Homeజాతీయంమెట్రో .. ఇక నీటి అడుగున .. సందడి చేయనుందా..?

మెట్రో .. ఇక నీటి అడుగున .. సందడి చేయనుందా..?

కోల్ కతాలో హుగ్లీనదిలో .. ఓ మెట్రో .. నీటిలో ప్రయాణానికి సిద్ధమవుతోంది. మరింకెందుకు ఆలస్యం .. ఆ అండర్ వాటర్ మెట్రో ..

కోల్ కతాలో .. ఈస్ట్ వెస్ట్ కారిడార్ లో మెట్రో .. అండర్ వాటర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 1984లో చేపట్టిన ఈ నిర్మాణం .. 2023 కల్లా
పూర్తవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు..

దేశంలో నీటి అడుగున మెట్రో రైలు కలిగిన మొదటి నగరంగా కోల్ కతా రికార్డుకెక్కనుంది. కోల్ కతా మెట్రో రైల్ కార్పోరేషన్ ఆధ్వంర్యంలో ఈస్ట్-వెస్ట్
కారిడార్ లో ఈ ప్రాజెక్ట్ పూర్తవనుంది. హౌరా వయా కోల్ కతా సాల్ట్ లేక్ వరకు మొత్తం 16.55 కి.మీ. ఉండే ఈ రైలు మార్గం, జూన్ 2023
నాటికళ్లా పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. హుగ్లీ నది నీటి అడుగున మెట్రో ట్రైన్ ట్రాక్ నిర్మించారు. అయితే, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పూర్తయి
మెట్రో రైలు పట్టాలెక్కాల్సి ఉండగా చిన్న చిన్న కారణాల వల్ల ఆలస్యం జరుగుతుంది. ఇప్పటికే ముప్పావు పనులు పూర్తయ్యాయని, మిగతా
పనులు పూర్తి చేసి అనుకున్న సమయానికంటే ముందే నీటి అడుగున ప్రయాణాన్ని మొదలు పెడతామని కేఎంఆర్ సీ తెలిపింది.

1984లో హుగ్లీ నది అడుగున ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరి దశకు చేరుకుంది. ఫైనల్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రైల్వేస్ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల కోసం వేచి చూస్తున్నామని కోల్‌కత్తా మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. సుమారు
10 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ 49 శాతం నిధులను సమకూర్చిందని తెలిపారు.
తొలుత అనుకున్న రూట్ ప్లాన్ కూడా మారిపోవడంతో అంచనా వ్యయం రెట్టింపు అయింది. మొదటిగా 14 కిలోమీటర్లకు గానూ రూ.49
బిలియన్లు ఖర్చవుతాయని అనుకున్నా, కానీ ఆ లెక్కలు తారుమారవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక చివరికి ప్రాజెక్టు వ్యయం రూ.86
బిలియన్లుగా మారింది. కాగా, ఈ మెట్రో అందుబాటులోకి వస్తే సుమారు 9 లక్షల మంది ప్రజలు రోజూ ప్రయాణిస్తారు. అంతేకాక హౌరా బ్రిడ్జి‌ని అతి
తక్కువ సమయంలోనే దాటేయవచ్చు.

హౌరా నుంచి వయా కోల్‌కతా సాల్ట్ లేక్‌ వరకు వెళ్లే ఈ మెట్రో లైన్ హుగ్లీ నదికి దిగువన నీటి అడుగున ప్రయాణమార్గాన్ని కలిగి ఉంటుంది. డిసెంబరు 2021 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావించినప్పటికీ సొరంగం నిర్మాణ సమయంలో సెంట్రల్ కోల్‌కతాలోని ఒక ప్రాంతంలో ప్రమాదాల కారణంగా ఆలస్యమైంది. భూగర్భంలో చేపట్టిన పనుల కారణంగా అదే ప్రాంతంలో అనేక ఇళ్లకు పగుళ్లు కూడా ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ పనుల్లో మరింత జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. మొత్తం ప్రాజెక్ట్ పొడవు 16.55 కి.మీ కాగా, ఇప్పటికే 9.30 కి.మీ ట్రాక్ పూర్తయింది. మిగిలిన 7.25 కి.మీ పొడవు ఏడాదిలోపు పూర్తవనుందని నివేదికలు తెలిపాయి.

తూర్పు-పశ్చిమ ప్రాంతంలో 16.6 కిలోమీటర్ల పొడవులో, 520 మీటర్ల నదీ గర్భం కింద ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు.

