ప్రతి నెల టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. అలాగే ఏప్రిల్ నెలలో కూడా ఎక్కువగానే సినిమాల రిలీజ్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా కల్చర్ పెరగడంతో అన్ని భాషల చిత్రాలు ఇతర భాషలలో రిలీజ్ అవుతున్నాయి. ఈ కారణంగా ప్రేక్షకులకి కావాల్సినంత వినోదం దొరుకుతుంది. ఎవరికి నచ్చిన సినిమాకి వారు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక సినిమా ప్రమోషన్ బట్టి ప్రేక్షకులకి ఎక్కువగా చేరువ అయ్యే మూవీస్ ని థియేటర్స్ లో ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారు.
ఈ ఏప్రిల్ నెలలో వరుసగా ప్రతి వారంలో సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఏప్రిల్ 7న మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన రావణాసుర మూవీ రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మాస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఏప్రిల్ 14న సమంతా శాకుంతలం సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ అవుతుంది. దీని మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అదే రోజు లారెన్స్ రుద్రుడు మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతుంది. కాంచనా సిరీస్ తో లారెన్స్ కి తెలుగులో కూడా మార్కెట్ పెరిగింది.
ఈ నేపధ్యంలో ఆ సినిమాకి బజ్ క్రియేట్ అవకాశం ఉంది. ఇక అదే రోజు అల్లరి నరేష్ ఉగ్రం మూవీ కూడా రిలీజ్ అవుతుంది. విజయ్ కుమార్ కనకమేడల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక దీని తర్వాత ఏప్రిల్ 28న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. దీంతో పాటు అదే రోజు పొన్నియన్ సెల్వన్ 2 మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఇది పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో కొంత హైప్ ఉంటుంది.
ఇక వీటితోపాటు అఖిల్ ఏజెంట్ మూవీ కూడా అదే రోజు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతుంది. దీనిపై భారీ హైప్ ఉంది. ఇక 29న వైష్ణవ్ తేజ్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది.ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే ఆ టైమ్ కి కచ్చితంగా రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా ఏప్రిల్ నెలలో ఏకంగా ఐదు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులని అలరించడానికి రెడీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.