Homeతెలంగాణఎమ్మెల్సీ కవిత .. సీబీఐ నోటీసులపై యూటర్న్ తీసుకుంటున్నారా..?

ఎమ్మెల్సీ కవిత .. సీబీఐ నోటీసులపై యూటర్న్ తీసుకుంటున్నారా..?

ఎమ్మెల్సీ కవిత .. సీబీఐ నోటీసులపై యూటర్న్ తీసుకుంటున్నారా..? తొలుత రెఢీ అన్న ఆమె .. ఇప్పుడు లేఖాస్త్ర్రం సంధించడం వెనుక .. పెద్ద
కథే ఉందని టాక్ వినిపిస్తోంది. నోటీసుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోనక్కరలేదా..? అన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది.

నోటీసుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోనక్కరలేదా..?

టీఆర్ఎస్‌‌కు చెందిన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన ఘటన తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు తెర
తీసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ
సీబీఐ ఈ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ నెల 6వ తేదీన ఆమెను విచారించనుంది సీబీఐ. అయితే నోటీసులు అందిన తరువాత సీబీఐ అధికారులకు
కవిత లేఖ రాశారు.

14035/06/2022 కింద జారీ అయిన నోటీసుల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను తనకు అందజేయాలని కోరారు. వీలైనంత త్వరగా వాటిని పంపించాలని, దీనివల్ల విచారణకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి, తగిన సమాధానాలను ఇవ్వడానికి తనకు వీలుగా ఉంటుందని చెప్పారు. అలాగే- హైదరాబాద్‌లో ఏ తేదీన విచారణకు చేపట్ట వచ్చో నిర్ధారించగలనని తేల్చి చెప్పారు. ఢిల్లీ సీబీఐ, ఏసీబీ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ షాహీకి ఆమె ఈ లేఖ రాశారు.

నిజానికి- సీబీఐ అధికారులు మంగళవారం కవితను విచారించాల్సి ఉంది. ఈ తేదీని ఆమె ఇంకా ఖరారు చేయలేదు. ఈ విషయాన్ని ఈ లేఖలోనే స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు అందిన తరువాతే విచారణ తేదీని నిర్ధారించగలనని పేర్కొన్నారు. తనపై నమోదైన ఫిర్యాదు కాపీలను కూడా కవిత సీబీఐ అధికారులకు అడిగినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన కవిత నోటీసుల గురించి వివరించి, దీనిపై ఎలా ముందుకు సాగాలనే విషయం మీద చర్చించినట్లు సమాచారం.

దీన్ని ఎలా ఎదుర్కొనాల్సి ఉంటుందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. న్యాయ సలహాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని తరువాతే ఆమె సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఇదిలా ఉంటే, ఢిల్లీ లిక్కర్కుం భకోణం కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా అందించిన రిమాండ్ రిపోర్ట్‌‌లో కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారంటూ వార్తలొచ్చిన మరుసటి రోజే సీబీఐ నుంచి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మరోవంక టీఆర్ఎస్ నాయకులు ఈ నోటీసులపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోన్నారు.

ఇవి విచారణ కోసం పంపించిన నోటీసులు కావని స్పష్టం చేస్తోన్నారు. ఆమె నుంచి వివరణ తీసుకోవాలనే ఉద్దేశంలో సీబీఐ అధికారులు ఉన్నారని చెబుతున్నారు. అయితే ఇప్పుడీ నోటీసులు, లేఖాస్త్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై అటు రాజకీయవర్గాల్లోనూ పలు సందేహాలు తలెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెనే టార్గెట్‌గా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెనే టార్గెట్‌గా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని వెనుక భారతీయ జనత పార్టీ కుట్ర ఉందనే ఆరోపణలు
ఊపందుకుంటున్నాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారుల నోటీసులకు తాము ఏ మాత్రం భయపడమంటూ కవిత ఘాటుగా వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలో ఈ నోటీసులు ఆమెకు జారీ అయ్యాయి. ఢల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ నోటీసులు జారీ చేసిందనీ, విచారణకు తాను సహకరిస్తానని చెప్పిన కవిత అంతలోనే యూటర్న్ తీసుకున్నారు. సీబీఐ నుంచి నోటీసులు అందినట్లు స్వయంగా ప్రకటించి, హైదరాబాద్ లోని తన నివాసంలో విచారణకు రెడీ అని కూడా పేర్కొని, తండ్రి కేసీఆర్, న్యాయ నిపుణులతో చర్చల తరువాత యూటర్న్ తీసుకున్నారు.

