ఆన్ లైన్ ప్రకటనలు తగ్గడంతో సోషల్ మీడియా కంపెనీలు కొత్త ఆదాయ మార్గాలను కనుగొనడానికి యూజర్లపై భారం మోపుతున్నాయి.. వినియోగదారులు పెరిగినప్పటికీ.. ట్విట్టర్ బాటలోనే ఫేస్ బుక్ కూడా వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం నగదు వసూలు చేయడం ప్రారంభించింది.
ట్విట్టర్ మాదిరిగానే ఫేస్ బుక్ కూడా తన యూజర్లపై భారం మోపేందుకు సిద్దమైందా..? త్వరలోనే వినియోగదారులు బ్లూ టిక్ సర్వీసుల కోసం ఫేస్ బుక్ కు నగదు చెల్లించాల్సి ఉంటుందా..? మార్క్ జుకర్ బర్గ్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ పేరుతో ఒక్కో యూజర్ కు నెలకు ఎంత వసూలు చేయనున్నారు..?
ట్విట్టర్ మాదిరిగానే ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా తన కస్టమర్ల కోసం వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ యజమాని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. త్వరలో వినియోగదారులు బ్లూ టిక్ సర్వీసుల కోసం ఫేస్‌బుక్‌కు నగదు చెల్లించాల్సి ఉంటుంది. మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ గురించి సమాచారాన్ని అందించారు. “ఈ వారం మేము మెటా వెరిఫైడ్‌ను ప్రారంభిస్తున్నాము, ఇది మీ ఖాతాను ప్రభుత్వ IDతో ధృవీకరించడానికి మిమ్మల్ని అనుమతించే సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఇది.” అని మార్క్ జుకర్‌బర్గ్ తన పోస్ట్‌లో రాశారు.
మార్క్ జుకర్‌బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పుడు వినియోగదారులు బ్లూ బ్యాడ్జ్ , బీన్ ఐస్‌తో నకిలీ ఖాతాల నుంచి రక్షణ, కస్టమర్ సపోర్ట్‌కు నేరుగా యాక్సెస్‌ను ఈ నగదు చెల్లించడం ద్వారా పొందగలుగుతారు. ఈ కొత్త ఫీచర్ ఫేస్‌బుక్ సర్వీసుల్లో అథెంటికేషన్ సెక్యూరిటీని పెంచడమేనని జుకర్ బర్గ్ తెలిపారు.. మెటా వెరిఫైడ్ కోసం వెబ్‌లో నెలకు 11.99 డాలర్లు, యాపిల్ ఐవోఎస్ సిస్టమ్‌లో నెలకు 14.99 డాలర్ల ప్రారంభ ధరను కలిగి ఉంటుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల పేరెంట్ కంపెనీ మెటా ఇటీవలే కొత్తగా 3డీ అవతార్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, మెసెంజర్‌లకు ఈ 3డీ అవతార్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫీడ్ పోస్టులు, స్టోరీలు, ప్రొఫైల్ పిక్చర్లుగా వీటిని ఉంచుకోవచ్చు. దీంతోపాటు కంపెనీ తన ప్లాట్‌ఫాంలకు అప్‌డేట్స్ కూడా అందించింది. మరిన్ని హావభావాలు, ఫేసెస్, స్కిన్ టోన్లతో మెటా అవతార్లను కంపెనీ అప్‌డేట్ చేసింది. దీంతోపాటు కంపెనీ డిజిటల్ క్లోతింగ్‌తో కూడా ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. ఇందులో ఎన్ఎఫ్ఎల్ టీ షర్టులు కూడా ఉన్నాయి. సూపర్ బౌల్ కోసం వాటిని వేసుకోవచ్చు.
క్వెస్ట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌ల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఇది అమెరికా, మెక్సికో, కెనడాల్లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఈ 3డీ అవతార్‌లను స్టోరీలు, డీఎంల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ అవతార్‌ల్లో వేర్వేరు ఫేషియల్ షేపులు, ఎక్స్‌టెన్సివ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకమైన ఫీచర్లను ఇందులో అందించారు. ఈ కొత్త అవతార్‌లు ప్రస్తుతం ఫేస్‌బుక్, మెసెంజర్‌ల్లో రోల్ అవుట్ అవుతున్నాయి. వినియోగదారులు అన్నిట్లో ఒకే అవతార్‌ను వాడుకోవచ్చు. లేదా ప్లాట్‌ఫాంను బట్టి వేర్వేరు అవతార్‌లను మార్చుకోవచ్చు. మెటావర్స్‌పై తమ దీర్ఘకాలిక ప్రణాళికలను తెలిపినప్పటి నుంచి, తాము సోషల్ టెక్నాలజీని తర్వాతి స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నామని అవతార్స్ అండ్ ఐడెంటిటీ జనరల్ మేనేజర్ అయిగెరిమ్ షోర్మెన్ తెలిపారు.
గత ఏడాది చివరలో ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారం అయిన ట్విట్టర్ బ్లూ టిక్ కోసం వినియోగదారుల నుండి నెలకు 8 డాలర్లు వసూలు చేయడం ప్రారంభించింది. ఇది బ్లూ చెక్ తో వారి ఖాతాను తనిఖీ చేస్తుంది. తాజాగా ట్విట్టర్ ఈ సర్వీసు విషయంలో మరో అడుగు ముందుకేసింది, ట్విట్టర్ వినియోగదారులు 8 డాలర్ల నెలవారీ ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ చెల్లించకపోతే టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తో తమ ఖాతాలను భద్రపరిచే సామర్థ్యాన్ని కోల్పోతారని ప్రకటించింది. ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్ ఫారంలు అయిన ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ కూడా ట్విట్టర్ బాటలో పయనించడానికి సిద్ధం అవుతున్నాయి. ట్విట్టర్ మాదిరిగా ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ కూడా వెరిఫైడ్ ఖాతా కోసం కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.. ఈ విషయాన్ని స్వయంగా మెటా సీఈఓ అయిన మార్క్ జుకర్ బర్గ్ ఆదివారం తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించారు..
ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ఈ వారంలో పరీక్షలు ప్రారంభమవుతాయని, త్వరలోనే ఇతర దేశాలకు విస్తరిస్తామని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. వినియోగదారుల ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ఖా తాను ధృవీకరించడానికి, అలాగే బ్లూ బ్యాడ్జ్ ను మంజూరు చేయడానికి కంప్యూటర్లలో ఖాతాలను వినియోగించే వారికి నెలకు 11.99 డాలర్లు, అలాగే ఆపిల్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కలిగిన మొబైల్ వినియోదారుల నుంచి నెలకు 14.99 డాలర్లను వసూలు చేయాలని కంపెనీ భావిస్తోంది.. మెటాకి చెందిన బ్లూ బ్యాడ్జీలను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు, అలాగే సంస్థలకు మాత్రమే ఇవ్వనున్నారు. బ్లూ బ్యాడ్జీ కలిగిన వినియోగదారులకు ప్రత్యేక కస్టమర్ కేర్ సపోర్ట్ తో పాటు అదనపు భద్రతను కల్పించనున్నట్లు మెటా తెలిపింది. ఈ కొత్త ఫీచర్ తమ సర్వీసుల్లో ప్రామాణికత, భద్రతను పెంచుతుందని జుకర్ బర్గ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పేర్కొన్నారు.
గతంలో ధృవీకరించిన ప్రజాప్రతినిధులు, ఇతరులపై ఈ మార్పు ప్రభావం ఉండదని మెటా తెలిపింది. మెటా వెరిఫైడ్ అనేది ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియాను ఉపయోగించి తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని భావించే వారిని లక్ష్యంగా చేసుకుంది. గత ఏడాది చివరలో ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారం అయిన ట్విట్టర్ బ్లూ టిక్ కోసం వినియోగదారుల నుండి నెలకు 8 డాలర్లు వసూలు చేయడం ప్రారంభించింది. ఇది బ్లూ చెక్ తో వారి ఖాతాను తనిఖీ చేస్తుంది. తాజాగా ట్విట్టర్ ఈ సర్వీసు విషయంలో మరో అడుగు ముందుకేసింది, ట్విట్టర్ వినియోగదారులు 8 డాలర్ల నెలవారీ ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్
చెల్లించకపోతే టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తో తమ ఖాతాలను భద్రపరిచే సామర్థ్యాన్ని కోల్పోతారని ప్రకటించింది. ఆన్ లైన్ ప్రకటనలు తగ్గడంతో సోషల్ మీడియా కంపెనీలు కొత్త ఆదాయ మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి. వినియోగదారులు పెరిగినప్పటికీ వరుసగా మూడవ త్రైమాసికంలో కూడా కంపెనీ ఆదాయం క్షీణించిందని కంపెనీ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది.
ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్ ల కోసం త్వరలో కొత్త ఫీచర్లు కూడా తీసుకురానున్నారు. స్కామ్‌లు, స్పామ్‌లను ఎదుర్కోవడానికి వారి ట్వీట్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం, వెరిఫై కాని వ్యక్తుల కంటే 50 శాతం తక్కువ యాడ్స్ చూడటం, ట్విట్టర్‌లో పొడవైన వీడియోలను పోస్ట్ చేసే ఆప్షన్ వంటి ఫీచర్లు త్వరలో రానున్నాయి. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు ‘ఎడిట్ ట్వీట్’ ఆప్షన్ పొందుతారని, వారి పబ్లిష్ చేసిన ట్వీట్‌లను ఎడిట్ చేసే వీలు కల్పిస్తుందని ట్విట్టర్ ప్రకటించింది. అలాగే, ట్విట్టర్ బ్లూ వినియోగదారులు 1080p వీడియో అప్‌లోడ్‌లు, రీడర్ మోడ్ వంటి ఫీచర్లను పొందుతారు.
ట్విట్టర్ బిజినెస్ఆ ర్గనైజేషన్స్ కోసం “అధికారిక” లేబుల్‌ని గోల్డ్ చెక్ మార్క్‌ను అందించడం ప్రారంభిస్తుంది. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ అధికారిక ప్రభుత్వ, మల్టీలాటెరల్ అకౌంట్స్ బూడిద రంగు టిక్ మార్క్‌ను పొందనున్నాయి. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు తమ హ్యాండిల్, డిస్‌ప్లే పేరు లేదా ప్రొఫైల్ ఫోటోను మార్చవచ్చు. అయినప్పటికీ వారు అలా చేస్తే తమ ఖాతాను మళ్లీ సమీక్షించే వరకు వారు తమ బ్లూ చెక్మా ర్క్‌ను తాత్కాలికంగా కోల్పోతారు. ట్విట్టర్ మాదిరిగానే ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా తన కస్టమర్ల కోసం వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లు తమ వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.. నిన్నమొన్నటి వరకు ఎలాంటి ఛార్జీలు ఉండేవి కాదు.
కానీ.. ట్విట్టర్ ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టిన తర్వాత తాజాగా ఫేస్ బుక్ అదే బాటలో నడుస్తోంది..