Homeసినిమా కమల్ హాసన్‌ సినిమాకు మణిరత్నం భారీ స్కెచ్‌..!

 కమల్ హాసన్‌ సినిమాకు మణిరత్నం భారీ స్కెచ్‌..!

లోక నాయకుడు కమల్ హాసన్.. విక్రమ్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. కమల్ 234వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

విక్రమ్‌ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌ మీదున్నాడు టాలెంటెడ్‌ స్టార్‌ యాక్టర్‌ కమల్ హాసన్‌. స్టార్ డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో 234వ సినిమాకు కమల్ హాసన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు‌. ఈ చిత్రానికి కమల్ హాసన్ సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. 1987లో వచ్చిన గ్యాంగ్ స్టర్‌ డ్రామా నాయగన్‌ తర్వాత ఈ ఇద్దరి కాంబో మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట మణిరత్నం.

ఈ సినిమా కోసం మణిరత్నం దక్షిణాది సినీ పరిశ్రమలోని పాన్ ఇండియా యాక్టర్లతోపాటు…బాలీవుడ్ యాక్టర్లను ఎంపిక చేసేందుకు స్కెచ్ వేశాడన్న వార్త ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్‌లో నటించనుండగా.. మమ్ముట్టి, షారుఖ్‌ ఖాన్‌తోపాటు పాపులర్‌ స్టార్ హీరోలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట. అయితే దీనికి సంబంధించిన మణిరత్నం కాంపౌండ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ కంపోజర్‌గా పనిచేస్తున్నాడు. మణిరత్నం హోంబ్యానర్‌ మద్రాస్‌ టాకీస్‌, కమల్ హాసన్‌ హోంబ్యానర్‌ రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్‌ బ్యానర్ రెడ్‌ జియాంట్‌ మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. ఇండియన్ 2 షూటింగ్ దశలో ఉంది.

Must Read

spot_img