Homeతెలంగాణకేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ .. పక్కా..

కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ .. పక్కా..

కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ .. పక్కా అని టాక్ వెల్లువెత్తుతోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ వ్యూహంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అరెస్ట్ టాక్ వేళ నెక్ట్స్ స్టెప్ఏ మిటన్నదే హాట్ టాపిక్ గా మారింది.

ఒకరోజు అటూ ఇటూ కావచ్చునేమో కానీ ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు అందుకుని ఢిల్లీ వెళ్ళిన కవితకు ముఖ్యమంత్రి కేసేఆర్ ధైర్యం చెప్పి పంపించారనీ, ఒక తండ్రిగానే కాకుండా, పార్టీ అధినేతగా కూడా కేసీఆర్ కుమార్తె కవితకు నేనున్నానన్న ధైర్యాన్ని ఇచ్చారనీ చెబుతున్నా.. ఆమె హస్తినకు బయలుదేరి వెళ్లే ముందు కసీఆర్ ను కలవకుండానే బయలుదేరడం చూస్తే ఆ భరోసా ఆమెకు లభించినట్లు లేదని అయితే, జరుగతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెరాస రోజుల్లో కేసీఆర్ తెరపైకి తెచ్చిన రాజకీయ, న్యాయ పోరాటాన్ని, బీఆర్ఎస్ సుదీర్ఘ కాలం కొనసాగించక తప్పదని అంటున్నారు. నిజానికి, ఈ కుంభకోణం నుంచి ఒక్క కవిత మాత్రమే కాదు, ఇప్పటికే అరెస్ట్ అయి విచారణ ఎదుర్కుంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా, ఎవరికీ కూడా ఇప్పట్లో ఉపశమనం దొరికే అవకాశాలు పెద్దగా లేవని కూడా అంటున్నారు. అందుకే మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన వెంటనే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంటే, ఈకేసు ఇప్పట్లో తేలేది కాదని, సుదీర్ఘ కాలం పాటు రాజకీయ, న్యాయ పోరాటం తప్పదనే ఉద్దేశంతోనే కేజ్రీవాల్
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. అదలా ఉంచితే కవిత విషయానికి వస్తే, భూత, భవిష్యత్, వర్తమాన రాజకీయాలను అవపోసన పట్టిన ముఖ్యమంత్రి కేసేఆర్ .. నిజంగా కవిత అరెస్ట్ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తలుస్తోంది.

నిజానికి ఆరు నెలలకు పైగా ఢిల్లీ లిక్కర్ స్కాం కథ నడుస్తున్నా, అందులో కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా, చివరకు కవిత అరెస్ట్ అనివార్యమని తెలిసినా, విపక్షాలు, ముఖ్యంగా బీజేపీ కవిత అరెస్ట్క థలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా కేసీఆర్ ఏనాడూ ఢిల్లీ కుంభకోణం గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. చివరకు ఈడీ సమాన్లు అందుకుని ఢిల్లీ వెళ్ళే ముందు కవిత ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలుస్తారని ప్రచారం జరిగినా, ఆమె ప్రగతి భవన్ కు వెళ్ళకుండా నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి అక్కడి నుంచి ఢిల్లీకి ఒంటరిగానే వెళ్లారు.

ఇదంతా కూడా కేసీఆర్ వ్యూహంలో భాగంగా జరిగిందన్న వాదన కూడా ఉంది. అది పక్కన పెడితే.. కవితను అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి..? ఈ విషయంలో కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ట్ఏంటి..?

ఎప్పటి నుంచో కేంద్రాన్ని ఢీకొంటున్న కేసీఆర్.. మరింత రెచ్చిపోతారా..? ప్రతిపక్ష పార్టీల అధినేతలను, బీజేపీని వ్యతిరేకిస్తున్న నాయకులను కలుపుకొని వెళ్తారా..? ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ అయిన వారితో, విచారణను ఎదుర్కొంటున్న వారితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారా..? ఏది ఏమైనా ప్రస్తుతానికి ఆయన వ్యూహం ఏమిటన్నది గోప్యంగానే వుంది. అయితే ప్రస్తుతానికి, అందరి దృష్టీ మత్రం కవిత అరెస్ట్ అయితే … కేసీఆర్ ఏం చేస్తారన్నదానిపైనే కేంద్రీకృతం అయ్యిందని మాత్రం పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరపాలని అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీపార్టీ, లెజిస్లేటివ్‌ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశాన్ని జరుపుతున్నారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు.. రాష్ట్రవ్యాప్త నేతలంతా ఈ సమావేశానికి హాజరుకావాలని నిర్దేశించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, ఆమె అరెస్టవుతారన్న ప్రచారం నేపథ్యంలో ఆ అంశంపై చర్చిస్తారు. కవిత అరెస్ట్ అయితే పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై, పార్టీ కార్యకలాపాలు, ఇతర అంశాలపై చర్చిస్తారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు.. రాష్ట్రవ్యాప్త నేతలంతా ఈ సమావేశానికి హాజరుకావాలని నిర్దేశించారు.

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, ఆమె అరెస్టవుతారన్న ప్రచారం నేపథ్యంలో ఆ అంశంపై చర్చిస్తారు. కవిత అరెస్ట్ అయితే పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై, పార్టీ కార్యకలాపాలు, ఇతర అంశాలపై చర్చిస్తారు. కవిత ను అరెస్ట్ చేస్తే బీఆర్‌ఎస్‌ పరంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను కూడా ఈ భేటీలో రూపొందించుకుంటారని తెలుస్తోంది.
ఈ మేరకు సీఎం కేసీఆర్‌ మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పార్టీశ్రేణులను అప్రమత్తం చేయడంపై మంత్రులకు పలు సూచనలు చేస్తారని సమాచారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఎండగడుతూ ఉద్యమించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చే అవకాశాలున్నాయి. అలాగే.. ప్రతిపక్ష పార్టీలు పరిపాలించే రాష్ట్రాలపై బీజేపీ ధోరణి ఎలా ఉంది, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తోందన్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఆదేశించవచ్చని సమాచారం. ఉమెన్స్ డే రోజు ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇష్యూపై ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చలు కొనసాగుతున్నాయి.

ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. కవిత అరెస్ట్ తప్పదా..? అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి..? అనేదానిపై చర్చించుకుంటున్నారు.
మరోవైపు .. బీఆర్ఎస్ నాయకులు కేంద్రప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థల తీరును తప్పుపడుతున్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారనేది బీఆర్ఎస్ వర్గాల టాక్. మరోవైపు కొంతమంది నేతలు మరోలా మాట్లాడుతున్నారు. ఈ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా తిరిగి వస్తారని దీమా వ్యక్తం చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు తెరపైకి వచ్చిన దగ్గర నుంచి బీజేపీతో పాటు కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇవాళ లేదా రేపో కవిత అరెస్ట్ తప్పదనే ప్రచారం చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో తన పేరు రావడంతోనే కవితకు.. మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందంటూ సెటైర్లు వేస్తోంది. దీనికి బీఆర్ఎస్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ప్రస్తుతం మెజార్టీ సభ్యులు పార్లమెంటులో బీజేపీకి ఉన్నందున.. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేలా చూడాలని మోడీ సర్కారుపై ఒత్తిడి తెస్తోంది. మహిళా రిజర్వేషన్​
బిల్లు తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయాలని ప్లాన్ చేశారు.

అయితే.. గత 9 ఏళ్లుగా గుర్తుకురాని మహిళా రిజర్వేషన్​ బిల్లు కవితకు ఇప్పుడెందుకు ఇంత అకస్మాత్తుగా తెరమీదకు వచ్చిందనేది ఆశ్చర్యకరమే. 2014 నుంచి 2018 తెలంగాణ క్యాబినెట్​లో ఏ ఒక్క మహిళా మంత్రి లేరు. అప్పుడు కవితకు మహిళల హక్కులు, సాధికారత ఎందుకు యాదికిరాలేదని ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా అరెస్ట్‌ కావడం, సోదాలు, ఆధారాల సేకరణ నేపథ్యంలో ఈడీ జోరు పెంచింది. మనీలాండరింగ్‌ కోణం కాబట్టి కవిత సీబీఐకి ఇచ్చిన బ్యాంకు లావాదేవీల వివరాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. వాటి ఆధారంగా ఆమెను ప్రశ్నించనున్నారు. అయితే ఈ సమయంలో కవిత విచారణకు హాజరవడం వల్ల దర్యాప్తు సంస్థలకు మరింత మేలు చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. అయితే కవితకు మాత్రం ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు సలహా ఇచ్చినట్లు తెలిసింది.

మరి ఈ అంశంలో బీఆర్ఎస్ ప్లాన్ పైనే అందరికీ ఆసక్తి నెలకొంది.

Must Read

spot_img