Homeఅంతర్జాతీయం3డీ ప్రింటర్​తో రాకెట్ తయారీ.. ఎగిరిన కాసేపటికే బ్లాస్ట్

3డీ ప్రింటర్​తో రాకెట్ తయారీ.. ఎగిరిన కాసేపటికే బ్లాస్ట్

3డీ ప్రింటర్​తో రాకెట్ తయారీ.. ఎగిరిన కాసేపటికే బ్లాస్ట్ అయింది. రాకెట్ విడిభాగాలను 3డీ సాంకేతికతో తయారుచేసింది రిలేటివిటి అనే అమెరికా అంకుర సంస్థ. ఇలా 3డీ సాంకేతికతతో రాకెట్ విడిభాగాలను తయారు చేయడం ఇదే మొదటిసారి. టెర్రాన్‌-1 అనే రాకెట్​ను కేప్ కెనావరల్​ కేంద్రం నుంచి ప్రయోగించింది రిలేటివిటి.​ అయితే ఈ రాకెట్ ఫెయిలైంది. కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కడా అతుకు లేకుండా 85 శాతం 3డీ టెక్నాలజీతో రూపొందించిన రాకెట్ ప్రయోగం పాక్షికంగా విజయం సాధించింది. టెర్రాన్ వన్ అనే ఈ రాకెట్ ను కేప్ కానర్వాల్ రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించింది రిలేటివిటీ అనే స్టార్టప్ కంపెనీ. అయితే రాకెట్ ప్రయోగం అర్ధాంతరంగా విఫలమైంది. అమెరికా స్టార్టప్ కంపెనీ రిలేటివిటీ రాకెట్ల తయారీలో కొత్త అధ్యాయానికి అంకురార్పణ చేసింది. రాకెట్ విడిభాగాలను 3డీ టెక్నాలజీతో తయారుచేసింది. పూర్తిగా 3డీ ప్రింటర్లపై విడిభాగాలు తయారుచేసింది. ఇలా తయారుచేయం ఇదే తొలిసారని ఆ సంస్థ చెబుతోంది. కేప్ కెనర్వాల్ కేంద్రం నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించింది. ఏ ఉపగ్రహాలు లేకుండా కేవలం రాకెట్ ను మాత్రమే ప్రయోగించడం జరిగింది. అయితే రెండో దశలో ఇంజన్ షట్ డౌన్ అవడంతో కక్షలోకి చేరుకోలేకపోయింది.

రాకెట్ పైభాగంలో మంటలు చెలరేగాయనీ అనుకున్న లక్ష్యం పూర్తి కాకుండానే రాకెట్ అట్లాంటిక్ సముద్రంలో కుప్పకూలిపోయింది. మొదటి దశప్రయోగాలు ఎప్పుడూ ఇదమిద్దంగానే ఉంటాయనీ, వైఫల్యాలనే చూడాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఈ 3డీ రాకెట్ ప్రయోగం పెట్టబడిదారులను వెంచర్ క్యాపిటలిస్టులను బాగా ఆకర్షించింది. కాలిఫోర్నియాలోని తమ ప్రాంగణంలో రాకెట్ విడిభాగాలతో పాటు ఇంజిన్ ను 3డీ ప్రింటర్ల సాయంతో తయారుచేసినట్టు రిలేటివిటీ సంస్థ తెలిపింది. అంతే కాకుండా రాకెట్ లోని విడిభాగాలను మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలవుతుందని తెలిపింది. ఇతర సంస్థలు 3డీ సాంకేతికతపై ఆధారపడతాయనీ కానీ అది తక్కువ శాతమేనని సంస్థ వెల్లడించింది.

సంప్రదాయ విధానంతో పోలిస్తే తమ టెక్నాలజీతో రాకెట్లను వేగంగా తయారుచేయవచ్చని తెలిపింది. కేవలం 60 రోజుల్లోనే రాకెట్ ను తయారుచేయడం తమ లక్ష్యమని రిలేటివిటీ తెలిపింది. కాగా 2015లో ఇద్దరు యువ ఎయిరో స్పేస్ ఇంజనీర్లు రిలేటివిటీ సంస్థను స్థాపించారు. ఈ స్టార్టప్ సంస్థ రాకెట్ల తయారీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాకెట్ విడిభాగాలను 3డీ సాంకేతికతో తయారుచేయడంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఇలా తయారుచేయడం ఇదే తొలిసారని సంస్థ చెబుతోంది. కూలిపోయిన రాకెట్ అవశేషాలను సేకరించి వాటిని పరిశోధించడం ద్వారా ఎక్కడ తమ ప్రయోగంలో లోపం తలెత్తిందో తెలుసుకుంటామని సంస్త ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఏ కొత్త ఆవిశ్కరణానికైనా మొదట వైఫల్యాలు తప్పవని సంస్థ నమ్ముతోంది.

ఇదిలా ఉండగా అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ తిరుగులేని శక్తిగా అవతరించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. యూకే కంపెనీ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ‘షార్‌’లోని రెండో ల్యాంచ్‌పాడ్‌ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు ఎల్‌వీఎం-3 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. 20 నిమిషాలపాటు ప్రయాణించి భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం పూర్తయ్యేదాకా శాస్త్రవేత్తలు ఉత్కంఠగా ఎదురుచూసారు. శాటిలైట్స్ అన్నింటినీ కక్షలోకి వదలిపెట్టగానే ప్రయోగం విజయవంతం అయిందని ప్రకటించారు.

దాంతో ఇస్రో సెంటర్ లో హర్షధ్వానాలు ప్రతిధ్వనించాయి. మీకు తెలుసా ఈ ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో పూర్తి వాణిజ్యపరంగా జరిపింది. వీటిని సురక్షితంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టినందుకు 1000 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ శాస్త్రవేత్తలను అభినందించారు. మార్క్‌-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశామన్నారు. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో ముందంజలో ఉందని చెప్పారు. జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 రాకెట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ సంవత్సరం ఇస్రో నుంచి అనేక రకాలైన రాకెట్ ప్రయోగాలు జరగనున్నాయి. అందులో చంద్రుడిపై ప్రయోగాల కోసం చంద్రయాన్, సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య ప్రయోగాలు జరగనున్నాయి. మానవసహిత రాకెట్ ప్రయోగానికి కూడా రంగం సిధ్దమౌతోంది.

Must Read

spot_img