బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాను బాలయ్య ఓకే చేస్తాడా లేడా అనేది సస్పెన్‌గా మారింది.

Must Read

spot_img