మళయాళీ సినిమాలో కీలక పాత్ర పోషించిన నడక్కల్ ఉన్నికృష్ణన్ .. హఠాన్మరణం .. చర్చనీయాంశంగా మారింది. దీంతో మళ్లీ తెరపై జంతువుల వినియోగంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.
సినిమాల్లో పక్షులు, జంతువుల వాడకం .. పూర్వకాలం నుంచి ఉంది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వీటి వాడకం తగ్గినా, ఇప్పుడు మరో రూపంలో ఇవి .. తెరపై సందడి చేస్తూనే ఉన్నాయి.
2021 మలయాళం-భాష యాక్షన్ థ్రిల్లర్ అజగజంతారామ్ బాక్సాఫీస్ వద్ద చాలా ఆవేశాన్ని సృష్టించింది. టిను పప్పచ్చన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోని వర్గీస్ మరియు కిచ్చు టెల్లస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏది ఏమైనప్పటికీ, ఇద్దరు ప్రతిభావంతులైన నటులతో పాటు, అజగజంతారామ్ మరో షో-స్టీలర్ మరెవరో కాదు – నేస్సేరి పార్థన్ – ఒక ఏనుగు.
కొట్టాయం ముండక్కాయానికి చెందిన వ్యక్తికి చెందిన ఈ ఏనుగు, దీని అసలు పేరు నడకల్ ఉన్నికృష్ణన్, జనవరి 2న మరణించింది. నడక్కల్ ఉన్నికృష్ణన్ మృతి మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. అజగజంతారామ్‌లో భీకరమైన ప్రదర్శన ఇచ్చిన ఐకానిక్ ఏనుగును కోల్పోవడంపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. వాయిస్ ఫర్ ఏషియన్ ఎలిఫెంట్స్ సొసైటీ (VFAES) పేరుతో ఈ ఏనుగు మరణ వార్తను ప్రచురించింది.
నడకల్ ఉన్నికృష్ణన్ నిర్లక్ష్యం, చిత్రహింసలకు గురైనట్లు, ఫలితంగా అకాల మరణానికి కారణమైందని పేర్కొంది.అయితే, దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనపై అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటనతో సినిమాల్లో జంతువుల వినియోగంపై సర్వత్రా చర్చోపచర్చలు సాగుతున్నాయి. జంతువుల వినియోగం .. సహేతుకమేనా.. అసలు .. ఏవిధంగా వినియోగించారన్నదే చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా తెలుగు సినిమా అంటేనే ప్రేమమయం. ముఖ్యంగా ప్రియురాలు, ప్రియుడు మధ్య సాగే కథలే కొన్నిలక్షలు దాటిపోయాయి. ఏ కథలోనైనా కామన్ థ్రెడ్ ఇదే. అందుకు భిన్నంగా అప్పుడప్పుడూ -మూగజీవుల వేదన, లేదా వాటి చిలిపి చేష్టల ఆధారంగా మనిషితో మరో ప్రాణికుండే ప్రేమను చూపించే కథలూ టాలీవుడ్‌లో వచ్చాయి. అవన్నీ గతంలో అద్భుతంగా తెరపై పండిన కథలే.
ఇపుడు మాత్రం ఇటువంటి కథలను ఎత్తుకోవాలంటే -సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయి..!రాజమౌళి సినిమాల్లో
అప్పటి చిత్రాల్లో ఆయా దర్శక నిర్మాతలు వారికి నచ్చిన జీవ కారుణ్య కథల్ని తీసుకొని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. అవన్నీ చూసిన ప్రేక్షకులు తమ ఇళ్లలోనూ మూగ ప్రాణుల్ని పెంచుకొని ఆయా సినిమాలపై అభిమానాన్ని చూపించారు. కానీ ఇపుడు అటువంటి పరిస్థితి లేదు. జంతువులను చూపాల్సివస్తే అనేక కారణాలు చూపాలి. ఆయా మూగ ప్రాణులపై ఎటువంటి హింస షూటింగుల్లో జరగకూడదన్న భారత ప్రభుత్వ నిబంధన సమర్థించదగిందే.
