అమెరికాకు చెందిన రహస్య పత్రాలను గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ తన ప్రైవేట్ ఎస్టేట్ అయిన మార్-ఎ-లాగోకు తరలించిన ఘటన ఆ దేశాన్ని కుదిపేసింది.. ఆ ఘటన మరవక ముందే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాత కార్యాలయంలో పలు రహస్య పత్రాలు ఉన్నట్లు గుర్తించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
అమెరికాలో అధికారంలో ఉన్న వ్యక్తులు పదవులు దిగిపోయే సమంలో రహస్య పత్రాలను తిరిగి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.. అయినప్పటికీ.. గతంలో ట్రంప్ ఎందుకు తిరిగి అప్పగించలేదు.. తాజాగా జో బైడెన్ పాత కార్యాలయంలో అమెరికా రహస్య పత్రాలు ఎందుకు భద్రపరచాల్సి వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

అమెరికా రహస్య పత్రాలను మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన ప్రైవేటు ఎస్టేట్ అయిన మార్-ఎ-లాగోకు తరలించిన ఘటన ఆ దేశాన్ని కుదిపేసింది. తాజాగా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ గతంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఉపయోగించిన కార్యాలయంలో అత్యంత రహస్య పత్రాలను గుర్తించడం సంచలనం సృష్టించింది.
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జోబైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.. అప్పట్లో ఆయన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంతో సంబంధాల కోసం ‘ది పెన్న్ బైడెన్ సెంటర్ ఫర్ డిప్లొమసి అండ్ గ్లోబల్ ఎంగేజ్‌మెంట్’ కార్యాలయాన్ని ఉపయోగించేవారు.. 2017-19మధ్యలో అక్కడ బైడెన్ గౌరవ ప్రొఫెసర్ గా పనిచేశారు.
దేశాధ్యక్షుడి అటార్ని జనరల్ గార్లాండ్ నవంబర్‌లో కొన్ని రహస్య పత్రాలను పెన్న్ బైడెన్ సెంటర్‌లో గుర్తించారు. దాదాపు డజను కంటే తక్కువ పత్రాలు అక్కడ ఉన్నట్లు కనుగొన్నారు. అసలు అవి అక్కడికి ఎలా చేరాయి.. వాటిని ఎందుకు వాడుకొన్నారన్న విషయం తెలియలేదు.
అధికారంలో ఉన్న వారు పదవులు దిగిపోయే సమయంలో రహస్య పత్రాలను తిరిగి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ, వీటిని ఎందుకు ఇవ్వలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై బైడెన్ స్పెషల్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్న రిచర్డ్ సౌబర్ స్పందించారు. ”రహస్య పత్రాలు దొరికిన వ్యవహారంపై ఆర్కైవ్స్ విభాగం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌కు శ్వేత సౌధం పూర్తిగా సహకరిస్తోంది.
అధ్యక్షుడి అటర్నీజనరల్ ‘ది పెన్న్ బైడెన్ సెంటర్’లోని ఒక అరలో పత్రాలను సర్దుతున్న సమయంలో ఇవి బయటపడ్డాయి. 2017 నుంచి 2020లో ఎన్నికల ప్రచారం మొదలయ్యే వరకు బైడెన్ ఆ కార్యాలయాన్ని వాడుకొన్నారు. ఈ పత్రాలు దొరికిన వెంటనే నేషనల్ ఆర్కైవ్స్‌కు శ్వేతసౌధం అధికారులు సమాచారం అందించారు. మర్నాడే వాటిని ఆర్కైవ్స్ విభాగానికి అప్పగించారు” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని షికాగో అటార్నీ జనరల్ జాన్ లాష్ జూనియర్ దర్యాప్తు చేస్తున్నారు. ఆయన్ను ట్రంప్ హాయంలో 2017లో నియమించారు. అప్పట్లో ఈయన నియామకాన్ని సెనెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2021లో ఇద్దరు డెమొక్రాట్లు లాష్ ను ఆ పదవిలో కొనసాగించాలని కోరారు. సున్నితమైన దర్యాప్తులకు ఆయన సేవలు అవసరమని పేర్కొన్నారు.
‘ది పెన్న్ బైడెన్ సెంటర్’లో దొరికిన పత్రాలు అత్యంత రహస్యమైన ‘సెన్సిటివ్ కంపార్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్’ కేటగిరికి చెందినవిగా గుర్తించారు. ఇంటెలిజెన్స్ విభాగాల నుంచి సేకరించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఈ కేటగిరిలో చేరుస్తారు.