టన్నెల్ కారిడార్ నదీ గర్భానికి 33 మీటర్ల దిగువన నిర్మించారు. ఈ సొరంగ మార్గం కోల్‌కతా నుంచి హౌరాను కలుపుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులను తరలించడానికి సొరంగాలలో నడక మార్గాలు ఉంటాయని సైట్ సూపర్‌వైజర్ మిథున్ ఘోష్ చెప్పారు. వాటర్ టన్నెల్ ప్రాంతంలో సాంకేతిక సమస్య తలెత్తితే ప్రత్యేకమార్గం ద్వారా ప్రయాణికులను బయటకు తీసుకెళ్లవచ్చని మిథున్ చెప్పారు. ఈస్ట్‌-వెస్ట్‌ హౌరా మెట్రో స్టేషన్‌లో 80 శాతం పనులు పూర్తయ్యాయని,2023 నుంచి పూర్తి స్థాయి సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మిథున్ వివరించారు. 33 మీటర్ల లోతులో హుగ్లీ నది కింద మెట్రోస్టేషన్‌ను నిర్మిస్తున్నారు. సెక్టార్‌5 నుంచి హుగ్లీ నది గుండా హౌరా కు ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నీటిలో ఈ మెట్రో మొత్తం ప్రయాణ దూరం 16.6 కిలోమీటర్లు. కాగా..అండర్‌గ్రౌండ్‌లోనే 10.8 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందులో 520
మీటర్ల మేర నీళ్ల మధ్య నుంచి దూసుకెళ్తుంది. ఈ మెట్రోకు మొత్తం స్టేషన్లు 11 ఉంటాయి. అదే అండర్ గ్రౌండ్ లో రెండు స్టేషన్లు ఉండనున్నాయి.
కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ జంట సొరంగాలను కలుపుకోవడానికి హుగ్లీ నదిపై సుమారు 500 మీటర్ల వరకు విస్తరించి ఉన్న
తూర్పు-పశ్చిమ కారిడార్‌ను విస్తరించింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా..నీటి అడుగున మెట్రో రైలును KMRC నిర్మించనుంది. రైలు
మునిగినప్పుడు 10-అంతస్తుల నిర్మాణానికి సమానమైన లోతులో ప్రయాణిస్తుంది. 1.4 మీటర్ల డల్పు గల కాంక్రీట్ రింగులతో నిర్మించిన జంట
సొరంగాలు మెట్రో రైలులో నీటి అడుగున భాగాన నిర్మిస్తున్నారు.

సొరంగాల్లోకి నీరు రాకుండా..వాటికి హైడ్రోఫిలిక్ రబ్బరు పట్టీలు అమర్చుతున్నారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ. 8,600 కోట్లు ఖర్చు అంచనా వేశారు అధికారుల. మార్చి 2023 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ రైలు 520 మీటర్ల దూరాన్ని కేవలం 45 సెకండ్లలో చేరుకోనుండగా, భారతదేశపు ఈ మొదటి నీటి అడుగున సొరంగంలో ప్రయాణీకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఎస్ప్లానేడ్, సీల్దా మధ్య కారిడార్ 2.5 కిమీ పొడిగింపు పూర్తయిన తర్వాత డిసెంబర్-2023లో ప్రారంభించబడుతుంది. తూర్పు-పశ్చిమ కారిడార్‌కు సొరంగం అవసరమని, ముఖ్యమైనదని నిపుణులు అంటున్నారు.
నివాస ప్రాంతాలు, కొన్ని ఇతర సమస్యల కారణంగా, నదికి అడ్డంగా రహదారిని నిర్మిస్తున్నారు. టన్నెల్ ప్రాజెక్ట్ ల నిర్మాణం కోసం విదేశీ నిపుణుల
సహాయం తీసుకుంటున్నామని కేఎంఆర్సీ అధికారులు తెలిపారు.

జర్మనీకి చెందిన యంత్రాలు, ఉత్తమ నిపుణుల సహాయంతో సొరంగం నిర్మించే పనిని కోల్ కత్తా మెట్రో రైల్వే కార్పొరేషన్ చేపట్టింది.

ప్రస్తుతం సొరంగం లోపల పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయినట్లయితే, సుమారు లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా బిజీగా ఉండే ప్రాంతాలైన హౌరా, సీల్దా రైల్వే స్టేషన్లతో పాటు ఎస్ప్లానడే వద్ద కోల్ కత్తా మెట్రోకి చెందిన నార్త్ సౌత్మా ర్గాన్ని కలుపుతుంది. కోల్ కత్తా మెట్రో కి సంబంధించిన ఈస్ట్ వెస్ట్ కారిడార్ 15 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. ఇది సాల్ట్ లేక్ స్టేడియం నుంచి హౌరా వరకు విస్తరించి ఉంది. సాల్ట్ లేక్ సెక్టార్ -5 నుంచి సాల్ట్ లేక్ స్టేడియం మధ్య ఈ మెట్రో మార్గంలో కరుణమయి, సెంట్రల్ పార్క్, సిటీ సెంటర్, బెంగాల్ కెమికల్ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. కోల్‌కతా హుగ్లీ నది కింద ఇండియన్ ఫస్ట్ అండర్‌ వాటర్‌ మెట్రో రైలు నడుస్తుందని పేర్కొన్నారుపీయూష్. ఆ మేరకు తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా ఓ వీడియోను కూడా షేర్ చేశారు.

అది ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో. అద్భుతమైన ఇంజనీరింగ్‌ ప్రతిభకు అదొక ఉదాహరణగా నిలుస్తోంది. భారతదేశంలో రైల్వే పురోగతికి ఇది చిహ్నమని కొనియాడారు. అండర్ వాటర్మె ట్రో సర్వీస్ తో కోల్‌కతా ప్రజలు మరింత సౌకర్యవంతంగా ప్రయాణిస్తారని చెప్పుకొచ్చారు పీయూష్. ఇది దేశం గర్వపడే విషయం అని ఆయన ట్వీట్‌ చేశారు. మొదటి దశను ఈ నెలాఖరు నాటికి పూర్తిచేసి తొలి అండర్ వాటర్ మెట్రో రైలు సర్వీసును ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. సొరంగాల నిర్మాణం ఏప్రిల్ 2017 ఏప్రిల్ చివరలో ప్రారంభమయ్యాయి. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు అంతా సవ్యంగా జరిగితే అండర్వా టర్ మెట్రో రైలు కోల్‌కతా వాసులకు తొందర్లోనే అందుబాటులోకి వస్తుందన్నమాట.

నీటిలో మెట్రో ప్రయాణం .. అతి త్వరలోనే .. కోల్ కతా వాసులకు .. అందుబాటులోకి రానుంది.

Must Read

spot_img