బ్రిటన్ రాణి మరణం తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా లోని 5 డాలర్ కరెన్సీ నోట్ల పై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగించాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా తమ స్వదేశీ సంస్కృతి చరిత్రను ప్రతిబింబించేలా కొత్త కరెన్సీ నోటును తీసుకు రానుంది.
- బ్రిటన్ చక్రవర్తి ఆస్ట్రేలియాకూ అధిపతే అయినప్పటికీ.. కరెన్సీ నోట్లపై కింగ్ చార్లెస్ ఫోటోను ఉంచబోమని ఆస్ట్రేలియా ప్రకటించడం వెనక ఉద్దేశ్యం ఏంటి..?
- 5 డాలర్ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ఏ విధమైన మార్పులు చేయనుంది..?
బ్రిటన్ వలస పాలనలో ఉన్న ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ రాణిని తమ దేశాధినేతగానే పరిగణిస్తూ వచ్చింది.. దీనిపై 1999లో రెఫరెండం కూడా నిర్వహించగా.. ఆమెను కొనసాగించాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాణి గతేడాది కన్నుమూయగా.. కరెన్సీ నోటుపై రాణి ఫోటోను తొలగించేందుకు సిద్ధమయ్యింది. ఆమె కుమారుడు చక్రవర్తిగా అయినా తమ కరెన్సీ నోట్లపై కింగ్ ఛార్లెస్ ఫోటోను ఉంచబోమని, తమ దేశానికి చెందిన నేతలు ఫోటోలను ఉపయోగిస్తామని గతేడాది ఆస్ట్రేలియా ప్రకటించింది..ఆస్ట్రేలియాలో ముద్రిస్తున్న కొత్త 5 డాలర్ల నోటు మీద కింగ్ చార్లెస్-3 ఫొటో ఉండదని ఆ దేశ
రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.
“ఆదివాసీ ఆస్ట్రేలియన్ల సంస్కృతి, చరిత్ర”కు నివాళిగా కొత్త నోట్లు ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా తెలిపింది. ప్రస్తుత ఐదు డాలర్ల నోటు మీద క్వీన్ ఎలిజబెత్ II చిత్రం ఉంది. గత ఏడాది రాణి మరణం తర్వాత రాచరికం మీద ఆస్ట్రేలియాలో చర్చ మొదలైంది. “ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం రిజర్వ్ బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది” అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. “5 డాలర్ నోటు డిజైన్‌కు సంబంధించి ఆదివాసీ ఆస్ట్రేలియన్లతో బ్యాంక్ సంప్రదింపులు జరుపుతోంది. కొత్త నోటు రూపకల్పన, ముద్రణకు చాలా సంవత్సరాలు పడుతుంది.

అప్పటి వరకు ప్రస్తుత ఐదు డాలర్ నోటు కొనసాగుతుంది. కొత్త నోటు జారీ చేసిన తర్వాత కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు’’ అని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇతర కరెన్సీ నోట్ల డిజైన్ మార్చే ఆలోచన లేదని ఆర్బీఏ ప్రతినిధి వెల్లడించారు..కొత్త ఐదు డాలర్ల నోటును ఎప్పుడు విడుదల చేయాలో కూడా ఇంకా నిర్ణయించలేదని తెలిపారు…ఈ నిర్ణయాన్ని ఆస్ట్రేలియా ఆదివాసీలు స్వాగతిస్తున్నారు.
బ్రిటిషర్లు రావడానికి 65 వేల సంవత్సరాల ముందు నుంచే ఆస్ట్రేలియా ఆదివాసీలు నివసిస్తున్నట్లు ఇటీవల పరిశోధనల్లో తేలింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా బ్రిటన్ వెలుపల ఉన్న 12 ఇతర కామన్వెల్త్ దేశాలకు బ్రిటీష్ చక్రవర్తి అధిపతి. అయితే ఈ రాచరికం పేరుకు మాత్రమే. చక్రవర్తి నేరుగా ఆయా దేశాల పాలనలో భాగం పంచుకోరు. ఆ దేశ ప్రభుత్వం సూచించిన వ్యక్తిని గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి నియమిస్తారు. గవర్నర్ జనరల్ చక్రవర్తి తరఫున ఆ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారు.
ఆస్ట్రేలియన్ బ్యాంక్ నోట్ల సిరీస్‌లలో కనీసం ఒక డిజైన్‌లోనైనా బ్రిటిష్ రాజు లేదా రాణి చిత్రం కనిపిస్తుంటుంది. ఇప్పటికే చాలా ఆస్ట్రేలియా కరెన్సీ డిజైన్లలో ఆదివాసీ సంస్కృతి అద్దం పట్టే కళలకు స్థానం కల్పించారు.. 1999 ప్రజాభిప్రాయ సేకరణలో ఆస్ట్రేలియన్ ఓటర్లు బ్రిటిష్ చక్రవర్తిని దేశాధినేతగా ఉంచాలని కోరుకున్నారు. 2021లో ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని సవరించింది. “యంగ్ & ఫ్రీ” అనే పదాల స్థానంలో “వన్ & ఫ్రీ ” అనే కొత్త పదాలను చేర్చింది..
