Homeఅంతర్జాతీయంఉక్రెయిన్, రష్యాల యుద్దం మొదలవ్వకముందు...?

ఉక్రెయిన్, రష్యాల యుద్దం మొదలవ్వకముందు…?

ఉక్రెయిన్, రష్యాల యుద్దం మొదలవ్వకముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే.. ప్రస్తుత పరిస్థితులు రష్యా, భారత్ లకు ఎంతో ప్రయోజనకరంగా మారాయి. ముఖ్యంగా చమురు విషయంలో ఇరుదేశాలు పరస్పర ప్రయోజనాలకు పొందాయి.. ఇదే ఇప్పుడు భారత్, రష్యాలు సరికొత్త రికార్డ్ నెలకొల్పడానికి దోహదపడింది..

పరిస్థితులు క్షిష్టంగా మారినప్పటికీ.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్న వారే.. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొని నిలబడగలుగుతారు.. దీనికి ఉదాహరణే రష్యా, భారత్ దేశాలు.. ఉక్రెయిన్ పై నాటో దేశాలు ఆంక్షలు విధించిన సమయంలో రష్యా, భారత్ లు తీసుకున్న నిర్ణయాలు ఇరుదేశాలకు ఎంతో మేలు చేశాయి.

భారత్ – రష్యాలు సరికొత్త రికార్డ్ నెలకొల్పాయి. రష్యా నుంచి భారత్ ఫిబ్రవరి నెలలో 1.6 మిలియన్ బ్యారెళ్లు ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇది ఇరాక్, సౌదీ అరేబియాల నుంచి దిగుమతి చేసుకుంటున్న దానికన్నా ఎక్కువ. 2022 ఫిబ్రవరిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 35 శాతానికి చేరుకున్నాయి. భారత్‌ కు చమురు దిగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా వరుసగా ఐదో నెలలో కూడా అగ్రస్థానంలో ఉంది. ఈ వివరాలన్నింటినీ ఎనర్జీ కార్గో ట్రాకర్ వొర్టెక్సా అందించింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడో అతి పెద్ద దేశం. ఇరాక్ నుంచి భారత్‌ కు ఫిబ్రవరి నెలలో 9,39,921 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా… సౌదీ అరేబియా నుంచి 6,47,813 బ్యారెళ్ల చమురు దిగుమతి అయింది. యూఏఈ నుంచి భారత్‌కు ఫిబ్రవరి నెలలో 4,04,570 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా.. అమెరికా నుంచి 2,48,430 బ్యారెళ్ల చమురు దిగుమతి అయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలు ఆర్ధిక ఆంక్షలు విధించడంతో దిక్కుతోచని రష్యా ప్రత్యామ్నాయ మార్గాలు వెతికింది. పుతిన్ సారధ్యంలోని ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు కూడా ప్రకటించింది. దీంతో మోదీ నేతృత్వంలోని భారత్ వెనువెంటనే రంగంలోకి దిగింది. దిగుమతులు పెంచుకుంది.. అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉన్న భారత్, రష్యా నుంచి నేరుగా చమురు దిగుమతి చేసుకోవడాన్ని మోదీ మార్క్ రాజకీయంగా అంతర్జాతీయ పరిశీలకులు ప్రశంసలు కురిపించారు.

అమెరికాతో సంబంధాలు దెబ్బ తినకుండానే తన చమురు అవసరాలను తీర్చుకుంటున్న భారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత విదేశీ నీతిని అన్ని దేశాలూ పొగుడుతున్నాయి. అంతెందుకు శతృదేశం పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతి సభలోనూ భారత విదేశాంగ నీతిని ఆకాశానికెత్తేస్తున్నారు. పెద్ద టీవీలు, స్క్రీన్‌లు పెట్టి మరీ ఈ దృశ్యాలను పాకిస్థాన్ ప్రజలకు చూపిస్తున్నారు. మోదీ – పుతిన్ మధ్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధులను ఆ దేశం నుంచి స్వదేశానికి రప్పించడానికి పుతిన్‌ ప్రభుత్వంతో మోదీ సంప్రదింపులు జరిపారు. ఇది యుద్ధాల యుగం కాదంటూ మోదీ పుతిన్‌కు ఇచ్చిన సలహాను అమెరికా, యూరప్ దేశాలు ప్రశంసించాయి. ఇంత ధైర్యంగా రష్యాతో మాట్లాడగలిగే నాయకుడు మోదీ ఒక్కరే అని ఫ్రాన్స్ తదితర దేశాలు అభిప్రాయపడుతున్నాయి. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్న మోదీ-పుతిన్ తమ సొంత దేశాలకు ప్రయోజనం కలిగేలా చేస్తున్నారు. భారీ డిస్కౌంట్‌లో చమురు కొనుగోలు చేస్తూ భారత్ ప్రయోజనం పొందుతుండగా, అమెరికా, యూరప్ దేశాల ఆర్ధిక ఆంక్షల నుంచి బయటపడటానికి రష్యాకు తోడ్పడుతోంది భారత్..ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆయా దేశాలు పూర్తిగా మానేశాయి.