అయితే, ఈ నిబంధన కారణంగా పెంపుడు ప్రాణుల్ని తెరపై చూపించే కథలు దూరమైపోయాయి. తద్వారా నేటి తరానికి జీవకారుణ్యానికి సంబంధించిన ఎటువంటి ఆలోచనలుగానీ, భావనలుగానీ లేకుండా పోతున్నాయి. బి విఠలాచార్య తన ప్రతి చిత్రంలో ఏదోక పెంపుడు ప్రాణినో, వన్యప్రాణినో చూపించేవారు. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాల్లో పాములు నాట్యం చేస్తాయి. విలన్ల భరతం పడతాయి. హీరోలకు సహాయపడతాయి.
అలా ఎలుగులు, పులులు, జింకలు, ఏనుగులు- ఇవన్నీ ఆయా కథలను నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించినవే. తెలుగు సినిమాల్లో హాస్యం, సెంటిమెంట్ సీన్స్‌లోనూ మూగప్రాణులు అద్భుత పాత్రలే పోషించాయి. ఇపుడు ఏ జంతువైనా సరే గ్రాఫిక్స్‌లో కన్పిస్తుంది. గ్రాఫిక్స్ అనగానే వాటికి ఎటువంటి హావభావాలుండవు. దీంతో ఆ పాత్రలు స్క్రీన్‌పై తేలిపోతున్నాయి. ప్రేక్షకులకు మైండ్‌లో రిజిష్టర్‌కాని పాత్రలుగా మిగిలిపోతున్నాయి.
దీంతో ఇప్పటి సినిమాలు చూసే యువతరానికి ఆయా జంతువుల గొప్పదనం తెలీని పరిస్థితి ఎదురవుతోంది. ఆమధ్య శివాజీ గణేశన్ మనవడితో ‘గజరాజు’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం కోసం వన్యప్రాణి పరిరక్షణకు సంబంధించిన అనుమతి పత్రం తీసుకొని షూటింగ్ చేశారట.
జంతువుల ప్రాణుల్ని పాత్రలు చేసుకునే సినిమాలు తెలుగులో కనుమరుగయ్యాయి..!
ఈ నేపథ్యంలో ఇప్పటితరానికి ఆయా వన్యప్రాణుల నటన కూడా చూపాలంటే ఆయా కథల గురించి ఓ బోర్డు ఏర్పాటు చేసి, వారికి కథా కథనాలు వివరించాలి. షూటింగ్‌లో బోర్డు తరఫునుంచి కొందరు సభ్యులువచ్చి వన్యప్రాణులపై ఎటువంటి హింస జరగకుండా చూడాలి. ఆ ప్రకారంగా ఇప్పటి చిత్రాల్లో గ్రాఫిక్స్ బొమ్మలు కాకుండా నిజమైన జంతువులను ఉపయోగించి చిత్రాలను రూపొందిస్తే నేటి తరానికి ఆయా జంతువుల భావోద్వేగాల నటనను చూపించవచ్చు.
తోటి ప్రాణుల్ని పాత్రలు చేసుకునే సినిమాలు తెలుగులో కనుమరుగయ్యాయి. అలాంటి కథాంశాన్ని ఎత్తుకున్నా అనేకానేక నియమ నిబంధనల మధ్య -ప్రాణుల్ని పాత్రల్ని చేయడంకంటే గ్రాఫిక్స్‌ని స్క్రీన్‌కెక్కించటం సులువైపోయింది. కాకపోతే -అలాంటి సన్నివేశాల్లో అలాంటలాంటి కథల్లో జీవం ఉండటం లేదంతే. చట్టాలకంటే, తోటి ప్రాణుల్ని గౌరవిస్తూ వాటినీ మనిషితో సమానంగా పాత్రల్ని చేసి సమాన స్థాయిని ఇచ్చింది టాలీవుడ్ ఒకప్పుడు.