దీంతో ఆమె సీబీఐ అధికారులు విచారణ సందర్భంగా వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించే దిశగా అడుగులువేస్తున్నారు. ఇందుకు ఆమె సీబీఐకి రాసిన లేఖ తార్కాణంగా చెప్పుకోవచ్చు. సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి రాసిన లేఖలో కవిత సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని సాధ్యమైనంత త్వరగా తనకు అందించాలని కోరారు. ఒక వేళ సీబీఐ ఆ ఫిర్యాదు కాపీలు, ఎఫ్ఐఆర్ కవితకు అందజేయకుంటే అ విచారణకు హాజరయ్యేందుకు.. వివరణ ఇచ్చేందుకు ఆమె నిరాకరించేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

దీంతో సీబీఐ విచారణ విషయంలో కవిత యూటర్న్ తీసుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. తాజా లేఖతో దీన్ని బట్టి తనపై ఏ కేసు పెట్టారు? అందులోని లొసుగులను తెలుసుకొని జాగ్రత్త పడాలని.. కోర్టులో ఎదుర్కోవాలని కవిత ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

దీనివెనుక కేసీఆర్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. సీబీఐ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ తెలిస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఆధారాలు దొరక్కకుండా కోర్టుల్లో బలమైన వాదనతో నీరుగారిపోయేలా చేయవచ్చని కవిత, కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందంటూ ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో కానీ.. ఢిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి అంటూ సీబీఐ పంపిన నోటీసుల్లో పేర్కొంది.

దీంతో దీనికి సమాధానం ఇచ్చిన కవిత.. తనకు ముందు కంప్లైంట్, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వాలని కోరింది. ఈ కేసులో సీబీఐ ఎలా ముందుకెళుతుందో తెలుసుకొని జాగ్రత్తపడేందుకు కవిత వ్యూహాత్మకంగా ఈ లేఖలో కోరినట్టు తెలుస్తోంది.

సీబీఐ ఎమ్మెల్సీ కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసులు ఇచ్చింది.

దిల్లీ మద్యం షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని కేంద్ర హోంశాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. సీబీఐ ఎమ్మెల్సీ కవితకు సీఆర్పీసీ సెక్షన్
160 నోటీసులు ఇచ్చింది. అయితే ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏమిటంటే.. హైదరాబాద్‌లో సీబీఐ ఎంట్రీకి ఎప్పుడో రెడ్ సిగ్నల్వే శారు. జనరల్ కన్సెంట్ రద్దు చేశారు.

మరి ఇప్పుడు సీబీఐ తెలంగాణలోకి ఎలా ఎంట్రీ ఇస్తుంది ? తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి ఇవ్వాల్సిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 30నే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ జీవో ప్రకారం ఇకపై రాష్ట్రంలో సీబీఐ ఏ కేసు విషయంలో రాష్ట్రంలో దర్యాప్తు జరపాలన్నా ముందుగా ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, అనుమతి తీసుకోవాలి.

ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి వస్తుంది. దేశరాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. రాష్ట్రాల సాధారణ సమ్మతి లేకుంటే మాత్రం.. ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలులేదు. అయితే కవితను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పేరు దిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది.

దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో సమర్పించింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని అరోరా అంగీకరించారని కోర్టుకు తెలిపింది. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకోగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని ఈడీ అంటోంది. ఈ మొత్తం స్కామ్ గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు వారంతా ఫోన్లు మార్చారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

కవిత కూడా ఫోన్లు మార్చారని వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఇదిలా ఉంటే, సీబీఐకు లేఖ రాయడం వెనుక కవితను సేఫ్ చేసే యోచనలో కేసీఆర్ ఉన్నారన్న వాదన హాట్ టాపిక్ గా మారింది. కేసు వివరాలు తెలిస్తే, విచారణకు హాజరు కావాలో వద్దో నిర్ణయించుకుంటానని చెప్పడం వెనుక .. పెద్ద వ్యూహమే ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.

అసలు తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీ ఇవ్వాలంటే, కేసీఆర్ సర్కార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయం తెలిసీ నోటీసులు జారీ వెనుక పెద్ద కథే ఉందని టాక్ వెల్లువెత్తుతోంది. కవితా సీబీఐ లేఖ రాయడంపైనా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎంట్రీకి అనుమతి తీసుకోకుండా, నోటీసులు జారీ ఏమిటన్నది సైతం చర్చనీయాంశంగా మారింది.

మరి ఈ స్కాంలో నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img