Homeసినిమాగాసిప్స్SSMB28 కథను మార్చేసిన గురూజీ

SSMB28 కథను మార్చేసిన గురూజీ

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందాల్సిన సినిమాకి ఇంకా బాలారిష్టాలు తొలిగేట్లు కనిపించడం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు 28వ సినిమా రూపొందాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల మీద చినబాబు, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి, ఆ విషయం మీద నిర్మాత నాగవంశీ కూడా అధికారిక ప్రకటన చేశారు. ఇలాంటి టైమ్ లో త్రివిక్రమ్ కథను మార్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఖలేజా’ వంటి యాక్షన్ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో గురూజీ ఓ భారీ మూవీకి రీసెంట్ గా శ్రీకారం చుట్టారు. దాదాపు పుష్కర కాలం తరువాత ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తుండటంతో మహేష్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ ని చాలా ప్రత్యేకంగా వుంటుందని భావించారు. మళ్లీ అతడు ఖలేజాలకు మించిన పాన్ ఇండియా మూవీగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో రానుందని భావించారు. ఆనందంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీని పట్టాలెక్కిస్తారా? ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారా? అని ఆశగా ఎదురుచూడటం మొదలు పెట్టారు.

వారి ఎదురు చూపులకు తెరదించుతూ సెప్టెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ ని మొదలు పెట్టారు. అన్బు అరివుల నేతృత్వంలో షూటింగ్ మొదలు పెట్టారు. ఆ తరువాత మూడు రోజుల తరువాత రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ చేశారు. అక్కడ కీలక ఘట్టాలతో తొలి షెడ్యూల్ ని పూర్తి చేశారు.

కట్ చేస్తే.. మహేష్ మదర్ చనిపోవడం.. ఆ సంఘటన నుంచి తేరుకునేలోపే సూపర్ స్టార్ కృష్ఱ మృతిచెందడం.. ఆ తరువాత కథలో మళ్లీ మార్పులు జోటు చేసుకోవడం వంటి కారణాలతో ఏకంగా ఈ మూవీ స్టోరీనే మొత్తంగా మారిపోయింది. ముందు నుంచి మహేష్ ..త్రివిక్రమ్ చెప్పిన కథపై సుముఖతని వ్యక్తం చేయకపోవడం వల్లే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తరువాత కథని మార్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే కొత్త కథతో మళ్లీ ఫ్రెష్ గా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఇందు కోసం తమన్ నేతృత్వంలో మరోసారి మారిన కథకు అనుగుణంగా మ్యూజిక్ సిట్టింగ్స్ ని దుబాయ్ లో జరుపుతున్నారు. మహేష్ తమన్ త్రివిక్రమ్ తో పాటు ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో సూర్యదేవర నాగవంశి కూడా పాల్గొంటున్నాడని తెలిసింది.

ఇదిలా వుంటే మహేష్ ఫ్యాన్స్ గురూజీపై గుర్రుగా వున్నారట. గత కొంత కాలంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా స్క్రిప్ట్ లపై త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నాడని మండి పడుతున్నారట. ఆ కారణంగా మహేష్ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పక్కన పెట్టి త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ కోసం ‘భీమ్లానాయక్’ కు స్క్రీన్ ప్లే మాటలు అందించడంతో పాటు స్టోరీ లో కీలక మార్పులు చేయడం తెలిసిందే.

దీంతో పవన్ సినిమాపై చూపిస్తున్న శ్రద్ద మహేష్ సినిమా కు చూపించడం లేదని మహేష్ ఫ్యాన్స్ గురూజీపై మండిపడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Must Read

spot_img