Homeఅంతర్జాతీయంలాంగ్ కోవిడ్ వస్తే దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యలు ఇవే !

లాంగ్ కోవిడ్ వస్తే దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యలు ఇవే !

గతంలో లాంగ్ కోవిడ్ గురించి ప్రస్తావనలున్నాయి. కానీ ఇప్పుడు వాటిపై జరిగిన పరిశోధనల ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాల కోవిడ్ సోకిన రోగుల్లో 59 శాతం మందికి చాలా కాలం తరువాత ఏదో అవయవ సమస్య ఎదురవుతోంది. కొన్నిసార్లు సదరు లోపం కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దాంతో లాంగ్ కోవిడ్ గురించిన చర్చ మరోసారి ఉద్రుతమవుతోంది.

దీర్ఘకాల కొవిడ్‌ లేదా లాంగ్‌ కొవిడ్‌ సోకిన రోగుల్లో 59 శాతం మందికి తమకా వ్యాధి సోకినట్టు తెలియడం లేదు. మామూలు కరోనా వైరస్ సోకి వెళ్లిపోయిందనే ఇన్నాళ్లుగా భావిస్తున్నారు. అయితే వైరస్‌ లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత శరీరంలోని ఏదో ఒక అవయవానికి సమస్య తలెత్తుతోందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే అలాంటి వాటికి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్యనిపుణులు కొట్టిపడేశారు. కొవిడ్‌ బారిన పడ్డ తొలిరోజుల్లో పెద్దగా ఇబ్బందులు పడని వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోందని లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన విశ్వవిద్యాలయం యూసీఎల్‌ వెల్లడించింది. శ్వాస తీసుకోవటంలో కష్టపడిన, ఆరోగ్యరీత్యా ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొన్న 536 మంది దీర్ఘకాల కొవిడ్‌ రోగులను యూసీఎల్‌ పరిశోధనలో భాగం చేసింది. వీరిలో 13 శాతం మంది కొవిడ్‌ కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

కాగా, 32శాతం మంది ఆరోగ్య సిబ్బంది కూడా ఈ గ్రూపులో ఉన్నారు. లాంగ్ కొవిడ్‌ తీరు వైద్య పరిశోధకులకు సవాలు విసురుతోంది. దీన్ని నిర్వచిద్దామంటే… లక్షణాలు, రక్త పరీక్షలు, ఎంఆర్‌ఐల ద్వారా కూడా దీర్ఘకాల కొవిడ్‌లోని వేరియంట్ ఆనవాళ్లు పట్టుకోలేకపోతున్నారు. అందుకే భవిష్యత్‌లో జరిగే పరిశోధనల్లో… లక్షణాలు, అవయవాలు దెబ్బతినటం మధ్య సంబంధాన్ని గమనించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాయల్‌ సొసైటీ ఆఫ్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించిన యూసీఎల్‌ పరిశోధన ప్రకారం…536 మంది రోగుల్లో 331 మంది అంటే 62శాతం మందికి ఇది బయటపడింది. కొవిడ్‌ బయటపడ్డ ఆరునెలల తర్వాత ఏదో ఒక అవయవం దెబ్బతిన్నదని గుర్తించడం జరిగింది..మిగిలిన 29 శాతం మంది రోగుల్లో దీర్ఘకాల కొవిడ్‌ కారణంగా ఒకటికంటే ఎక్కువ అవయవాలకు నష్టం వాటిల్లింది.

ఆరు నుంచి ఏడాదిలోపు వీరికి ఆయా అవయవాల సమస్య లక్షణాలు బయటపడుతూ, వాటి పనితీరు క్షీణించటం గమనించారు. 59 శాతం రోగుల్లో వైరస్‌ బారినపడ్డ ఏడాది తర్వాత ఏదో ఒక అవయవం దెబ్బతింటోంది. చాలామందిలో వారు ఉపయోగించే లైఫ్ స్టైల్ పనితీరు ప్రభావితం అవుతోంది. పరిశోధనలో పాల్గొన్న అనేకమంది ఆరోగ్య సిబ్బందిలో అంతకుముందు ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా 172 మందిలో తర్వాత సమస్యలు తలెత్తాయి. అయితే లాంగ్ కొవిడ్‌ బాధితుల్లో ఏడాది వరకూ లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి ఐదుగురిలో ముగ్గురికి కనీసం ఏదో ఒక అవయవం దెబ్బతింటోందని తేలింది. ప్రతి నలుగురిలో ఒకరికి ఒకటి లేదా రెండు అవయవాలకు నష్టం వాటిల్లుతోంది. కొన్ని కేసుల్లోనైతే ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా ఇది సంభవిస్తోంది.

అందుకే…లైఫ్ స్టైల్ పై దీర్ఘకాలంలో ఆరోగ్యంపై దీర్ఘకాల కొవిడ్‌ ప్రభావం చూపుతోందని తేలిపోయింది. కొందరిలో గుండెపోటుకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఎప్పుడో కోవిడ్ వచ్చిన వారికి చాలా కాలం తరువాత మ్యాసివ్ హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు పెద్దాయన జో బైడెన్ కూడా దీర్ఘకాల కోవిడ్ బారిన పడ్డట్టు వార్తలు వచ్చాయి. గత సంవత్సరం కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న బైడెన్ ఛాతీ నుంచి ఇప్పుడు ఓ చిన్న కణతిని తొలగించినట్టు వైద్యులు తెలిపారు. దాంతో, దీర్ఘకాల కోవిడ్ లక్షణాల నుంచి ఆయన విముక్తి పొందారన్నారు. శారీరక పరీక్ష తర్వాత జోబైడెన్ ఆరోగ్యంగా ఉన్నారని, విధి నిర్వహణకు ఫిట్ గా ఉన్నారని వైద్యులు తెలిపారు.

‘మా అధ్యక్షుడు ఫిట్ గా ఉన్నారు. తన బాధ్యతలన్నింటినీ పూర్తిగా నిర్వర్తిస్తారు’ అని వైట్ హౌస్ వైద్యుడు కెవిన్ ఓ కానర్ బైడెన్ ఆరోగ్య పరీక్ష రిపోర్టులో స్పష్టం చేశారు. మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లోని వైద్యులు బైడెన్ కు మూడు గంటలపాటు వివిధ పరీక్షలు నిర్వహించారు. బైడెన్ 2024లో రెండోసారి అధ్యక్ష పదవికి సిద్ధమవుతున్నందున ఆయన ఆరోగ్య పరీక్షలపై ఆసక్తి నెలకొంది. బైడెన్ కు కోవిడ్ దీర్ఘకాలిక లక్షణాలు లేవని తేలింది. ఇక తన ఆరోగ్యం బాగానే ఉందని, పరీక్షలు సాఫీగా సాగాయని బైడెన్ తెలిపారు. అయితే, అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన అతి పెద్ద వయస్కుడైన బైడెన్ తనకు వయోభార సమస్యలు లేవన్నారు. 2024లో మరోసారి గెలిస్తే మరో నాలుగు సంవత్సరాలు దేశానికి సేవ చేయగలిగే శారీరక సామర్థ్యం బైడెన్ కు ఉందా? అనే అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని పలు పోల్స్ తెలిపాయి.

Must Read

spot_img