Homeఅంతర్జాతీయంకశ్మీర్ లోయలో అద్భుతం..?

కశ్మీర్ లోయలో అద్భుతం..?

భూతల స్వర్గం .. అందాల కాశ్మీర్ లో లిథియం నిల్వలు .. బయటపడడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి నోచుకోవడమే కాక .. దేశంలో ఈవీ పరిశ్రమకు ప్రోత్సాహకరంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. ఆ నేపధ్య్తంలో లిథియం .. భారత్ ను ఈవీ బ్యాటరీల తయారీలో అగ్రగామిగా నిలిపింది.

ఈవీ వాహనాలకు, మొబైల్ మార్కెట్ కు జోష్ రానుంది. కాశ్మీర్ లో లిథియం గని బయటపడింది. దీంతో దేశం వీటి తయారీలో కీలక పాత్ర పోషించనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇక స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల ధరలు దిగిరానునన్నాయని అభిప్రాయపడుతున్నారు.

దేశంలో తొలిసారి లిథియం నిల్వలు వెలుగుచూశాయి. జమ్ము కాశ్మీర్ లో 59లక్షల టన్నుల లిథియం ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. బ్యాటరీలు, విద్యుత్ పరికరాల తయారీలో కీలకమైన ఈ లోహాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్ము కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో కనుగొన్నట్లు గనుల శాఖ ట్వీట్ చేసింది. గనుల శాఖ నిర్వహించిన సర్వేలో జమ్మూకాశ్మీర్, ఏపీ, చత్తీస్ ఘడ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణల్లో 51 చోట్ల ఖనిజ నిల్వలను గుర్తించారు.

వాటిలో 5 బంగారం గనులు కాగా.. మిగిలిన చోట పొటాష్, మాలిబ్డినం తదితర లోహాలను గుర్తించారు. 2018-19 మధ్య కాలంలో నిర్వహించిన సర్వేలో వీటిని గుర్తించారు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో ఉపయోగించే లిథియంను భారత్ ముఖ్యంగా ఆస్ట్రేలియా, అర్జెంటీనా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తాజాగా లిథియం నిల్వలు కనుగొనడంతో ఈవీ వాహనాల తయారీకి మరింత బలం చేకూరనుంది. కొత్తగా బయటపడిన నిల్వల కారణంగా దేశంలో లిథియం దిగుమతులు తగ్గనున్నాయి.

మన దగ్గరే ఆ లోహం లభిస్తుండటంతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో ఉపయోగించే బ్యాటరీల తయారీ ఖర్చు తగ్గనుంది. ఫలితంగా ఈవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల ధరలు తగ్గేఅవకాశముంది. లిథియం.. నాన్-ఫెర్రస్ మెటల్, ఇది ఈవీ బ్యాటరీలలో కీలకమైన భాగాలలో ఒకటి. జమ్మూ కాశ్మీర్ (UT), ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ వంటి 11 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫీల్డ్ సీజన్లు 2018-19 నుండి ఇప్పటి వరకు పని ఆధారంగా బ్లాక్‌లను జీఎస్ఐ నిర్వహించింది.

  • జ‌మ్ము క‌శ్మీర్‌లోని రిసాయి జిల్లా స‌లాల్ హైమానా లిథియం నిల్వ‌ల‌ను జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది` అంటూ ట్వీట్ చేసింది.

ఇవి కాకుండా మొత్తం 7,897 మిలియన్ టన్నుల వనరులతో బొగ్గు, మరియు లిగ్నైట్‌కు సంబంధించిన 17 నివేదికలను కూడా బొగ్గు మంత్రిత్వ శాఖకు అందజేశారు. జ‌మ్ము క‌శ్మీర్‌లోని రిసాయి జిల్లా స‌లాల్ హైమానా లిథియం నిల్వ‌ల‌ను జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది` అంటూ ట్వీట్ చేసింది. జీఎస్ఐ నిర్వహించే వివిధ థీమ్‌లు, జోక్యం చేసుకునే ప్రాంతాలపై ఏడు ప్రచురణలను కూడా సమావేశంలో విడుదల చేశారు.

తదుపరి ఫీల్డ్ సీజన్ 2023-24 కోసం ప్రతిపాదిత వార్షిక కార్యక్రమం సమావేశంలో సమర్పించి, చర్చించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. తదుపరి 2023-24 సంవత్సరంలో 12 సముద్ర ఖనిజ పరిశోధన ప్రాజెక్టులతో సహా 318 ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులతో కూడిన 966 కార్యక్రమాలను జీఎస్ఐ చేపడుతున్నట్లు వెల్లడించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యూహాత్మక, కీలకమైన ఖనిజాలపై 115 ప్రాజెక్టులు, ఎరువుల ఖనిజాలపై 16 ప్రాజెక్టులను రూపొందించింది. అనేక సంవత్సరాలుగా దేశంలోని వివిధ రంగాలలో అవసరమైన జియో-సైన్స్ సమాచార భాండాగారంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భౌగోళిక-శాస్త్రీయ సంస్థ హోదాను కూడా GSI పొందింది.

జాతీయ భౌగోళిక శాస్త్ర సమాచారం, ఖనిజ వనరుల అంచనాను రూపొందించడంతోపాటు నవీకరించడం జీఎస్ఐ ప్రధాన విధులు. భూ సర్వేలు, గాలి, సముద్ర సర్వేలు, ఖనిజ పరిశీలన, పరిశోధనలు, బహుళ-క్రమశిక్షణా భౌగోళిక, జియో-టెక్నికల్, జియో-పర్యావరణ మరియు సహజ ప్రమాదాల అధ్యయనాలు, గ్లేషియాలజీ, సీస్మో-టెక్టోనిక్ అధ్యయనం, ప్రాథమిక పరిశోధనల ద్వారా ఈ లక్ష్యాలు సాధించబడతాయి.

ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియంతోపాటూ.. నికెల్, కోబాల్ట్ వంటివి ఉంటాయి. వీటిని ఇండియా దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల చాలా ఖర్చవుతోంది. ఇండియాలోనే లిథియం లభిస్తే.. విదేశీ రవాణా ఖర్చులు తగ్గిపోతాయి. కాశ్మీర్‌లో లిథియం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అందువల్ల లిథియం అయాన్ బ్యాటరీల ధరలు తగ్గి.. ఈవీలు, మొబైల్స్ ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం చిలీ. ఆ దేశంలో 9.2 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉండగా.. ఆస్ట్రేలియాలో 5.5 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి.

ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా, చిలీ, చైనా దేశాలు పెద్ద మొత్తంలో లిథియాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. భారీ మొత్తంలో లిథియం నిక్షేపాలను గుర్తించడంతో భారతదేశ ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉంది. లిథియం ఖనిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండే దానికి కారణం. ఆవర్తన పట్టికలోనూ ఉండే ఈ మూలకాన్ని 1817లో జోహాన్ అగస్ట్ అర్ఫెడ్‌సన్ గుర్తించారు. గ్రీక్‌లోని లిథోస్ అనే పదం నుంచి లిథియం అనే పదం పుట్టింది. లిథోస్ అంటే రాయి అని అర్థం. తక్కువ సాంద్రతతో ఉండే ఈ ఖనిజం తీవ్రంగా చర్యను పొందుతుంది.

అందుకే ఇది సహజంగా ఖనిజం రూపంలో లభ్యం కాదు. ఇది విషపూరితమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అన్ని ఖనిజాల్లోకెల్లా తేలికైన లిథియం సాంద్రత.. నీటి సాంద్రతలో సగం ఉంటుంది. మిగతా ఖనిజాల మాదిరిగా లిథియం భూమ్మీద సహజంగా ఏర్పడదు. ప్రకాశవంతమైన నక్షత్ర పేలుడు నుంచి ఈ అంతరిక్ష మూలకం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బిగ్ బ్యాంగ్ కారణంగా విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లలో కొద్ది మొత్తంలో లిథియం ఏర్పడిందని నాసా గుర్తించింది. నక్షత్ర పేలుడుకు కారణమైన న్యూక్లియర్ రియాక్షన్లలో లిథియం తయారై.. గెలాక్సీ మొత్తం వ్యాపించిందని అంచనా.

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నందున.. ప్రపంచ వ్యాప్తంగా లిథియంకు సైతం డిమాండ్ పెరుగుతోంది. దీంతో ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కడున్నాయనే అన్వేషణ తీవ్రమవుతోంది. ప్రస్తుతం ఉన్న కర్బన ఉద్గారాల ప్రకారం చూస్తే.. ఈ ప్రపంచానికి 200 కోట్ల ఎలక్ట్రికల్ వాహనాలు అవసరం అని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. 2025 నాటికి లిథియం కొరత ఏర్పడే అవకాశం ఉంది. 2030 నాటికి దేశంలోని కొత్త వాహనాల్లో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది.

ప్రస్తుతం భారత్ విదేశాల నుంచి లిథియం దిగుమతి చేసుకుంటోంది. జమ్మూ కశ్మీర్లో భారీ స్థాయిలో లిథియం నిల్వలలను గుర్తించడంతో.. ఇక మీదట ఆ ఇబ్బందులు తప్పుతాయి. లిథియం ఖనిజాన్ని వెలికి తీయడానికి పెద్ద మొత్తంలో నీరు అవసరం. కానీ ప్రపంచవ్యాప్తంగా లిథియం నిల్వలు ఉన్న దేశాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. భారత్‌లో, ముఖ్యంగా కశ్మీర్లో నీటి కొరత ఉండదు కాబట్టి.. లిథియం ఉత్పత్తిలో భారత్‌ మిగతా దేశాలకు ప్రత్యామ్నాయం
కాగలదు. ఒక్క ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా వైద్య రంగంలోనూ లిథియం ఖనిజాన్ని ఉపయోగిస్తున్నారు.

ఫోన్ బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు ఇతర పునరుత్పాదక సాంకేతికతల్లోనూ లిథియాన్ని వాడుతున్నారు. గ్లాస్2లు, సిరామిక్స్‌ను దృఢంగా రూపొందించడానికి, ఉష్ణోగ్రత మార్పులకు తట్టుకోవడానికి వీలుగా లిథియాన్ని కలుపుతారు. వేడిని తట్టుకునే గ్రీజ్‌లు, లూబ్రికెంట్లలోనూ ఈ ఖనిజాన్ని ఉపయోగిస్తారు. విమాన పరికరాలను తక్కువ బరువుతో తయారు చేయడం కోసం అల్యూమినియం, రాగితో లిథియం మిశ్రమాన్ని కలిపి ఉపయోగిస్తారు. అణ్వాయుధాల తయారీలోనూ
లిథియం ఐసోటోప్‌ల (6 Li)ను ఉపయోగిస్తారు.

అత్యంత ప్రమాదకరమైన, కీలకమైన ముడి ఖనిజం .. కశ్మీర్ లోయలో బయటపడడం .. ఇప్పుడు కీలకంగా మారింది. దీంతో భారత్ కాలుష్యాన్ని తగ్గించే .. ఈవి వాహనాల తయారీకి సన్నద్ధం కానుంది. దీంతో లోయలో లిథియం .. నిల్వలు.. దేశ ఉత్పాదకతను పెంచనుందని చెబుతోంది.


Must Read

spot_img