Homeఅంతర్జాతీయందుబయిలో రహస్యంగా జీవిస్తున్న ముంబై డాన్..!

దుబయిలో రహస్యంగా జీవిస్తున్న ముంబై డాన్..!

దావూద్ ఇబ్రహీం మరోసారి తెర పైకి వచ్చాడు. తనకు మొదటి నుంచి సహకరిస్తున్న గుట్కా వ్యాపారి జెఎం జోషికి ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ కు వెళ్లడానికి జోషీ సహకరించాడని తనపై ఆరోపణలు వచ్చాయి. ఆ సాయానికి బదులుగా పాకిస్తాన్ లో జోషీకి దావూద్ లాభం చేకూర్చాడని అంటున్నారు.

మాఫియాతో లింకు పెట్టుకున్నందుకు గుట్కా వ్యాపారి జేఎం జోషికి ముంబైలోని ప్రత్యేక కోర్టు పదేళ్ల శిక్ష.. ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు జోషి సహకరించాడని తనపై ఆరోపణలు వచ్చాయి. అదే సాయంతో 2002లో పాకిస్థాన్‌లో గుట్కా ఫ్యాక్టరీని ప్రారంభించగా.. ఆ కేసులో ఇప్పుడు ముంబై కోర్టు జేఎం జోషిని దోషిగా నిర్ధారించి పదేళ్ల శిక్ష విధించింది.

ఈ కేసులో జోషితో పాటు జమీరుద్దీన్ అన్సారీ, ఫరూఖ్ అన్సారీలు కూడా దోషులుగా తేలడంతో ఇద్దరికీ శిక్ష పడింది. మాణిక్‌చంద్ గ్రూప్ వ్యవస్థాపకుడైన రసిక్‌లాల్ ధరివాల్ కూడా ఈ కేసులో దోషిగా ఉన్నాడు. అయితే 2017లో రసిక్ లాల్ మరణించడంతో కేసు నుండి తప్పించుకున్నట్టైంది. రసిక్ లాల్, జెఎం జోషి గతంలో కలిసి గుట్కా వ్యాపారం చేసేవారు.

అయితే ఆ తర్వాత డబ్బు విషయంలో కొంత వివాదం ఏర్పడి ఇద్దరూ విడిపోయారు. జోషి ధరివాల్ నుండి విడిపోయి గోవా గుట్కా పేరుతో మరో కంపెనీని ప్రారంభించాడని అప్పట్లో చెప్పుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య వివాదాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో ఉండి ఈ విషయం సెటిల్ చేశాడు. ఆ సమయంలోనే అక్కడ గుట్కా ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాయం అందిస్తామంటూ షరతు పెట్టారు.

కరాచీలో గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు దావూద్ ఇబ్రహీం ఆ వ్యక్తి సహాయాన్ని కోరాడు. ఈ కేసు విచారణ సమయంలో ధరివాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఇబ్రహీం ఈ కేసులో వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. ఆనాడు అందించిన సాయం ఇప్పుడు జేఎం జోషికి భారంగా మారింది.

మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అతనిపై చర్యలు తీసుకున్నారు. జైన్‌ పాకిస్థాన్‌లో గుట్కా ఫ్యాక్టరీ పెట్టడమే కాదు. 2.64 లక్షల విలువైన మెషీన్‌ను కూడా పాకిస్థాన్‌కు పంపాడు, అంతే కాకుండా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఓ నిపుణుడిని కూడా బలవంతంగా అక్కడికి పంపించాడు. అప్పట్లో పాకిస్థాన్‌లో ఆ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి జైన్ వెళ్లాడని కూడా ఆరోపణలు వచ్చాయి.

దావూద్‌కు సాయం చేయడం ఈ విషయంలో అతిపెద్ద వివాదంగా మారింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు జమీరుద్దీన్ అన్సారీ, ఫరూఖ్ అన్సారీలు కూడా ముంబై 1993 పేలుళ్లలో కీలక పాత్ర పోషించారు. భారతదేశంలో తన కంపెనీ ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించబడింది, ప్రభుత్వం కూడా చాలా లాభపడిందని కోర్టులో జైన్ న్యాయవాది ఈ కేసును వాదించాడు.

అయితే కోర్టు అవేమీ పట్టించుకోలేదు. కేసు తీవ్రత దృష్ట్యా జేఎం జైన్‌కు పదేళ్ల శిక్ష, ఐదు లక్షల జరిమానా కూడా విధించక తప్పలేదు. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడని స్పష్టమైంది. అయితే పాకిస్తాన్ మాత్రం తమకు ఆ సమాచారం లేదని బుకాయిస్తోంది. అండర్​ వరల్డ్‌డాన్ ​దావూద్​ ఇబ్రహీంకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎన్‌ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ రాబట్టింది.

అతడు పాకిస్థాన్‌లోనే ఉన్నాడని వచ్చిన వార్తలు నిజమేనని తేల్చింది. దావూద్ పాక్‌లోని కరాచీలో ఉన్నట్లు అతడి అల్లుడు అలీషా పార్కర్ ఈడీకి తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ సందర్భంగా అలీషా పార్కర్​ ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపాయి.

అతడివాంగ్మూలం నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దావూద్‌కు అక్రమంగా డబ్బు సంపాదించి పెట్టడంతోపాటు, అతడి హవాలా మార్గాల ద్వారా మనీలాండరింగ్‌కు సహకరించిన దావూద్ బంధువులపై ఈడీ విచారణ జరుపుతోంది. ఈ కేసులో చోటా షకీల్ బావ సలీం ఫ్రూట్‌ను ఈడీ విచారించింది. తాజాగా అతడి మేనల్లుడు అలీషా పార్కర్‌ను ప్రశ్నించింది.

అయితే తనకు ఎలాంటి లావాదేవీల గురించి తెలియదని అలీషా వెల్లడించినట్లు సమాచారం. అయితే పాకిస్తాన్ లో తాజాగా నెలకొన్న పరిస్థితుల మేరకు దావూద్ ఇబ్రహీంకు కూడా కష్టాలు తప్పడం లేదు. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు లభించిన సౌకర్యాలు ఇప్పడు లభించడం లేదని సమాచారం. ఏదో రకంగా తను ఇండియాకు రావాలని అనుకుంటున్నట్టు సమాచారం.

Must Read

spot_img