ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు పెటాకులు అయిందన్న టాక్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ నేతలు చేసిన భిన్న వ్యాఖ్యలు .. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దీంతో ఇక పొత్తుకు ఫుల్ స్టాప్ పడినట్లేనన్న టాక్ వెల్లువెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ-జనసేన మధ్య స్నేహం ముగిసిన అధ్యాయంగా మారిందా.? తాజా పరిస్థితులు చూస్తుంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ, జనసేన పొత్తుపై బీజేపీ నేత మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన పొత్తు ఉన్నా క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నారు. ఇరుపార్టీలు కలిసి పనిచేసే దిశగా జనసేన
అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఆలోచించాలని మాధవ్ సూచించారు.
లేకపోతే పేరుకే రెండు పార్టీల పొత్తు అని జనం అనుకుంటారని వ్యాఖ్యానించారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 5 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఉత్తరాంధ్రలో అయితే చెల్లని ఓట్లకన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు జనసేనాని ప్రచారం చేయలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే పార్టీ రాష్ట్ర అధినాయకత్వం పవన్‌ను అడగనేలేదనే ప్రచారం జరుగుతోంది. పొత్తుల గురించి హై కమాండ్ చూసుకుంటుందని మాధవ్ చెప్పారు. మరోవైపు ఏపీ బీజేపీ పదాధికారులతో బీజేపీ అధినాయకత్వం సమావేశమై పార్టీ పనితీరు, ఎమ్మెల్సీ ఫలితాలపై
చర్చించింది. జనసేన వ్యవహార శైలిపైనా చర్చించినట్లు సమాచారం.
ఎన్నికల్లో వ్యూహం లేకుండా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. మొన్నటికి మొన్న మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ .. బీజేపీతో పొత్తు కొనసాగించాలా వద్దా అంటూ పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. అప్పుడే బీజేపీ-జనసేన మధ్య స్నేహం ముగిసిన అధ్యాయమేనని రాజకీయ పరిశీలకులు ఊహించారు. ఇవాళ బీజేపీ నేత మాధవ్ కూడా జనసేన అంటీ అంటనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించి కలకలం రేపారు. మరోవైపు రాష్ట్ర నాయకత్వంలో మార్పులుంటాయనే ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించి ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ-జనసేన మధ్య స్నేహం ముగిసిన అధ్యాయంగా మారిందా.?
తాజా పరిస్థితులు చూస్తుంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ, జనసేన పొత్తుపై బీజేపీ నేత మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన పొత్తు ఉన్నా క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నారు. ఇరుపార్టీలు కలిసి పనిచేసే దిశగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఆలోచించాలని మాధవ్ సూచించారు. లేకపోతే పేరుకే రెండు పార్టీల పొత్తు అని జనం అనుకుంటారని వ్యాఖ్యానించారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 5 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఉత్తరాంధ్రలో అయితే చెల్లని ఓట్లకన్నా తక్కువ ఓట్లు వచ్చాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు జనసేనాని ప్రచారం చేయలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే పార్టీ రాష్ట్ర అధినాయకత్వం పవన్‌ను అడగనేలేదనే ప్రచారం జరుగుతోంది. పొత్తుల గురించి హై కమాండ్ చూసుకుంటుందని మాధవ్ చెప్పారు. మరోవైపు ఏపీ బీజేపీ పదాధికారులతో బీజేపీ అధినాయకత్వం సమావేశమై పార్టీ పనితీరు, ఎమ్మెల్సీ ఫలితాలపై చర్చించింది. జనసేన వ్యవహార శైలిపైనా చర్చించినట్లు సమాచారం. ఎన్నికల్లో వ్యూహం లేకుండా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. మొన్నటికి మొన్న మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ ..