అయితే సౌదీ అరేబియా, యూఎస్ ల నుంచి కొనుగోలు చేసే ఆయిల్ కంటే రష్యా నుంచి తీసుకోవడం అది తక్కువ ధరకు రావడంతో ఆదాయం ఆ మేరకు పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న భారత్ కు దాదాపు 3.6 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. ఇది కేవలం ఏడాదిలోగా వచ్చిన ఆదాయమే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికా, యూరప్ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా భారత్ తన అవసరాలు తీర్చుకోవాలంటే తక్కువ ధరకు వచ్చే చోట్ల తప్పక కొనాల్సిందే. ఈ విధంగా కొనడం ద్వారా భారత్ కు చాలా ఆదాయం వచ్చింది. కాబట్టి ఆ దేశాలతో మనకేం సంబంధం లేకుండా ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చినా… భారత్ మాత్రం వెనకడుగు వేయకుండా ఆయిల్ ను కొనుక్కుంటుంది. అంతే కాదు కొన్న ఆయిల్ ను ఎక్కువ ధరలకు విదేశాలకు కూడా సరఫరా చేయడం మొదలు పెట్టింది. ఎలాగో తక్కువ ధరకు వస్తుంది. దేశ అవసరాలు పోను మిగిలిన దాన్ని ఇతర దేశాలకు అందిస్తోంది. దీని వల్ల మరింత లాభం చేకూరుతుంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల ఆ రెండు దేశాలే కాదు.. యూరప్ దేశాలు కూడా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. ఇలా కాకుండా తటస్థంగా ఉంటూ దేశ అభివృద్ధి కుంటుపడకుండా చూడటంలో భారత్ సఫలమైంది.

అయితే.. సహా నాటో దేశాల కూటమి ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్‌కు రష్యా తక్కువ ధరకు ముడి చమురును సరఫరా చేయడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోయింది.. యుక్రెయిన్‌ యుద్ధంలో తటస్థ వైఖరి ప్రదర్శిస్తోన్న భారత్‌ను చూసి అమెరికా ఓర్వలేక మొదట్లో విష ప్రచారం చేసింది.. యుద్ధంలో ఇప్పటి వరకు ఏ దేశానికి మద్దతు ఇవ్వని భారత్‌ పై అగ్రరాజ్యం బురద జల్లే ప్రయత్నం చేసింది.. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొంటే ఆంక్షలు ఉల్లంఘన కాదు.. కానీ యుద్ధానికి దిగిన రష్యా వైపు మొగ్గు చూపడాన్ని మాత్రం తాము ఎంత మాత్రం సమర్థించట్లేదని అమెరికా పరోక్ష విమర్శలు చేసింది. యుద్ధం వైపు మొగ్గు చూపడం అనేది చరిత్ర పుస్తకాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందంటూ అర్థంలేని ఆరోపణ చేసింది అమెరికా. రష్యా నాయకత్వానికి మద్దతు ఇస్తే.. రష్యా దురాక్రమణకు కూడా మద్దతు ఇచ్చినట్లే అంటూ వ్యాఖ్యానించింది. చరిత్ర పుస్తకాల్లో ఇండియా ఎక్కడ ఉండాలో ఆలోచించుకోవాలంటూ విమర్శించింది. ఆ తర్వాత భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించడంతో.. అమెరికా వెనక్కి తగ్గింది.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తే తమకేం నష్టం లేదంటూ ప్రకటించింది..

యుక్రెయిన్‌ సరిహద్దులో రష్యా సైనిక దళాలను మోహరించడం ప్రారంభించాక ఊపందుకున్న ముడిచమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా నిలకడగా పెరుగుతూ వచ్చాయి. దీంతో ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడిన భారత్‌పై ఒత్తిడి పెరిగింది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు లభ్యత బాగా తగ్గిపోయింది. మరోవైపు రష్యా వద్ద కొనుగోళ్లు తగ్గడంతో భారీగా నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో భారత్ మిత్రపక్షమైన రష్యా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్‌కు అతి తక్కువ ధరకే క్రూడాయిల్ విక్రయిస్తామని చెప్పింది. ఈ ప్రతిపాదనతో తమ దేశంలో క్రూడ్ ఆయిల్‌ను కొంత మేర అమ్ముకునే సౌలభ్యం రష్యాకు దొరికింది.. ఇక భారత్‌కు ఈ ఆఫర్‌ ద్వారా చౌకగా క్రూడ్ ఆయిల్ లభిస్తుంది. అయితే ఇది అంత చిన్న విషయం కాదు.

రష్యా డిస్కౌంట్ డీల్‌ను భారత్ ఓకే చేయడంతో ఇండియాకు ఎన్నో రెట్లు ప్రయోజనం చేకూరింది.. అటు క్రూడ్‌ సరఫరాకు సంబంధించి షిప్పింగ్‌ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌ కూడా రష్యానే భరిస్తోంది.. రష్యా ఆఫర్ ఇచ్చిన సమయం నుంచి ప్రతి నెలా రష్యా చమురు దిగుమతులను పెంచుకుంటోంది భారత్. 2022 ఫిబ్రవరిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 35 శాతానికి చేరుకున్నాయి. భారత్‌ కు చమురు దిగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా వరుసగా ఐదో నెలలో కూడా అగ్రస్థానంలో ఉంది.

ఓ వైపు రష్యాపై యూరోప్ దేశాలతో సహా అమెరికా ఆంక్షలు.. మరోవైపు.. భారత్ చమురు సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి.. అలాంటి పరిస్థితుల్లో రష్యా తన మిత్రదేశమైన భారత్ కు చమురు డిస్కౌంట్ లో ఇస్తుండటం, భారత్ కొనుగోళ్లను పెంచుతూ పోతుండటం ఇప్పుడు ఇరుదేశాలకు ప్రయోజనకరంగా మారింది..

Must Read

spot_img