Homeసినిమాఅలియాకు కోపం వచ్చింది..

అలియాకు కోపం వచ్చింది..

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. వారి వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి చేదు అనుభవమే బాలీవుడ్ నటీ అలియా భట్ కు ఎదురైంది. తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న మేడపై నుంచి కొందరు వ్యక్తులు ఆమె ఫోటోలను తీశారు. దీంతో అలియా భట్ సోషల్ మీడియాలో ఆ వ్యక్తులపై సీరియస్ అయింది. నా ప్రైవసీని ఇలా డిస్టర్బ్ చేయడం చాలా బాధాకరం అంటూ పోస్ట్ పెట్టింది.

ఏంటి తమాషాలు చేస్తున్నారా..?

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫొటోలు తీయడాన్ని అలియా భట్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఇన్ స్టా గ్రామ్ లో స్పందించింది. తాను లివింగ్ రూమ్ లో ఉన్న సమయంలో అనుమతి లేకుండా ఫొటోలు తీయడంపై ఈ విధంగా స్పంధించింది. ‘నాతో ఆటలాడుకుంటున్నారా? నేను నా ఇంట్లో ఉన్నాను. మధ్యాహ్న సమయంలో లివింగ్ రూమ్ లో కూర్చుని, ఏదో చూస్తూ ఆస్వాదిస్తున్న సమయంలో.. నా పక్కనున్న బిల్డింగ్ టెర్రాస్ నుంచి ఇద్దరు మగవారు కెమెరా నా వైపు పెట్టి ఉంచడాన్ని గమనించాను. ఎక్కడైనా ఇలాంటివి ఆమోదిస్తారా? ఒకరి ప్రైవసీని పూర్తిగా కాలరాయడమే అవుతుంది. దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దుని దాటకూడదు. అన్న విషయం వీల్లకు తెలియదా..? వారు వారి యొక్క పరిధి హద్దు దాటారు ’ అంటూ అలియా పోస్ట్ పెట్టింది. అయితే ఈ ఫోటోలను ఓ మీడియా పోర్టల్ ప్రతినిధులు తీసినట్టు తెలుస్తోంది.

వారికి ఇలా చేయడం కొత్త కాదు..

సెలబ్రెటీల లైఫ్‌స్టైల్‌ తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. కానీ ఆ సంస్థకు కాస్తాంత ఎక్కువ ఉంది అంటూ పలువురు ప్రముఖులు తమ గత అనుభవాలను అలియా భట్ ఫ్రోఫైల్ కు లింక్ చేస్తున్నారు. బాలీవుడ్ నటులు ఆమె పోస్ట్ కు రీప్లే ఇస్తున్నారు. ప్రముఖ నటి అనుష్క శర్మ స్పందిస్తూ.. సదరు సంస్థ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని, రెండేళ్ల క్రితం తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ పోస్ట్ పెట్టారు. ఇక దీనిపై జాన్వీ కపూర్‌ స్పందిస్తూ.. ‘ఇది చాలా అసహ్యమైన చర్య. నాకు ఇలాంటి పరిస్థితి చాలా సార్లు ఎదురైంది. నాకు తెలియకుండా నన్ను ఫొటోలు తీశారు. ప్రైవేట్‌ స్థలాల్లో ఉన్నా ఫొటోలు తీశారు’ అని చెప్పింది. అలియా తన ఇన్‌స్టా పోస్టులో ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేసింది. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. దీనిపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోపక్క అలియా తన పోస్ట్ కు ముంబై పోలీసులను ట్యాగ్ చేయడంతో వారు స్పందించి అలియాభట్ ను సంప్రదించారు. సంబంధిత పోర్టల్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు ఇస్తే చర్యలు చేపడతామని చెప్పారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు అలియాభట్ కు కాల్ చేసి మద్దతు ప్రకటిస్తున్నారు.

Must Read

spot_img