Homeఅంతర్జాతీయంUS రాజకీయాల కొత్త ఆటలు..!

US రాజకీయాల కొత్త ఆటలు..!

అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. కొన్ని రోజుల క్రితం జరిగిన మధ్యంతర ఎన్నికలలో సెనెట్ లో డెమోక్రాట్లకు అతిస్వల్ప ఆధిక్యం లభించింది.. ప్రతినిధుల సభను రిపబ్లికన్లు చేజిక్కించుకోవడంతో ట్రంప్ పార్టీలో మళ్లీ చురుకుదనం మొదలైంది..

అమెరికా రాజకీయాల్లో కొత్త ‘ఆట’ మొదలైందా..? ఉక్రెయిన్ తో పాటు విదేశాలకు అమెరికా చేస్తున్న సాయంపై విచారణ జరుపుతామంటూ రిపబ్లికన్ పార్టీ నేతలు హెచ్చరికలు చేశారా..? ఇక నుంచి ఉక్రెయిన్ కు అమెరికా నుంచి సాయం అందించడం సాధ్యం కాదా..?

గత రెండేళ్లుగా ఏకపక్షంగా సాగుతున్న అమెరికా రాజకీయాల్లో కొత్త ఆట మొదలైంది. ఆ దేశ పార్లమెంటు లోని కీలకమైన ప్రతినిధుల సభ మంగళవారం నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సారథ్యంలోని రిపబ్లికన్ల చేతుల్లోకి వచ్చింది. రిపబ్లికన్‌ల మెజార్టీతో కొత్త సభ కొలువు దీరింది. దీంతో రెండేళ్లుగా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పినట్లు సాగుతున్న అమెరికా రాజకీయాల్లో వేడి రాజుకున్నట్లైంది.

డెమోక్రాట్‌ ప్రభుత్వ బిల్లులు, చట్టాలను అడ్డుకోవటంతో పాటు.. అధ్యక్షుడు బైడెన్‌ నిర్ణయాలు, ఆయన కుటుంబ సభ్యుల కార్యకలాపాలపై విచారణకు సైతం రిపబ్లికన్‌లు సిద్ధమవుతుండటమే రాజకీయ వేడికి కారణం..

గత ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓటమి తర్వాత .. రెండేళ్లుగా రిపబ్లికన్ పార్టీ నిస్తేజంగా మారింది.. ట్రంప్ తో పాటు మరికొందరు నేతలపై ఆరోపణలు, విచారణలతో ఆ పార్టీలో స్తబ్ధత నెలకొంది. అమెరికా పార్లమెంట్ లో రెండు సభలుంటాయి.. సెనెట్, ప్రతినిధుల సభ.. కొద్ది రోజుల క్రితం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సెనెట్ లో డెమోక్రాట్లకు అతిస్వల్ప ఆధిక్యం లభించింది..

ప్రతినిధుల సభను రిపబ్లికన్లు చేజిక్కించుకోవడంతో ట్రంప్ పార్టీలో మళ్లీ చురుకుదనం మొదలైంది.. మరో రెండేళ్లలో అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయటానికి దీన్ని అవకాశంగా భావిస్తున్నారు రిపబ్లికన్లు.. దీంతో రాబోయే ఈ రెండేళ్లలో అనేక చట్టాలపై పీటముడి పడటంతో పాటు బైడెన్ యంత్రాంగం వ్యవహారాలపై ముఖ్యంగా ఆయన కుమారుడు హంటర్ బైడెన్ వ్యాపార కార్యకలాపాలు, ఉక్రెయిన్ తో సంబంధాలపై ప్రతినిధుల సభ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి.. బైడెన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెడతామని కొంతమంది రిపబ్లికన్ ఎంపీలు ఇప్పటికే ప్రకటించారు..

ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న ఆర్థిక సాయానికి కూడా బ్రేకులు వేయాలని రిపబ్లికన్లు ఆలోచిస్తున్నారు.. రష్యాతో యుద్దం చేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా అడ్డూ అదుపులేకుండా సాయం చేస్తోందని రిపబ్లికన్ ల భావన.. స్వదేశంలో అమెరికన్లను మాంద్యంలోకి నెట్టి.. అధిక ధరలు, పెరిగిన ఖర్చుల్లో ముంచుతూ. ఉక్రెయిన్ కు ఖాళీ చెక్కులతో సంతకం చేసి ఇవ్వడం మూర్ఖత్వం అన్నది వారి వాదన..

