Homeఆంధ్ర ప్రదేశ్నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసిపిని కాకర్ల టెన్షన్ !!!

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసిపిని కాకర్ల టెన్షన్ !!!

నెల్లూరులో ఉదయగిరి నియోజకవర్గం అంటేనే రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. అక్కడి ప్రజల మనసు దోచుకొవాలంటే, అంత ఆషా మాషీ కాదు.. అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా కాకర్ల జపం చేస్తున్నారట నేతలు. సడన్ గా ఈ కాకర్ల ఎవరు .. అంతలా నాయకులు .. ఎందుకు ఆయన జపం చేస్తున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాకర్ల సురేష్ ఓ ఎన్నారై ఉదయగిరి ప్రాంతీయుడు అమెరికాలో స్థరపడి సొంత గడ్డపై మక్కువతో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసారు.

తన సొంత నిధులతో నియోజకవర్గంలో మెడికల్ క్యాంపులు పెట్టించి ఆరోగ్యపరంగా తన వంతు సాయం చేస్తున్నారు. ఎవరైనా చనిపోతే లక్షకు తగ్గకుండా ఆర్దిక సాయం చేస్తున్నారట. అంతేకాదు యువకులకు క్రికెట్ టోర్నమెంట్ లు పెట్టించి యువత మనసు దోచుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఓరైతు ఇంట్లో గేదెలు చనిపోతే లక్షరూపాయలు ఆర్ధిక సాయం చేసారట. ఇది తెలిసిన ఉదయగిరి నేతలు వామ్మో వీడు మామూలోడు కాదురా..బుజ్జి అంటూ తెగ పొగుడుతున్నారట. ఇంతలా సేవా కార్యక్రమాలు .. ఏం ఆశించి చేస్తున్నారనే చర్చ ఇప్పుడు వాళ్లు లేకుండా పోలేదు…

ఆ ప్రశ్నలకు సమాధానం కూడా ఉందట.. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. ఆయన రాజకీయాల్లో కి వస్తున్నారట. అందుకే తన నియోజకవర్గ ప్రజలకు ముందు తన వంతు సేవలు అందించి.. ఆతరువాత ఎమ్మెల్యే గా పోటీ చేయాలన్నది ఆయన అశయమని తన సన్నిహితులు చెబుతున్నారు. ఇంతకీ రాజకీయాల్లో ఏపార్టీ తరుపున పోటీ చేస్తారన్నది కూడా ముందుగానే క్లారిటీ ఇచ్చి మరీ సేవాకార్యక్రమాలు మెదలెట్టారనే టాక్ దండిగా నడుస్తోంది. ఎన్నారై కాకర్ల సురేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడు. అంతేకాదు చంద్రబాబు, లోకేష్ తో మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయట.

ట్రస్ట్ మెదలెట్టే ముందు అధిష్టానం ఆశీస్సులు తీసుకొని మరీ వచ్చాడట కాకర్ల. దీంతో తెలుగు దేశం పార్టీ శ్రేణుల సహకారం కూడా మెండుగా ఉండడంతో కాకర్ల సక్సెస్ కు తొలిమెట్టు పడింది. ఓ పక్క టిడిపి నేతలతో మంతనాలు జరుపుతూ మరో పక్క ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తున్నారు కాకర్ల. దీంతో .. ఇక ఆయన ఏంట్రీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో లేదో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాకర్ల రాజకీయాల ఎంట్రీ .. సెగ్మెంట్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.

ఆయన వచ్చిన కొత్తలొ కొంతమంది టిడిపి నేతలు దూరంగా ఉన్నప్పటికీ కాకర్ల మంచితనం, సేవా గుణం అందరినీ ఆకట్టుకుందట. ఇప్పుడు ఎక్కడ చూసినా కాకర్ల జపం చేస్తున్నారట నేతలు. రాజకియాలంటే అంత సులభం కాదు యాబై కోట్లు పెట్టాలబ్బా అని కొందరు అంటుంటే, కాకర్లకు వందకోట్లు పెట్టె స్తోమత ఉందబ్బా డోంట్ వర్రీ అని ఆయన అనుచరులు కూడా బదులిస్తున్నారట. ఇదంతా చూసిన కాకర్ల కాస్త స్పీడ్ పెంచారట.. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు రెండు లక్షల సాయం, వికలాంగుల కు ఆర్థిక సాయం చేయటమేకాకుండా ఇబ్బందుల్లొ ఉన్న పార్టీ నేతకు అయిదు లక్షల సాయం చేసి డోస్ పెంచేశారట.

ఇదిలా ఉండగా చంద్రబాబు కందుకూరు పర్యటనలో చనిపోయిన కుటుంభాలకు పదిహేను లక్షల ఆర్థిక సాయం అందించి కాకర్ల దగ్గర క్యాష్ ఫుల్లుగా ఉఙదని నిరూపించారట.అసలే ఉదయగిరిలో అంతంత మాత్రం నాయకులను అస్సలు పట్టించుకోరు.. అలాంటిది కాకర్ల సురేష్ సరిపొతాడా అన్న సందేహం ఇక్కడ లేకపోలేదు. కానీ అతితక్కువ కాలంలొ కాకర్ల వాటన్నింటికి సమాధానంగా తన పనితనమే నిదర్శనమని ఫ్రూవ్ చేసుకున్నాడు. అనుమానాలకు తావులేకుండా ప్రతి ఒక్కరితో రాజకీయ అడుగులు ముందుకు వేశాడు. ఇప్పుడు అందరూ ఆయన జపం చేసేలా చేసుకున్నాడు.