మరోవైపు బైడెన్ వర్గీయులు మాత్రం తమ వ్యవహారాన్ని ట్రంప్ మార్-ఎ-లాగో ఎస్టేట్ వ్యవహారంతో పోల్చకూడదని పేర్కొన్నారు. తమ కంటపడిన రహస్య పత్రాలను ప్రభుత్వానికి అప్పగించామని వాదిస్తున్నారు. అదేట్రంప్ ఎస్టేట్‌పై ఎఫ్‌బీఐ రైడ్ చేసి 325 పత్రాలను స్వాధీనం చేసుకొందని చెబుతున్నారు.
- అమెరికా అధ్యక్షుని వ్యవహరించిన సమయంలో డోనాల్డ్ ట్రంప్ చేసిన నిర్వాకాలు క్రమంగా బయటపడుతున్నాయి.
క్యాపిటల్ హిల్స్‌పై దాడి కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న ట్రంప్‌పై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ -ఎఫ్‌బీఐ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఇటీవల ఎఫ్‌బీఐ అధికారులు ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న ట్రంప్ నివాసం మార్-ఎ-లాగో భవనంలో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆ ఇంటిలో దేశానికి చెందిన కీలక పత్రాలు దొరికాయి.

ఇవన్నీ అక్కడి వార్తా పత్రికలు, మ్యాగజైన్లలో దాచి పెట్టారని ఎఫ్‌బీఐ తన అఫిడవిట్ లో తెలిపింది. 15 బాక్సుల్లో ఈ పత్రాలు దొరికాయి. ఇందులో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు ఉన్నట్లు గుర్తించారు.. ఈ పత్రాలన్నీ ట్రంప్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఇక్కడికి తరలించాని భావిస్తున్నారు. కాగా ట్రంప్ వైట్‌హౌస్ ఖాళీ చేసే సమయంలో హడావుడిగా తీసుకొచ్చిన పత్రాల్లో ఇవన్నీ ఉన్నాయని ట్రంప్ కొడుకు చెప్పాడు.. ఈ పత్రాలను ట్రంప్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉన్నా, ఎందుకు ఇవ్వలేదని ఎఫ్‌బీఐ అధికారులు ప్రశ్నించారు..
ఫ్లోరిడాలోని తన నివాసంపై ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు చేపట్టినప్పుడు బైడెన్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్.. వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేయకుండా అడ్డుకునేందుకే డెమోక్రాట్లు ఈ కుట్రలు పన్నారని ఆరోపించారు. ఇదంతా రాజకీయ కక్షసాధింపని ఆరోపించారు.
గతంతో ఏ మాజీ అధ్యక్షుని నివాసంతో తనిఖీలు జరగలేదని, తన ఇంటిలో జరపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు ట్రంప్.. అమెరికాలో మిట్‌టర్మ్ ఎన్నికల సమయంలో ఈ తనిఖీలు రాజకీయాంశంగా మారిపోయాయి.
తాజాగా బైడెన్ పాత కార్యాలయంలో రహస్య పత్రాల విషయం వెలుగులోకి రావడంతో బైడెన్ పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. హౌస్ ఓవర్‌సైట్ ఛైర్మన్ జేమ్స్ కోమర్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ..”ట్రంప్ రహస్య పత్రాలను తీసుకెళ్లినప్పుడు బైడెన్ చాలా విమర్శలు చేశారు. ఎంత ఆశ్చర్యం.. ఇప్పుడు బైడెన్ కూడా అదే చేసినట్లు కనిపిస్తోంది” అని ఎద్దేవా చేశారు.
గతేడాది జనవరిలో ఎఫ్‌బీఐ అధికారులు మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో సోదాలు చేపట్టగా 15 పెట్టెల్లో ప్రభుత్వ పత్రాలు లభించాయి. మార్-ఎ-లాగో ఎస్టేట్‌ను ట్రంప్, ఆయన సిబ్బంది, కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా ఇతరులూ ఉపయోగిస్తుంటారు. ఇక్కడ వివాహాలతో పాటు రాజకీయ, సామాజిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశానికి చెందిన కొన్ని రహస్య ప్రతాలను ఇక్కడకు తరలించారని ఎఫ్‌బీఐకి సమాచారం లభించడంతో దాడులు చేశారు. ఈ పెట్టెల్లో67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది.
గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన ట్రంప్ అమెరికా రహస్య పత్రాలను ట్రంప్ తన ప్రైవేటు ఎస్టేట్ అయిన మార్-ఎ-లాగోకు తరలించిన ఘటన మరవకముందే.. బైడెన్ పాత కార్యాలయంలో సైతం పలు రహస్య పత్రాలు బయటపడటం వంటి ఘటనలను చూసిన విశ్లేషకులు అమెరికా అధ్యక్షులు అందరూ.. అందరే అని.. విమర్శలు చేస్తున్నారు..