మధ్యంతర ఎన్నికలకు ముందు దీన్నే ప్రధాన ప్రచారాంశంగా కూడా చేసుకున్నారు.. ఉక్రెయిన్ తో పాటు విదేశాలకు అమెరికాచేస్తున్న సాయంపై విచారణ జరుపుతామంటూ రిపబ్లికన్ పార్టీ కీలక నేత మెకార్తీ ఇప్పటికే ప్రకటించారు.. మొత్తానికి ఈ రెండేళ్లలో అమెరికా రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారబోతున్నాయి..

అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పినట్లు సాగుతున్న అమెరికా రాజకీయాల్లో వేడి రాజుకుంది..

గత రెండేళ్లుగా తమ పార్టీ నేతలపై విచారణలు, దర్యాప్తులతో విరుచుకుపడుతున్న అధ్యక్షుడు జో బైడెన్ కు ముక్కుతాడు వేయాలని రిపబ్లికన్లు తహతహలాడుతున్నారు.. అయితే.. రిపబ్లికన్ పార్టీలోట్రంప్ ను సమర్ధించే, వ్యతిరేకించే గ్రూపులు ఎలా వ్యవహరిస్తాయనే దానిపైనే ఈ రాజకీయం ఆధారపడి ఉంటుంది..తాజా ప్రతినిధుల సభకు కొత్త స్పీకర్ ను ఎన్నుకోవటంలో ఆ పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు.. అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విభేధాలు ఎలా సాగుతాయన్నది కీలకం కాబోతోంది..

అమెరికా కాంగ్రెస్‌ లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీదే మెజార్టీ. అయినప్పటికీ… స్పీకర్‌ ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి నెగ్గలేకపోయారు. నూతన సభ మంగళవారం కొలువుదీరింది. తొలిరోజు సభాపతి ఎన్నిక నిర్వహించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కెవిన్‌ మెక్‌కార్తీ మెజార్టీ ఓట్లు కూడగట్టడంలో విఫలమమ్యారు.

మంగళవారం రాత్రంతా సభలో హైడ్రామా చోటుచేసుకుంది. మూడు రౌండ్లు ఓటింగ్‌ నిర్వహించారు. స్పీకర్‌గా నెగ్గడానికి 218 ఓట్లు అవసరం కాగా, మెక్‌కార్తీకి తొలి రెండు రౌండ్లలో 203 ఓట్ల చొప్పున, మూడో రౌండ్‌లో 202 ఓట్లు వచ్చాయి. దీంతో తదుపరి ఓటింగ్‌ను వాయిదా వేశారు. స్పీకర్‌ లేకుండానే సభ వాయిదా పడింది.

అమెరికా చరిత్రలో 1923 నుంచి చూస్తే… ప్రతినిధుల సభలో తొలి రోజు స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం ఇదే మొదటిసారి. మెక్‌కార్తీ ఇక ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త స్పీకర్‌ ఎన్నికయ్యే దాకా సభలో ఓటింగ్‌ నిర్వహిస్తారు.

మెక్‌కార్తీకి వ్యక్తిగతంగా, రాజకీయంగా చాలామంది ప్రత్యర్థులు ఉన్నారని రిపబ్లికన్‌ ముఖ్యనేతలు భావిస్తున్నారు.. మెక్ కార్తీ స్పీకర్‌గా ఎన్నిక కావడం సొంత
పార్టీలోనే కొందరికి ఇష్టం లేదనేది పలువురి అభిప్రాయం.. మెక్‌కార్తీ స్పీకర్‌ కావడం కష్టమేనని రిపబ్లికన్‌ సభ్యుడు బాబ్‌గుడ్‌ వ్యాఖ్యానించారు. స్పీకర్‌ లేకుండా సభ సంపూర్ణం కాదు. నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం, కమిటీలకు చైర్మన్లను నియమించడం, సభా కార్యకలాపాలు నిర్వహించడం వంటివి స్పీకర్‌ బాధ్యతలే. మెజారిటీ ఉన్నా సొంత పార్టీ అభ్యర్థి స్పీకర్‌గా నెగ్గకపోవడం విపక్షానికి చేదు అనుభవమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

గత రెండేళ్లుగా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పినట్లు సాగుతున్న అమెరికా రాజకీయాల్లో వేడి రాజుకుంది.. డెమోక్రాట్‌ ప్రభుత్వ బిల్లులు, చట్టాలను అడ్డుకోవటంతో పాటు.. అధ్యక్షుడు బైడెన్‌ నిర్ణయాలు, ఆయన కుటుంబ సభ్యుల కార్యకలాపాలపై విచారణకు సైతం రిపబ్లికన్‌లు సిద్ధమవుతుండటమే రాజకీయ వేడికి కారణం..

Must Read

spot_img