బీజేపీతో పొత్తు కొనసాగించాలా వద్దా అంటూ పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. అప్పుడే బీజేపీ-జనసేన మధ్య స్నేహం ముగిసిన అధ్యాయమేనని రాజకీయ పరిశీలకులు ఊహించారు. ఇవాళ బీజేపీ నేత మాధవ్ కూడా జనసేన అంటీ అంటనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించి కలకలం రేపారు. మరోవైపు రాష్ట్ర
నాయకత్వంలో మార్పులుంటాయనే ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించి ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో స్నేహ బంధం తెంచుకుంటోన్న జనసేన తెలుగుదేశం పార్టీతో దోస్తీ చేసేందుకు ఉవ్విళ్లూరుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని పవన్ కల్యాణ్ ను అడిగారట..కానీ ఆయన స్పందించలేదట. ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పుకుని బాధపడుతున్నారు ఉత్తరాంధ్ర నుంచి ఓడిపోయిన ఎమ్మెల్సీ మాధవ్.
బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో స్నేహ బంధం తెంచుకుంటోన్న జనసేన తెలుగుదేశం పార్టీతో దోస్తీ చేసేందుకు ఉవ్విళ్లూరుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని పవన్ కల్యాణ్ ను అడిగారట..కానీ ఆయన స్పందించలేదట. ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పుకుని బాధపడుతున్నారు ఉత్తరాంధ్ర నుంచి ఓడిపోయిన ఎమ్మెల్సీ మాధవ్.
అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం చెల్లని ఓట్ల స్థాయిలో కూడా పరపతి చూపించకపోవడంతో పరువు పోయిన అంశంపై పదాధికారుల సమావేశం పెట్టి మాట్లాడుకున్నారు. అందులో పవన్ కల్యాణ్ మద్దతివ్వకపోవడంపై ఎక్కువ ఫీలయ్యారు. నిజంగా పవన్ మద్దతిచ్చి ఉంటే.. ఆ పొత్తుతో వచ్చే కొద్ది ఓట్లను కూడా తమ బలంగా చెప్పుకుని చెలరేగిపోయేవారు.కానీ పవన్ మద్దతిచ్చినా బీజేపీకి ఓట్లేసేవారు తక్కువ. ఆ విషయం తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో తేలిపోయింది. ఆ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి బీజేపీకి వచ్చింది యాభై వేల ఓట్లు. పైగా పవన్ కూడా ప్రచారం చేశారు. ఆ ఓట్లన్నీ జనసేన, పవన్ ను చూసి వచ్చినవే. అయినా అదేదో తమ బలమని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాతైనా సేనానికి కనీస గౌరవం ఇచ్చారా అంటే ఇవ్వలేదు.
పదో ఆవిర్భావ సభలో బీజేపీ ఎలా వ్యవహరించిందో.. రాష్ట్ర నేతలు ఏం చేశారో పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. వారంతా వైసీపీకో కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయానికి అందరూ వచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మద్దతివ్వకపోవడం వల్లే తమకు ఈ ఘోరఫలితాలు వచ్చాయన్నట్లుగా మాట్లాడుతున్నారు జనసేనతో కలిస్తే ప్రభంజనం సృష్టిస్తామని మాధవ్ చెప్పుకొచ్చారు.. అలాంటి ప్రభంజనం సృష్టిస్తే జనసేన సృష్టించాలి.ఎందుకంటే.. బీజేపీకి అసలు బలంలేదని తేలిపోయింది. కొసమెరుపేమిటంటే.. గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించడంతో గెలిచిన మాధవ్ .. ఆ తర్వాత టీడీపీని ఎన్ని మాటలన్నారో.. తాము సొంత బలంతో గెలిచామని ఎలా చెప్పుకున్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే దైర్యంతోనే ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు.
