ఆధునిక జీవనశైలికి తోడు అధిక ద్రవ్యోల్భణం కారణంగా సగటు మనిషి జీవన వ్యయం పెరుగుతోంది.. ఈ జీవన వ్యయం గ్రామాలలో ఒక విధంగా, పట్టణాలు, నగరాలు, మహానగరాలలో ఒక్కోలా ఉంటుంది.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలపై ఓ సంస్థ సర్వే చేసింది..
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో చోటు సంపాదించుకున్న నగరాలేంటి..? ఏ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయం సగటున ఎంత శాతం పెరిగింది..?
అసలు జీవన వ్యయం పెరగడానికి కారణమైన అంశాలేంటి…?
అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్ నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి. ఈ ఏడాది వివిధ నగరాల్లో ఖరీదైన జీవన విధానం ఆధారంగా ‘ది ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్’ ఒక జాబితా రూపొందించింది.
ఆ సర్వే ప్రకారం ప్రపంచంలో జీవించడానికి అత్యధికంగా ఖర్చు చేయాల్సిన నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాయి.మొత్తం 172 దేశాలతో కూడిన ఈ జాబితాలో న్యూయార్క్‌కు మొదటిసారి తొలి ర్యాంకు లభించింది. గతేడాది నంబర్‌వన్‌గా నిలిచిన టెల్ అవీవ్ ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది.
మరోవైపు.. భారత్‌లోని అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు జీవన వ్యయంలో అత్యంత చౌక అయిన నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో బెంగళూరు 161వ ర్యాంకులో, చెన్నై 164వ ర్యాంకులో, అహ్మదాబాద్ 165వ ర్యాంకులో నిలిచింది.
సర్వే నివేదికల ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఈ ఏడాది జీవన వ్యయం సగటున 8.1 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. యుక్రెయిన్ లో యుద్ధం, సరఫరా వ్యవస్థలపై కరోనా ప్రభావం కూడా జీవన వ్యయం పెరుగుదలకు కారణాలుగా గుర్తించారు.
ముఖ్యంగా ఇస్తాంబుల్ లో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. అక్కడ ధరల పెరుగుదల 86 శాతంగా నమోదైంది. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో ఈ నగరాల్లో జీవనం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. దీంతో నగరాలు చాలా ఖరీదుగా మారిపోతున్నాయి. 2022లో అత్యంత ఖరీదైన నగరాలు, ర్యాంకుల వారీగా.. మొదటి స్థానంలో న్యూయార్క్, సింగపూర్ లు ఉండగా.. వరుసగా పదిస్థానాల్లో ఈ నగరాలు నిలిచాయి.
టెల్ అవీవ్ .. హాంకాంగ్, లాస్ ఏంజిల్స్, జ్యూరిచ్ , గిన్ , సెయింట్ ఫ్రాన్సిస్ , పారిస్ , సిడ్నీ, కోహెన్ హాగెన్.. ఇక.. చౌక నగరాల జాబితాలో కొలంబస్, బెంగుళూరు, అల్జీర్స్ లు 161వ స్థానంలో ఉండగా.. 164 స్థానంలో చెన్నై, 165లో అహ్మదబాద్, 166లో అల్మతీ, 167లో కరాచీ, 168 తాష్కెంట్, 189 ట్యునీషియా,170లో టెహ్రాన్, 171లో ట్రిపోలీ, 172లో డమాస్కస్ నిలిచాయి.
టాప్-10లో తొలిసారిగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం నిలిచింది.
అత్యంత ఖరీదైన నగరాల జాబితాకు సంబంధించి న్యూయార్క్ మొదటిసారి టాప్ ప్లేస్ సాధించింది. సింగపూర్ గత పదేళ్లలో ఎనిమిదిసార్లు టాప్ ప్లేస్ సాధించింది. టాప్-10లో తొలిసారిగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం నిలిచింది. రష్యాకు చెందిన మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వెనిజులా రాజధాని సరాకస్ 132వ స్థానంలో నిలిచింది.
పెట్రో ధరల పెరుగుదల,కరెన్సీ విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, అమెరికా డాలర్ బలంగా ఉండటం వంటి అంశాల వల్ల ఇవి ఖరీదైన నగరాల జాబితాలో ఉన్నాయి.
ఈ జాబితాలో గతంలో టాప్‌లో నిలిచిన నగరాలు తమ స్థానాన్ని కోల్పోయాయి. జపాన్ రాజధాని టోక్యో, ఒసాకా, స్టాక్‌హోమ్, లగ్జెంబర్గ్ వంటి నగరాలు ఈ జాబితాలో కిందికి పడిపోయాయి. ప్రపంచంలోనే జీవన వ్యయం అత్యంత చౌకగా ఉన్న నగరాల జాబితాలో భారత్ నుంచి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి.
అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో నిలవడానికి డాలర్ బలపడటంతో పాటు అమెరికాలోని అధిక ద్రవ్యోల్బణం కూడా ఒక కారణం.
టాప్-10లో అమెరికాలోని లాస్ఏం జిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో ద్రవ్యోల్బణం దేశంలో గత 40 సంవత్సరాల గరిష్టానికి చేరింది. బ్యూనస్ ఎయిర్స్‌లో 64 శాతం, టెహ్రాన్‌లో 57 శాతంగా ధరల పెరుగుదల ఉంది.
మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరాలు కూడా ఈ ఏడాది ర్యాంకుల్లో పైకి ఎగబాకాయి. సర్వే 172 నగరాల్లోని వస్తు, సేవల ఖర్చులను పరిగణలోకి తీసుకొని ఈ
సర్వేను చేశారు. ఈ ఏడాది రివ్యూలో కీయెవ్ నగరాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 172 నగరాల్లోని 200 కంటే ఎక్కువ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన 400కు పైగా వ్యక్తిగత ధరలను పోల్చి చూశారు.
యుక్రెయిన్ లో యుద్ధం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు, చైనా జీరో కోవిడ్ విధానాల వల్ల సరఫరా గొలుసు సాఫీగా సాగకుండా ఇబ్బందులు తలెత్తాయనేది సర్వే సారాంశం..‘‘వీటికి వడ్డీ రేట్లు పెరగడం, డబ్బు మారకపు రేటులో మార్పులు కూడా తోడవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయ సంక్షోభం ఏర్పడింది.
ఈ 172 నగరాలకు సంబంధించి గత 20 ఏళ్లుగా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చూస్తే, తాజా ధరల పెరుగుదల రేటు అత్యంత ఎక్కువగా ఉంది.ద్రవ్యోల్భణం, కోరోనా ప్రభావం, చమురు ధరలు పెరగడం, రష్యా,ఉక్రెయిన్ యుద్దం వంటి కారణాలతో ఈ ఏడాది సగటు జీవన వ్యయం 8.1 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్ నిలిచాయి.