Homeఆంధ్ర ప్రదేశ్ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ మరింత ఆందోళనను తెచ్చిపెట్టిందా..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ మరింత ఆందోళనను తెచ్చిపెట్టిందా..?

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్‌ను నమ్ముకుని రంగంలోకి దిగిన టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ.. అనూహ్యంగా విజయం సాధించారు. దీంతో వైసీపీ నిలబెట్టిన ఏడుగురు ఎమ్మెల్సీల్లో ఒకరు ఓడిపోయారు. తమ పార్టీ నుంచి కొందరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారనే అనుమానంతో వైసీపీ అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అయినా క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ నాయకత్వం అడ్డుకోలేకపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో జోష్ మీదున్న టీడీపీకి ఈ ఎన్నిక మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ చేసింది ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.

వైసీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఈ ఇద్దరేనా ? లేక వేరే వాళ్లా ? అన్నది తేలిపోనుంది.అయితే వైసీపీకి షాక్ ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఏం చేయబోతున్నారనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగినా. విజయం తమదే అనే భావనలో ఆ పార్టీ నాయకత్వం. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకత్వం తమకు ద్రోహం చేసిన ఎమ్మెల్యేను పదవుల నుంచి తొలగించి ఉప ఎన్నికలకు సిద్ధమవుతుందా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ సీఎం జగన్ ఈ విషయంలో ముందుకుసాగితే.. ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ స్పీకర్ వైసీపీ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటే.. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా తమ పదవులు కోల్పోవాల్సి ఉంటుంది. ఇక టీడీపీకి ఓటు వేసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులు కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఎదురైతే వైసీపీ నాయకత్వం ఈ విషయంలో ఏ రకంగా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఓటు వేశారనే విషయాలను టెక్నికల్‌గా ప్రూవ్ చేయలేరని, కాబటి అసలు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమనే ప్రశ్నే ఉండదని పలువురు చెబుతున్నారు. మొత్తానికి తాజా ఎన్నికలు సీఎం జగన్‌కు ఊహించని సవాళ్లను ముందుంచాయని అర్థమవుతోంది.

వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యేలను కలవడానికి కాదు, కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడని ఆయన ఇప్పుడు పనిగట్టుకుని ఫోన్ చేసి మరీ క్షేమ సమాచారాలు కనుక్కున్నారు. ఖరీదైన స్టార్ హోటళ్లలో క్యాంపు చేయించారు. నియోజకవర్గానికి ఏం కావాలని ఆరా తీశారు. తక్షణమే నిధుల విడుదలకూ ఓకే అంటున్నారు. అయినా భయపడుతున్నారు. నిఘా పెట్టారు. ఎక్కడ కట్టు తప్పుతారో అని క్షణం క్షణం ఉలిక్కి పడుతున్నారు. ఇదంతా ఎందుకా అంటే.. ఎమ్మెల్మే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం ఆయననువెన్నాడుతుండటమే కారణమని అంటున్నారు. అందుకే ఇంత కాలం పార్టీ ఎమ్మెల్యేలకు పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వకుండా, నియోజకవర్గ పనులన్నీ వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకే అప్పగించిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎక్కడ లేని విలువా ఇస్తున్నారు.

సకల మర్యాదలూ చేస్తున్నారు. హోటల్ లో క్యాంపు ఏర్పాటు చేసి వారేం అడిగితే అది చేయడానికి రెడీ అయ్యారు. సాధారణంగా విపక్షంలో ఉన్న పార్టీ తన
సభ్యులను కాపాడుకోవడానికీ, పార్టీ కట్టు తప్పి వారు పక్క చూపులు చూడకుండా ఉండటానికీ క్యాంపులు ఏర్పాటు చేయడం ఇప్పటి వరకూ చూశాం. కానీ వైసీపీ అధినేత జగన్ దీ, ఆయన ప్రభుత్వానిదీ రివర్స్ వ్యవహారం కనుక ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలే క్యాంపుల్లో బందీలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధినేత తమ అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా అనిపించినా.. అసలు విషయం తెలిసిన ఎమ్మెల్యేలు మాత్రం అధినేత తీరు అందితే జుట్టు, లేకపోతే కాళ్లు అన్నట్లుగా ఉందని అంటున్నారు.