టిక్కెట్ రేసులో ఉంటాడా ..అనుకున్న వాళ్ల నోళ్లు మూయించేలా టికెట్ రేస్ లో ముందంజలో ఉన్నారు. ఇక ఇక్కడే వైసిపి నేతలకు వణుకు స్టార్ట్ అయింది. అసలే సమస్యలతో సతమతమవుతున్న మేకపాటికి కాకర్ల రూపంలో కొత్త తలనొప్పి మెదలైందట. కాకర్ల స్పీడ్ కు బ్రేకులెలా వేయాలా అన్న అంతర్మధనంలో పడ్డారు వైసిపి నేతలు..ఈ కొత్త నేత దూకుడుకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలనే పనిలో ఉన్నారట వైసిపి శ్రేణులు. కాకర్ల సురేష్ కు అమెరికా లో ఎన్నారైలతో మంచి సన్నిహిత సంబందాలు ఉన్నాయి.

ఒకరకంగా కాకర్ల సురేష్ ను రాజకీయాల్లో కి వెళ్లాలని తన మిత్రులు సూచన మేరకే వచ్చారట. అయితే రాజకియాల పేరుతో ప్రజలను ఇబ్బంది పట్టకుండా ముందుగా తనవంతు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందిన తరువాతే రాజకియ అరంగేట్రం చేయాలన్నది కాకర్ల సురేష్ ప్రధాన లక్ష్యమట. అందుకె కాకర్ల సురేష్ పేరిట చారిటీ ఏర్పాటు చేసి అందులో ఎంత మేరకు సక్సెస్ అవుతామా అని ముందుకు వచ్చారు కాకర్ల. అయితే నియోజకవర్గం లో పర్యటించేకొద్ది ఇక్కడున్న సమస్యలు ప్రజల అనుభ విస్తున్న బాధలు స్యయంగా చూసి చలించి పోయారట కాకర్ల.

అందుకే ఎక్కడ కష్టమొచ్చినా తన వంతు ఆర్థిక సాయం అందించటమే కాకుండా.. తన మనుషుల చేత ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయిస్తున్నారట. ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు వచ్చినా ఉదయగిరి నియోజకవర్గంలో వలసలను నివారించలేక పోయారు. అందుకు ప్రధాన కారణం, సాగు నీరు లేకపోవడమే ఏళ్ల తరబడి దారిద్ర్యం అనుభవిస్తున్న ఉదయగిరి ప్రజలను ఆదుకోవాలంటే, చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి దానికి తోడు సంపన్నుడై ఉండాలి.. ఈ రెండు క్వాలిటీలు కాకర్ల సురేష్ లో ఉన్నాయని ఓ సెక్షన్ నేతలు అభిప్రాయ పడుతున్నారు.

అయితే కాకర్ల సురేష్ కూడా తాను ఎమ్మెల్యే అయితే తప్పకుండా సీతారామ్ సాగర్ సాధిస్తానని, పెద్దిరెడ్డి పల్లి రిజర్వాయర్ పూర్తిచేసి ఉదయగిరి ప్రజల కల నెరవేర్చిన తరువాతే రాజకీయాలు విరమించుకుంటానని, అంతవరకు తాను ఇక్కడ అభివృద్ధి కై పోరాడతానని తన సహచరులతో ఆన పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. కాకర్ల సురేష్ నిజంగా ఆ పని చేయగలిగితే ఉదయగిరి చరిత్రలో మరో పేజీ తనకంటూ ఉంటుందనే విషయాన్ని ఆయన గుర్తెరిగి పని చేయాల్సి ఉంది.

అప్పుడెప్పుడో మాజీ మంత్రి మాదాల జానకిరాం ఒక్క సారి ఎమ్మెల్యే అయితే 3 వేల ఇల్లు మంజూరు చేయించారు. ఆయన చేసిన మేలు ఇప్పటికీ ఉదయగిరి ప్రజలు మరువలేదు. అంతేకాదు మెట్ట ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే నాగార్జునసాగర్ కుడికాలువ రావాలని, మాదాల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రభుత్వాల్లో కదలిక తెచ్చాడు. ఆయన ఉదయగిరి ప్రజలకు చేయాలనుకున్న పనులను కాకర్ల సురేష్ ఆశయంగా తీసుకొని పనిచేస్తే అంతకు మించిన సేవ మరొకటి ఉండదని ఉదయగిరి ప్రజలు అనుకుంటున్నారు.

మాజీ మంత్రి మాదాల జానకి రామ్ ఎప్పుడూ ఉదయగిరి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉండేవారు. ప్రస్తుతం కాకర్ల సురేష్ కూడా ఉదయగిరి నియోజక వర్గానికి ఏదో ఒకటి చేయాలని తపిస్తున్నారు‌. ఉదయగిరి ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజల తలరాతలను మారుస్తారని కాకర్లవర్గీయులు అంటున్నారు. దీంతో మరి ఉదయగిరి రాజకీయాల్లో కాకర్ల ఏమాత్రం సక్సెస్ అవుతారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. స్థానికంగా మేకపాటికి వీస్తోన్న వ్యతిరేక పవనాలు సైతం ఆయనకు ప్లస్ అవుతాయన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కాకర్ల సెగ్మెంట్లో కాక రేపుతారన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ .. ఓ రేంజ్ లో సాగుతుందన్న అంచనాలు రాజకీయంగా హీట్ ను రగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకర్ల రాజకీయాలు .. ఏ మేరకు సక్సెస్ అవుతున్నాయన్నదే .. చర్చనీయాంశంగా మారింది. చూద్దాం ముందు ముందు ఏంజరుగుతుందో……

Must Read

spot_img