RRR సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పలు పురస్కారాల్ని దక్కించుకుంటున్న ‘RRR’ రీసెంట్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ‘నాటు నాటు ‘పాటకు గానూ దక్కించుకోవడమే కాకుండా ఆస్కార్ అకాడమీ అవార్డుల్లోనూ నామినేషన్ ని దక్కించుకుంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడిగా అస్కార్ గ్యారంటీ అనే వార్తలు వినిపించాయి.
సోషల్ మీడియా వేదికగా జోరుగా అభిమానులు ప్రచారం కూడా చేశారు. ‘కొమురం భీముడో’ సాంగ్ కు సంబంధించిన సీన్ లో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకు గానూ తనకు ఆస్కార్ గ్యారెంటీ అని అంతా భావించారు కూడా. కానీ ఎన్టీఆర్ కనీసం ఆస్కార్ బరిలో నామినేషన్ ని సాధించలేకపోయాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆస్కార్ అవకాశం చేజారిందే అంటూ నిట్టూర్చారు.
ఆస్కార్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందేనని క్లారిటీ రావడం, ‘RRR’ కేవలం బెస్ట్ ఒరిజినల్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు మాత్రమే నామినేషన్ ని దక్కించుకోవడంతో ఎన్టీఆర్ అభిమానుల దృష్టి ఇప్పుడు మరో వైపు మళ్లింది. అదే నేషనల్ అవార్డ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్.. ఇప్పుడు అభిమానుల్లో ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.’కొమురం భీముడో’ పాటకు ముందు పాట సమయంలో ఎన్టీఆర్ పలికించిన హావ భావాలు ప్రతీ ఒక్కరినీ అబ్బుర పరిచాయి.. ఈ సన్నివేశాలే ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్ ని తెచ్చి పెడతాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయినా కన్నడ హీరో విషయంలో మాత్రం ఎన్టీఆర్ అభిమానులు భయపడుతున్నారట. ఆ కన్నడ హీరో మరెవరో కాదు రిషబ్ శెట్టి. ‘కాంతార’ మూవీలోని చివరి 20 నిమిషాల్లో రిషబ్ శెట్టి ప్రదర్శించిన నటన ప్రతీ ఒక్కరికి గూస్ బంప్స్ ని తెప్పించి అబ్బుర పరిచింది. రీసెంట్ గా ముంబాయిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల వేడుక జరిగింది. ఇందులో రిషబ్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా ‘కాంతార’ మూవీకి గానూ అవార్డుని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ క్రిటిక్స్ కొంత మంది రిషబ్ పై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా రిషబ్ కు 2022కు గానూ ఉత్తమ నటుడిగా పలు అవార్డులు దక్కాలంటూ కోరుకున్నారట. ఈ నేపథ్యంలోనే రిషబ్ కు పెరుగుతున్న ఆదరణ జాతీయ స్థాయిలో అతన్ని రికమెండ్ చేస్తున్న తీరు…ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కలవరానికి గురిచేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.