2023ని టార్గెట్ చేసిన న్యాచురల్ స్టార్…

న్యాచురల్ స్టార్ నాని నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఈయన మొదటి నుండి విభిన్న కథలతో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. 2022లో హీరోగా కాస్తా డిసాపాయింట్ చేసినా… నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. అయితే 2023లో మాత్రం ఫుల్ మీల్స్ ఉంటుందని నాని హింట్ ఇచ్చాడు.

నేచురల్‌ స్టార్‌ నాని ఈ ఏడాది మంచి జోష్‌లో వున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ తన ముద్ర వేసుకున్నారు. హిట్ సిరీస్ తో నాని నిర్మాతగా ఫుల్ సక్సెస్ అయ్యాడు. హిట్ 3 కేసులో తానే స్వయంగా ఎంటర్ అయ్యాడు. తన సోదరి ప్రశాంతి దర్శకత్వంలో మీట్‌ క్యూట్‌ సినిమాను నిర్మించి సక్సెస్‌ సాధించుకున్నారు. తాజాగా హిట్‌ 2 సినిమాను అడవిశేష్‌తో చేసి సక్సెస్‌ బాట వేశాడు. ఈ సినిమా యూత్‌కు బాగా నచ్చింది. ఇటీవలే పలు థియేటర్లకు వెళితే అనూహ్యంగా యువత ఆదరణ పొందింది. కాగా ఇటివల తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కిల్టింగ్‌ లుక్‌తో ఇలా దర్శనమిచ్చాడు. స్పెసల్‌ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు తెలియజేశాడు.

2022 చక్కటి వీడ్కోలు పలుకుతున్నట్లు ఆయన మాటలు బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది అంటే సుందరానికి మంచి సినిమా అని చేశాం. చాలామందికి చేరువవుతుందని అనుకున్నాం. కొన్ని కారణాలవల్ల పూర్తి స్థాయి ఫలితం రాలేదు. అయినా తర్వాత సినిమాలు మంచి ఆదరణ పొందాయని. అన్నారు. త్వరలో మాస్‌ ధమాకాగా దసరా చిత్రంతో రాబోతున్నట్లు చెప్పాడు. ఈ సినిమా తర్వాత పాన్‌ ఇండియా మూవీ ఒకటి చేయబోతున్నట్లు వెల్లడిరచారు. అయితే ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలు 2023లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తర్వాత కూడా నాని ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొత్త దర్శకుడు చెప్పిన కథ నానికి బాగా నచ్చడంతో ఆయనకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దర్శకుడు ఎవరనే విషయం మీద క్లారిటీ లేదు కానీ త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. నాని సదరు దర్శకుడితో కాంబినేషన్లో సినిమా చేసేందుకు ఒక ప్రఖ్యాత ప్రొడక్షన్ హౌస్ కూడా సిద్ధమైందని హీరోయిన్ అలాగే ఇతర నటీనటులను కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత అధికారికంగా సినిమాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.