మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ రాజమౌళి దర్శకత్వంలో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు రాజమౌళి. తన తదుపరి సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని మహేష్ బాబు ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఒక వైపు మహేష్ బాబు తన ప్రస్తుత చిత్రం ను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. మరో వైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా యొక్క ఆస్కార్ ప్రమోషన్ లతో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో అమెరికా తో పాటు ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో మహేష్ బాబు సినిమాకు సంబంధించిన కథ విషయంలో రాజమౌళి ఎంత వరకు శ్రద్ధ పెట్టారు.. ఎంత వరకు కథ వచ్చింది అనే విషయంలో క్లారిటీ లేకుండా ఉంది. విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమా కోసం కథ రెడీ చేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెల్సిందే. మహేష్ బాబు మరియు రాజమౌళి సినిమా నిమిత్తం జోనర్ అయితే ఫిక్స్ అయ్యారు కానీ ఇప్పటి వరకు స్టోరీ లైన్ మాత్రం రెడీ అయినట్లు లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
స్టోరీ లైన్ ఫైనల్ అయితే విజయేంద్ర ప్రసాద్ తో పాటు రాజమౌళి ఇతర కుటుంబ సభ్యులు స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతారు.రాజమౌళి కి మహేష్ బాబు తో ఎలాంటి సినిమా చేయాలి అనే విషయంలో ఒక విజన్ ఉందట. ఆ విజన్ కు తగ్గట్లుగా స్టోరీ లైన్ ను రెడీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థం లో స్క్రిప్ట్ వర్క్ ను ముగించే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ వచ్చే ఏడాది లో జరిగే అవకాశాలు ఉన్నాయి.