Homeసినిమాగాసిప్స్పవన్ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా..!

పవన్ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా..!

పవన్ -హరీష్ శంకర్. ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమాలో వస్తుంది అంటే.. అంచనాలు భారీగానే ఉన్నాయి. అందులోనూ గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఫ్యాన్స్ ఎక్సప్లనేషన్ పెట్టుకున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ పవన్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్న హరీష్.. ఈసారి సొంతంగా తయారుచేసుకున్న పవర్‌ఫుల్ స్టోరీతో సినిమా తీయాలనుకున్నాడు. పవన్‌కు కూడా హరీష్ చెప్పిన స్టోరీ నచ్చడంతో భవదీయుడు భగత్‌సింగ్
అనౌన్స్ చేశారు. కానీ తీరా చూస్తే.. ఇప్పుడు ఉస్తాద్ భగత్‌సింగ్ తెరపైకి వచ్చింది.

పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. క్రిష్ డైరెక్షన్‌లో ఎప్పుడో స్టార్ట్ చేసిన హరి హర వీరమల్లు షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. సాహో డైరెక్టర్ సుజిత్‌తో మరో సినిమా ప్రకటించారు. అయినప్పటికీ ఎప్పపటి నుంచో వెయిటింగ్‌లో ఉన్న హరీష్ సినిమాకు మోక్షం కలగలేదు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలోనే సేఫ్‌గా హరీష్‌తో తేరి రీమేక్ చేస్తున్నట్లు నెట్టింట న్యూస్ వినిపించింది.

కానీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలోనే విజయ్ నటించిన తేరి మూవీలోని ఎమోషనల్ అవుట్‌లైన్ తీసుకుని.. దాన్ని భవదీయుడు స్టోరీలో కలపాల్సిందిగా పవన్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో హరీష్.. పవన్ చెప్పినట్లుగానే తన కథకు తేరి అవుట్‌లైన్ యాడ్ చేసి ఈ స్టోరీ సిద్ధం చేసినట్లు సమచారం.

మొత్తానికి తన పెన్ పవర్ చూపించిన హరీష్..ఉస్తాద్ భగత్‌సింగ్ స్టోరీని మెగా రీమిక్స్‌గా రూపొందిచినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. తేరి చిత్రంలో దళపతి విజయ్ బ్లాక్‌బోర్డ్‌పై రౌడీలకు క్లాస్ చెప్పేటువంటి కొన్ని ఐకానిక్ సీన్లను ఇందులో కంటిన్యూ చేస్తారని… కానీ సెకండ్ హాఫ్‌లో మాత్రం పూర్తిగా కొత్త స్టోరీ డెవలప్ చేశారు.

అందుకే సినిమాకు కొత్త టైటిల్ పెట్టారు. ఏదేమైనా అభిమానులకు హామీ ఇచ్చినట్లుగా.. హరీష్ తేరి సినిమాను పూర్తి
స్థాయిలో రీమేక్‌ చేయడం లేదు. కానీ స్క్రిప్ట్‌ను మధ్యలో మార్చడం ద్వార పవన్ కళ్యాణ్‌తో పాటు అభిమానులను కూడా శాటిస్‌ఫై చేయగలిగాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Must Read

spot_img