Homeసినిమాభర్త కోసం కేరీర్ త్యాగం చేసిన నయన్..

భర్త కోసం కేరీర్ త్యాగం చేసిన నయన్..

కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అందాల భామ నయనతార. వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతు లేడీ సూపర్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకుంది నయన్. ఈ వయస్సులో కూడా ఆమెకి స్టార్ హీరోలకి జోడీగా నటించే ఛాన్స్ లు వస్తున్నాయి. అలాగే సోలోగా కూడా నయనతార కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇటు తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు గత ఏడాది దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి లాంగ్ రిలేషన్ షిప్ ని పెళ్లితో నెక్స్ట్ స్టేజ్ కి తీసుకొని వెళ్ళారు. ఇక విగ్నేష్ శివన్ పెళ్లి తర్వాత కూడా నయనతారకి నటించే ఛాన్స్ ఇస్తున్నాడు. ఇద్దరి అభిప్రాయలు, అభిరుచులు కూడా బాగా కలిసాయి.

పెళ్లి అయినప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం హీరోయిన్ గా సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తోంది. మరో పక్క భర్త కూడా తన సినిమాలలోనే ఆమెని హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే విగ్నేష్ శివన్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మించడానికి సిద్ధమైంది. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కబోయే ఈ సినిమాలో నయనతారని హీరోయిన్ గా ఎంపిక చేశారు. అజిత్ కుమార్ నయనతార కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వస్తే ఆ మూడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

దీంతో మరోసారి తమ పెయిర్ సక్సెస్ అవుతుందని అందరూ భావించారు. అయితే అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఈ పాటికి సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళేది. అయితే ఈ మూవీ నుంచి ప్రస్తుతం దర్శకుడిగా విగ్నేష్ శివన్ ని తప్పించినట్లు తెలుస్తుంది. దీని కారణం హీరో అజిత్ కు కథ నచ్చకపోవడం. దీంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ దర్శకుడు విగ్నేశ్‌ శివన్‌ను చిత్రం నుంచి తొలగించింద. దీంతో విగ్నేష్ చాలా హర్ట్ అయ్యాడట. తనను లైకా ప్రొడక్షన్స్ తప్పుకోమనడంతో చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు విగ్నేష్. అయితే అజిత్ కుమార్ ప్రాజెక్ట్ నుంచి విగ్నేష్ ని తప్పించడంతో బాద పడుతున్న భర్తను చూసి నయనతార కూడా అవమానంగా భావించిందనే మాట వినిపిస్తుంది.

దీంతో ఆ మూవీ నుంచి తాను కూడా తప్పుకొని లైకా ప్రొడక్షన్ ని షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇకపై తాను అజిత్ కుమార్ ఏ సినిమాలో కూడా నటించకూడదు అని నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుందనే మాట కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తుంది. తన భర్తని అవమానిస్తే తనని కూడా అవమానించినట్లే అని నయనతార లైకా నిర్మాతలకి చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా తన భర్త కోసం కేరీర్ ను కూడా వదులుకోవడానికి సిద్ద పడిన నయన్ ప్రేమ గురించి నెట్టింట్లో నయనతార ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి అజిత్‌, నయనతారల ది హిట్‌ కాంబినేషన్‌ అనే చెప్పాలి. ఇంతకు ముందు బిల్లా, ఆరంభం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాల్లో వీరు కలిసి నటించారు. తెరపై వీళ్లిద్దరూ కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అవుతుంది.

Must Read

spot_img