ప్రస్తుతం వైసీపీకి 149 మంది సభ్యులు ఉన్నారు. వీరికి తెలుగుదేశం నుంచి ఫిరాయించిన నలుగురు, జనసేన నుంచి దూరం జరిగిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 మంది ఉన్నా, నలుగురు ఆ పార్టీకి దూరం జరిగారు. అంటే వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం 19. ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించాలంటే.. కనీసం 22 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇక వైసీపీకి దూరంగా ఉన్న కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు ఇప్పటికే ఆత్మ ప్రభోదానుసారం అని ప్రకటించడంతో వారిద్దరూ తెలుగుదేశం అభ్యర్థికే ఓటు వేస్తారనుకున్నా.. ఆ పార్టికి మరో ఓటు దక్కితే కానీ విజయం లభించదు. లెక్కలు ఇంత క్లియర్ గా ఉన్నా వైసీపీ ఓటమి భయంతో వణికిపోతోంది. తమ పార్టీకే చెందిన కనీసం ఆరుగురు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి గూడు కట్టుకుని ఉందని అనుమానిస్తోంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్యే లను వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకోగా , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. మొత్తం మూడు పాతబద్రుల స్థానానికి ఎన్నిక జరగగా మూడింటినీ టీడీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. దీనితో రాష్ట్రంలో ఇది సంచలనంగా మారింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు ఈ ఫలితాలను ఆధారంగా చేసుకుని అధికార వైసీపీని దారుణంగా విమర్శిస్తున్నారు. వైసీపీ పని ఇక అయిపోయింది… జగన్ పాలన సరిగా లేదు కాబట్టే పట్టభద్రులు టీడీపీకి పట్టం కట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వాస్తవానికి ఏపీలో ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా దాదాపుగా టీడీపీనే విజయం వరిస్తుంది. ఈ విషయం తెలుసుకోవాలంటే ఒకసారి గతం నుండి చూసుకుంటే క్లియర్ గా అర్ధమవుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అయితే ఇంతకు ముందు పిడిఎఫ్ బలపరిచే అభ్యర్థులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కీలకంగా ఉండేది. కానీ ఇప్పుడు పిడిఎఫ్ కూడా టీడీపీకి సపోర్ట్ చేయడంతో వారి విజయానికి మార్గం సులువు అయింది. పైగా వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పధకాల లభ్ది పొందివారిలో ఈ ఎన్నికల్లో ఓటేసిన వారు ఎక్కువగా లేకపోవడం కూడా ప్రధాన కారణం. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి అండదండగా నిలిచే మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రమే అని చెప్పాలి. వీరు ఈ ఎన్నికలో ఓటు వేయడానికి అవకాశం లేదు కాబట్టి వైసీపీ ఓటమి చెందింది.

వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండే ఛాన్స్ లేదు. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఎన్నికలను ఏమాత్రం ప్రభావితం చేయలేవు అన్నది వాస్తవం. అంతే కాకుండా టీడీపీ నాయకులు అంటున్నట్లుగా పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ విజయం వైసీపీకి నష్టం కాదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే వీటి ప్రభావం కనిపించకున్నా, ప్రజల మైండ్ సెట్ మారే అవకాశంఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇప్ప‌టికే మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో వైసీపీ ఓడిపోయి షాక్‌లో వుంది. ఆ త‌ప్పు మ‌రోసారి పున‌రావృతం కాకూడ‌ద‌ని ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై వైసీపీ సీరియ‌స్ దృష్టి పెట్టింది. అయినప్పటికీ ఇక్కడా వైసీపీకి షాక్ తగిలినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నేతలె్వరు అన్నదానిపై అధిష్టానం దృష్టి పెట్టింది.

Must Read

spot_img