4వాయిస్: తమ కరెన్సీపై దివంగత ఎలిజబెత్ రాణి 2 ఫోటోను ఆస్ట్రేలియా తొలగించి, కొత్తవి ముద్రించనుంది. 5 డాలర్ల కరెన్సీ నోటు నుంచి క్వీన్ ఎలిజబెత్ II ఫోటోను తొలగించి స్వదేశీ సంస్కృతి, చరిత్రలను ప్రతిబింబించేలా, గౌరవించేలా కొత్త డిజైన్‌ను రూపొందించనున్నట్టు ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ గురువారం ప్రకటించింది. ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత, మద్దతుతో నోట్లను మార్చుతున్నట్టు ఆ దేశ కేంద్ర బ్యాంకు ఓ ప్రకటన వెలువరించింది. ప్రస్తుత 5 డాలర్ల నోటుకు ఒకవైపు క్వీన్ ఎలిజబెత్ 2 ఫోటో, మరోవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనం ఉంటుంది. కేవలం ఎలిజబెత్ ఫోటోను మాత్రమే తొలగించి, పార్లమెంట్ భవనాన్ని కొనసాగిస్తామని పేర్కొంది.
- గతేడాది సెప్టెంబరులో క్వీన్ ఎలిజబెత్ మరణం ఆస్ట్రేలియాలో రాజ్యాధినేత భవిష్యత్తు గురించి చర్చకు దారితీసింది..
1999 నాటి ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటీష్ చక్రవర్తిని దేశాధినేతగా కొనసాగించాలని తీర్పు వచ్చింది. రాణి మరణం తర్వాత బ్రిటిష్ చక్రవర్తి అయిన ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ III.. బ్రిటన్ వెలుపల ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ఇతర 12 కామన్వెల్త్ రాజ్యాలకు అధిపతిగా ఉన్నారు. అయితే ఈ పదవి చాలావరకు ఉత్సవ విగ్రహం లాంటిది. వాస్తవానికి క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత తమ కరెన్సీ నోట్లపై కింగ్ ఛార్లెస్ ఫోటోను ఉంచబోమని, తమ దేశానికి చెందిన నేతలు ఫోటోలను ఉపయోగిస్తామని గతేడాది ఆస్ట్రేలియా ప్రకటించింది. 5 డాలర్ల నోటుపై రాణి చిత్రాన్ని చేర్చాలనే నిర్ణయం ఆమె చక్రవర్తి హోదాకు విరుద్ధంగా ఆమె వ్యక్తిత్వానికి సంబంధించిందని అధికారులు తెలిపారు.
రాజ్యాంగ మార్పు, స్థానికుల గుర్తింపు, వారి జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలపై సంప్రదింపులు జరపడానికి అవసరమైన ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది.. సెప్టెంబర్ 22 లో క్వీన్ ఎలిజిబెత్ మృతి చెందారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్‌కు రాజు హోదా వచ్చింది. మామూలుగా అయితే రాణి ఉన్న నోట్ల స్థానంలో రాజు చిత్రాన్ని ముద్రించాలని భావిస్తారు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.
5 డాలర్లపై ఒక వైపు ఉండే బ్రిటన్ రాణి ఉన్న నోట్ల స్థానంలో స్వదేశీ సంస్కృతిని తెలియజేసేలా కొత్త చిత్రం రానుందని సంకేతాలిచ్చింది. బ్రిటన్ రాణి లేదా రాజు చిత్రం దాదాపు 8 దేశాల కరెన్సీలో ఉంటుంది. తమ దేశీయ ప్రజలు ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికత అని గుర్తించడానికి… 2021లో ఆస్ట్రేలియా కీలక మార్పులు చేసింది. అధికారికంగా తన జాతీయ గీతాన్ని సవరించింది.
కొత్త కరెన్సీ నోటు రూపకల్పనలో స్వదేశీ సమూహాలతో సంప్రదింపులు జరుపుతామని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కొత్త నోటు రూపకల్పన, ముద్రణకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ప్రస్తుత నోటు చెలామణిలో ఉంటుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్వదేశీ నినాదం ఎత్తుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా బ్రిటన్ వెలుపల ఉన్న 12 ఇతర కామన్వెల్త్ దేశాలకు బ్రిటీష్ చక్రవర్తి అధిపతి. అయితే ఈ రాచరికం పేరుకు మాత్రమే. చక్రవర్తి నేరుగా ఆయా దేశాల పాలనలో భాగం పంచుకోరు. ఆ దేశ ప్రభుత్వం సూచించిన వ్యక్తిని గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి నియమిస్తారు.