ఇప్పుడు పవన్ మద్దతివ్వలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాజా వ్యాఖ్యలతో రాష్ట్రంలో బిజెపి, జనసేన పొత్తు పెటాకులు కానుందన్న వాదనలు
వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో గత మూడేళ్లుగా బిజెపి, జనసేన పొత్తుల కొనసాగుతున్నాయి. పేరుకే పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీలు ఎప్పుడో పొత్తు ధర్మాన్ని పాటించినట్లు బయటకు కనిపించిన దాఖలాలు లేవు. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన సందర్భాలు కనిపించవు. కానీ బిజెపి, జనసేన పొత్తులోనే ఉన్నాయన్న వ్యాఖ్యలు ఇరు పార్టీల నుంచి వినిపిస్తుంటాయి.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బిజెపి నుంచి పోటీ చేసి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన పివిఎన్ మాధవ్ జనసేన, బిజెపి పొత్తుపై కాస్త భిన్నమైన కామెంట్ చేశారు. జనసేన తమకే మద్దతిస్తుందని పిడిఎఫ్ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదని మాధవ్ అన్నారు. జగన్ ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు కేంద్ర మంత్రులు హాజరు కావడం కూడా తమ కొంపముంచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి వైసిపి కలిసి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మడం వల్లనే తమకు ఓట్లు వేయలేదని, వైసిపి వ్యతిరేక ఓటు అంతా తెలుగుదేశం పార్టీకి పడిందని ఆయన పేర్కొన్నారు.
తాజా బిజెపి నాయకుల వ్యాఖ్యలు నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే మాధవ్ చెప్పినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు ఇవ్వకపోవడానికి అనేక అంశాలు కారణాలుగా ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో పొత్తులో భాగంగా ముందుకు వెళ్లడానికి అవసరమైన రూట్ మ్యాప్ కావాలని జనసేనాని అడిగినప్పటికీ.. ఇవ్వకపోవడం వల్లే బిజెపికి కాస్త దూరం పాటించినట్లు చెబుతున్నారు. కొద్ది నెలల కిందట పవన్ కళ్యాణ్ అడిగినట్టుగా రూట్ మ్యాప్ ఇచ్చినట్టు ఉంటే ఈ పరిస్థితి రాకపోయి ఉండేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఒకపక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన గద్దె దించే ప్రయత్నం చేస్తుంటే.. బిజెపి కేంద్ర నాయకత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉండడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీకి అండగా ఉంటున్న బిజెపితో ముందుకు వెళ్లడం కంటే టిడిపితో కలిసి ఉండడం మంచిదన్న భావనతోనే జనసేనాని ఉన్నారు. అయితే, బిజెపికి దూరంగా ఉన్నప్పటికీ అది ఎక్కడ బయటకు రానీయడం లేదు. 2014 ఎన్నికల మాదిరిగా
టిడిపి, బిజెపి, జనసేన కలిసి వెళ్లే ప్రతిపాదనను టిడిపి, జనసేన చేస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు బిజెపిని పూర్తిగా పక్కన పెట్టలేని పరిస్థితి నెలకొంది. అందుకే పొత్తు ఉన్న లేనట్టుగా వ్యవహరిస్తూ జనసేన ముందుకు సాగుతోంది. పొత్తులో భాగంగా కలిసి వస్తే జనసేనతో వచ్చే ఎన్నికలకు వెళ్లాలని బిజెపి భావిస్తోంది. ఒకవేళ జనసేన గనుక కలిసి రాకపోతే ఒంటరిగానే సార్వత్రిక ఎన్నికలకు బిజెపి సిద్దపడుతోంది.
ఇప్పటికిప్పుడు రాష్ట్రాన్ని అధికారంలో దక్కించుకునే అంత శక్తి, సామర్థ్యాలు గానీ, కనీస స్థాయిలో ఓటు బ్యాంకు ను సంపాదించుకునే పరిస్థితి గానీ బీజేపీకి లేదు. కానీ, ఒంటరిగా వెళ్లడం వలన రానున్న రోజుల్లో బలమైన మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఎదిగేందుకు అవకాశం ఉందని బిజెపి, కేంద్ర రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నాయి. పొత్తులు పెట్టుకుంటూ ఇంకా ఎన్నాళ్లు పార్టీని ఎదగనీయకుండా చేస్తామన్న భావన పార్టీ నేతల్లో ఉంది.ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్లడం, లేదా ఒంటరిగా పోటీ చేయడం ద్వారా కొంత బలపడేందుకు అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు