Homeఅంతర్జాతీయంనిజంగానే కైలాస పర్వతంపై శివుడు ఉన్నాడా..?

నిజంగానే కైలాస పర్వతంపై శివుడు ఉన్నాడా..?

కైలాసం.. ఈ పేరు వినగానే ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. దీనిపై అంత్యత రహస్య శక్తి ఉంది. దీనిపై దేవతలకు దేవుడైన మహాదేవుడు నివాసం ఉన్నట్లు అందరూ భావిస్తారు. ఈ కారణంగానే ఇప్పటి వరకు ఎవరూ ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారనేది నానుడి. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన వారు కూడా కైలాస పర్వతం ఎక్కే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీనికి కారణం శిఖరం కొనపై ఉన్న రహస్య శక్తే కారణమని భావిస్తారు. బౌద్ధ, హిందూ మత గ్రంథాల ప్రకారం.. కైలాస పర్వతం చుట్టూ పురాతన మఠాలు, గుహలు ఉన్నాయని చెబుతారు.

కైలాస పర్వతం మన పక్కనే ఉన్న టిబెట్‌లోని హిమాలయ పర్వతాల సమీపంలో సముద్ర మట్టానికి 22778 అడుగుల ఎత్తులో ఉంది. టిబెట్ భూభాగంపై ఉన్నది. ఈ కైలాసంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. వేలాది భక్తులకు దర్శనమిస్తున్నారు. సముద్ర మట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో సైన్సుకు అందని అసాధారణ వ్యవస్థ కైలాసం. అది ఆ పరమ శివుడి ఆవాసం. ఆది శక్తి పార్వతిదేవి నివాసం. శివుడ్ని సాక్షాత్కరింప చేసుకునేందుకు లంకేశ్వరుడైన రావణుడు తన పది తలలతో ఎత్తిన పర్వతమే ఈ కైలాసం.

ఈ పర్వతం భారతదేశం నుంచి మొదలై చైనా వరకు విస్తరించి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం మౌంట్‌ ఎవరెస్టు ఎత్తు 8,848 మీటర్లు, కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. ఎవరెస్టు శిఖరం కంటే దాదాపు రెండేవేల మీటర్లు తక్కువ. ఎవరెస్టు ఎక్కేవారు వారివెంట ఆక్సిజన్‌ తీసుకెళ్తారు. ఎందుకంటే పైకి వెళ్లేకొద్ది గాలిలో ఆక్సిజన్‌ తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. కానీ కైలాస పర్వతంపై అలాంటి ఇబ్బంది లేదు. అక్కడ సులువుగా ఆక్సీజన్‌ దొరుకుతుంది. మౌంట్‌ ఎవరెస్ట్‌ను ఇప్పటి వరకు 7 వేల మంది ఎక్కారు. కైలాస పర్వతం ఎత్తు ఎవరెస్టు కంటే 2 వేల మీటర్లు తక్కువ. అయినా దీనిని ఇప్పటి వరకూ ఎవరూ అధిరోహించలేదు. కనీసం సగం వరకూ కూడా వెళ్లలేకపోయారు. ఎక్కేందుకు ప్రయత్నించినవారు కూడా చనిపోయారు.

కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే ఈ గుహలను చూడగలరు. హిందువులు కైలాస పర్వతాన్ని శివుని పవిత్ర నివాసంగా పరిగణిస్తారు. అతను తన భార్య పార్వతి, అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఇక్కడ నివసిస్తున్నట్లు పెద్దలు చెబుతారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు పవిత్ర కైలాస పర్వత యాత్ర కోసం టిబెట్‌లోకి ప్రవేశిస్తారు. కానీ కొద్ది మంది మాత్రమే పవిత్ర శిఖరం ప్రదక్షిణను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. కొంతమంది శిఖరం అధిరోహించడానికి ప్రయత్నించినా మద్యలోనే వెనక్కు వచ్చిన సందర్బాలే ఎక్కువ.

హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మానస మేథస్సుకు ఇసమంతైనా అర్థంకాని రహస్యాలు ఎన్నోఈ పర్వతంపై దాగి ఉన్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతిభక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం, వినాయక, కుమారస్వామి, నంది ల దర్శనం కలుగుతుంది.

బ్రహ్మలోకానికి, వైకుంఠానికి, స్వర్గలోకం లాంటి ఇతర దివ్యలోకాలకి జీవించి ఉండగా వెళ్లడం సాధ్యం అవుతుందో లేదో కాని, కైలాసాన్ని మాత్రం బతికి ఉండగానే దర్శించి రావచ్చు. కైలాస పర్వతంపై ట్రెక్కింగ్ చేయడాన్ని హిందువులు తప్పుగా భావిస్తారు. ఎందుకంటే పర్వతం పవిత్రకు, అక్కడ నివసించే దైవ శక్తికి భంగం కలుగుతుందని వారి నమ్మకం. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస తాల్ అనే రెండు అందమైన సరస్సులు ఉన్నాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా చెబుతారు. ఈ పర్వత యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీ చేతి గోళ్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్య క్షేత్రంగా ఈ ప్రాంతం పూజలను అందుకుంటోంది. కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్‌చొక్ ను బౌద్ధ మతస్థులు పూజిస్తుంటారు. దీనినే ధర్మపాలగా పిలుస్తుంటారు. తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధ మతస్థులు ఈ క్షేత్రాన్ని బలంగా విశ్వసిస్తుంటారు. బ్రహ్మీ ముహుర్తంలో అంటే ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. ఈ ముహూర్తంలో కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.

శిఖరం రహస్యంపై రీసెర్చ్‌…

ప్రపంచంలోని అన్ని అలౌకిక శక్తుల జన్మ ఈ కైలాస పర్వతం వద్దనే మొదలవుతుందంటారు. హిమాలయాల్లో ఉన్న ఈ పర్వతం ప్రపంచంలో పెద్దది కాకపోయినా దీని నవ్యత దీని ఆకారంలో ఉంది. ఈ పర్వతం ప్రాణమున్న శివలింగంలా కనబడుతుంది. ఒక రీసెర్చ్‌ టీం చేసిన పరిశోధనల ఆధారంగా కైలాస పర్వత కేంద్రం భూమికి కేంద్రం. ప్రతీ మనిశికి కేంద్రం నాభి. భూమికి నాభి ఈ శక్తివంతైమన కైలాస పర్వతం. అందుకే ఎవరైనా ఈ పర్వతం వద్దకు వెళితే అతడికి దిశానిర్దేశం చేసే యంత్రం పనిచేయదు. పరిశోధకుల ప్రకారం ఈ కైలాస పర్వతం వద్ద నాలుగు దిక్కులు కలుస్తాయి. పర్వతం భీమిపై ఉన్న అన్ని జీవులు జీవించడానికి అవసరమైన వాతావరణం ఏర్పరుస్తుంది. అందుకే దీనిని ప్రాకృతిక శక్తుల భాండాగారం అంటారు. ఇదివరకు ఈ పర్వతం ఎక్కేందుకు ప్రయత్నించిన వారికి ఒక హద్దు దాటిన తర్వాత అతనికి విచిత్రమైన, అసమాన్యమైన ఘటనలు జరుగుతాయి. అక్కడకి ఎక్కేందకు వెళ్లినవారు భయపడి వెనక్కి వస్తారు. అక్కడ ఏదో ఉంది.. పైకి రావొద్దు అన్న కంకేతం ఇస్తుంది. అక్కడ వాతావరణం కూడా అకస్మాత్తుగా మారుతుంది. చలి పెరుగుతుంది. గుండె వేగం రెండింతలు అవుతుంది. ఆక్సీజన్‌ ఉన్నా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అంతేకాదు కైలాస పర్వతం దగ్గరకు వెళ్లినప్పుడు గోళ్లు, తల వెంట్రుకలు వేగంగా పెరిగిన భావన కలుగుతుంది. ముఖంపై ముడతలు పడినట్లు అనిపిస్తుంది. వయసు వేగంగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ హెచ్చరికలను లెక్కచేయకుండా ముందుకు వెళ్లిన వారు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. హిందూ ధర్మం ప్రకారం కైలాసం శివుడి నివాసం. అతని అనుమతి లేకుండా ఎవరూ అక్కడకు వెళ్లలేరు అనేది మాత్రం నిర్ధారణ అయింది.

Must Read

spot_img