ఇప్పుడు చట్టాలకు భయపడి.. వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతో -మనిషితో సమానమైన స్థాయిని తీసేసి వాటిని మూగ జీవులు.. జంతువులు అన్న హోదాకు పరిమితం చేసే పరిస్థితి వచ్చింది టాలీవుడ్‌కి. సినిమా అంటేనే మాయ, మిథ్య, లేనిది ఉన్నట్లు చూపించడం. అయితే ఈ క్రమంలో అందులో నటులు అయితే కనిపిస్తారు, నటస్తారు మాట్లాడతారు. అయితే లేని మనసుల్ని, జంతువుల్ని ఊహించుకుని నటించడమంటే చాలా కష్టం.
ఇలా నటించినవాళ్లు తోపు ఆర్టిస్టులు అవుతారు. ఒకప్పుడు గ్రాఫిక్స్ వాడకం ఒకటో, రెండో సీన్స్‌లో గట్టిగా వాడేవారు. అయితే ఇప్పుడొస్తున్న సినిమాల్లో వీటి వాడకం బాగా పెరిగిపోయింది.
రాజమౌళి సినిమాల్లో గ్రాఫిక్స్..
రాజమౌళి సినిమాల్లో అయితే మరీనూ. తాజాగా ఆయన నుండి వచ్చిన ఆర్‌ఆర్ఆర్‌లో గ్రాఫిక్స్ ఎక్కడెక్కడ వాడారు అని లెక్కించుకోవడం మానేసి, ఎక్కడెక్క లేదు అని లెక్కేసుకోవడం మంచిది. ఎందుకంటే సినిమాలో చాలా సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సినిమా విడుదల తర్వాత వాటి వీఎఫెక్స్ బ్రేక్‌డౌన్ వీడియోలను చిత్రబృందం, ఆ వర్క్ చేసిన టీమ్స్ సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నాయి.
తాజాగా సినిమా ప్రారంభంలో భీమ్ పాత్రను పరిచయం చేసిన పులిని ట్రాప్ చేసి, దాంతో పోరాటం చేసే సన్నివేశం బ్రేక్‌డౌన్ వీడియోను వీఎఫెక్స్ టీమ్ రిలీజ్ చేసింది. బ్లూ మాట్ తరహాలో చిత్రీకరించిన ఈ వీడియోలో పులికి బదులు ఆ స్థానంలో ఓ వ్యక్తి ఉంటాడు. అతనినే పులి అనుకుని తారక్.. పోరాటం చేస్తుంటాడు. మన సీన్లో చూసినట్లుగా ఆ వ్యక్తి కదలడం, దానికి తగ్గట్టుగా తారక్ నటించడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
పులి లేకుండా అక్కడ పులి ఉన్నట్లుగా నటించడంలో తారక్ నటనలోని గొప్పతనం కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. లేని పులిని ఊహించుకుంటూ నటించడం సూపర్ కదా. ఇక ఈ సినిమా సంగతికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సుమారు రూ. 1200 కోట్లు వసూలు చేసింది. తాజాగా హాలీవుడ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో మిగిలిన డైరెక్టర్స్‌తో పోలిస్తే జేమ్స్ కామెరూన్ ఓ అడుగు ఎప్పుడూ ముందే ఉంటారు.
2009లో విడుదలైన అవతార్ సినిమా కామెరూన్ అద్భుత సృష్టికి నిదర్శనంగా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి జేమ్స్ కామెరూన్ ఉపయోగించిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ప్రపంచ సినిమాను మలుపుతిప్పింది. గ్రాఫిక్స్, ఫాంటసీ సినిమాల రూపకల్పనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన అవతార్ ఎన్నో గొప్ప సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది.
శాండల్ వుడ్ లో ఏనుగుల వినియోగం ఎప్పటి నుంచో ఉన్నా.. తాజాగా ఉన్నికృష్ణన్ మరణం .. మరో చర్చకు దారితీస్తోంది.