Homeఅంతర్జాతీయంఅప్పుడు చైనా… ఇప్పుడు దక్షిణ కొరియా మరో కొత్త వైరస్

అప్పుడు చైనా… ఇప్పుడు దక్షిణ కొరియా మరో కొత్త వైరస్

ప్రపంచం ఇప్పుడు వైరస్ ప్రమాదాలకు వేదికగా మారింది. నిత్యం ఏదో రకమైన ప్రమాదకరమైన వైరస్ వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త వైరస్ లు, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ లక్షలాది ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నాయి. ఇప్పటికే కరోనా, ఎబోలా, మంకీపాక్స్, వైరస్ లతో సతమతమవుతుంటే..ఇప్పుడు మరో కొత్త వైరస్ పుట్టుకువచ్చింది. అయితే ఈసారి అది దక్షిణ కొరియా నుంచి వచ్చింది.

ఇప్పటికే చైనాలో సరికొత్త రకం కొవిడ్‌-19 వ్యాప్తితో ఆసియా దేశాలు వణికిపోతున్నాయి. అదే వరుసలో తాజాగా మెదడుకు సోకే అరుదైన ఇన్ఫెక్షన్‌ దక్షిణ కొరియాలో వెలుగు చూసింది. ఇది సోకిన కారణంగా ఇప్పటికే ఒక వ్యక్తి ప్రాణాలు కూడా గాలిలో కలసిపోయాయి. ‘నెగ్లెరియా ఫౌలెరి’గా పిలిచే ఈ ఇన్ఫెక్షన్‌ సోకి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ ఇన్ఫెక్షన్‌ను మెదడును తినే అమీబాగా చెబుతున్నారు.

ఈ వ్యక్తికి థాయ్‌లాండ్‌లో సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇతడు మూడు నెలలు అక్కడే ఉండి.. డిసెంబర్‌ 10న దక్షిణ కొరియాకు చేరుకొన్నాడు. ఈ విషయాన్ని ‘ది కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ’కేడీసీఏ’ ధ్రువీకరించింది. నెగ్లెరియా ఒక రకమైన ఏక కణ సూక్ష్మజీవి. సాధారణంగా అమీబాలు ప్రకృతిలో చాలా చోట్ల ఉంటాయి.

People suspected of being infected with the new coronavirus wait for diagnostic tests at a medical center in Daegu, South Korea.

మంచినీరు, నీటి లీకేజీల్లో, కాల్వలు, నదులు, మట్టిలో ఇవి జీవిస్తుంటాయి. అన్నిరకాల అమీబాలు మనుషుల ప్రాణాలు తీయవు. కానీ, వీటిల్లో నెగ్లెరియా రకం అమీబా మాత్రం మనుషులకు సోకుతుంది. అమెరికాకు చెందిన ‘సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ ప్రకారం నెగ్లెరియా ఫౌలెరి ముక్కు ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఆ తర్వాత మెదడుకు చేరుతుంది. అక్కడ మెదడులోని కండరాలు, నరాలను దెబ్బ తీస్తుంది. ఇది ‘ప్రైమరి అమీబిక్‌ మెనింజో ఎన్‌సైఫలిటిస్‌’ అనే ఇన్ఫెక్షన్‌ను కలుగజేస్తుంది. ఇది ప్రాణాంతకమైంది. ముఖ్యంగా వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్‌ వస్తుంది. ప్రస్తుతం దీని తీవ్రత గురించి డబ్లూహెచ్ ఓ ఆధ్యయనం చేస్తోంది..

పీఎంఏ ఇన్ఫెక్షన్‌ సోకితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, ముక్కు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్‌ తీవ్రమైతే మూర్ఛ, గందరగోళం వంటి లక్షణాలతోపాటు.. రోగి కోమాలోకి కూడా పోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌ చాలా తీవ్రమైంది. అమెరికాలో 1962 నుంచి 2021 వరకు 154 మందిలో ఇది కనిపిస్తే.. వారిలో కేవలం నలుగురు మాత్రమే బతికారు.

ఇది మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకపోవడం మాత్రం ఊరటనిస్తుంది. కొన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ప్రభావవంతమైన చికిత్సను ఇప్పటికీ కనుగొనడం జరగలేదు. కొన్ని రకాల ఔషధ సమ్మేళనాలతో దీనికి వైద్యం చేస్తారు. కొన్ని మందులు ప్రభావవంతంగా పనిచస్తున్నాయి.

యాంఫోటెరసిన్‌ బి, అజిత్రోమైసిన్‌, ఫ్లూకోనజోల్‌, రిఫాపిన్‌, మిల్టెఫోసిన్‌, డెక్సామెథాసిన్‌ వంటి వాటిని మెదడును తినే అమీబా చికిత్సకు వాడతారని సీడీసీ తెలిపింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా 1937లో అమెరికాలో తొలిసారి వెలుగు చూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. మనిషి ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మెదడును తినేస్తుంది. ఫలితంగా మనిషి మరణానికి కారణం అవుతుంది.

అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. అయినా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వ్యక్తి నివసించే ప్రాంతంలోని ప్రజలు.. కొలనులు, కాలువల్లోకి దిగి ఈత కొట్టవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇప్పుడు దక్షిణ కొరియాలోనూ వెలుగుచూసింది. ప్రస్తుతుం ప్రపంచం చాలా రకాలైన వైరస్ ల దాడులను ఎదుర్కుంటోంది. వచ్చిన ప్రతీ వైరస్ పై పరీక్షలు జరుగుతున్నాయి. వాటిని నివారించేందుకు వేలాదిగా శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే వైరస్ లకు వ్యాక్సిన్ లు మందులు తయారుచేయడం అంత తేలికైన విషయం కాదు. వేలాదిగా శాంపిళ్లను తీసుకోవడంతో పాటు వాటికి జినోమ్ సీక్వెన్సింగ్ చేయడం జరుగుతుంది.

ఆపై మందులు వ్యాక్సిన్లు తయారైనా వాటిని క్లినికల్ టెస్ట్ లు కూడా చేయాల్సి ఉంటుంది. అందుకే ఆలస్యం అన్నది అనివార్యం అవుతోంది.

Must Read

spot_img