బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామాగా మెగా పవర్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఆర్సీ15. దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్న ఈసినిమా షూటింగ్ డిలే అవుతుంది. అయితే ఇందుకు కారణం మాత్రం హీరోయిన్ అనే చెప్పుకుంటారు మేకర్స్.
పాన్ ఇండియా దర్శకుడు శంకర్ రాంచరణ్ 15వ సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని తపిస్తున్నాడు.ఈ సినిమా తో శంకర్ సమాజంలో జరిగే సీరియస్ పాయింట్ ను టచ్ చేస్తున్నాడట.అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరో వైపు కమల్ హాసన్ తో భారతీయుడు సినిమా చేస్తూ ఈ సినిమా కూడా శంకర్ పూర్తి చేస్తామని శంకర్.
ఇప్పటికే ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి అయింది. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.. ఈ సినిమా ద్వారా శంకర్ ఒక ప్రజలకు పొలిటికల్ గా మంచి మెసేజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో అవినీతి గురించి తన సినిమా లలో చర్చించారు శంకర్.
ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి.. మన ఓటు అమ్ముకుంటే.. మన పిల్లల బంగారు జీవితాలను అమ్ముకున్నట్టే అనే లైన్ తీసుకొని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో చెప్పబోతున్నాడు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ కియార అద్వాని డేట్స్ లేవని ప్రచారం జరుగుతోంది. గతంలో ఇచ్చిన డేట్స్ మొత్తం ఉపయోగ పడకుండా అయ్యాయట.
అందుకే మరొసారి ఆమెను డేట్స్ అడగాలని నిర్ణయించు కున్నారట. కాని ఆమె మాత్రం ఒక నెల రోజులు తర్వాత చూద్దామని చెప్పిందట. దానితో రామ్ చరణ్ అమెరికాకి, శంకర్ భారతీయుడు షూటింగ్ కు వెళ్లి పోయారట. దిల్ రాజు ఎప్పటిలాగే వారసుడు గొడవల్లో తల మునకలు గా ఉన్నాడు.