Homeఅంతర్జాతీయంఉద్యోగులను కలవరపెడుతున్న లే ఆఫ్..!

ఉద్యోగులను కలవరపెడుతున్న లే ఆఫ్..!

ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్ ల ట్రెండ్ నడుస్తోంది.. దిగ్గజ కంపెనీల నుంచి మొదలు అన్ని కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించి.. కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి.. అయితే.. ఉద్యోగం కోల్పోయిన వారిలో అందరు ఒకేలాగా ఆలోచించడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి.. కొందరైతే.. ఏకంగా జాబ్ పోవడంతో రిలాక్స్ అవుతున్నారట.. అప్పటి వరకు ఎంతో కంఫర్ట్ గా ఒక జాబ్ ను చేసుకునే వ్యక్తులు.. అనుకోకుండా ఉద్యోగం కోల్పోవడంతో కొంత ఆందోళనకు గురవుతారని చెప్పవచ్చును.. కానీ.. ఇటీవలి కాలంలో కొందరు ఉద్యోగులు మాత్రం ఉద్యోగం పోయిందని ఏ మాత్రం ఆందోళన చెందకుండా.. ఇంకా రిలాక్స్ గా ఉందంటూ చెబుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్‌ల ట్రెండ్ నడుస్తోంది. అన్ని కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. నా టర్న్ ఎప్పుడో అని ఉద్యోగులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. 1969 తరువాత ఈ స్థాయిలో లేఆఫ్‌లు చేయడం మళ్లీ ఇప్పుడే. నిరుద్యోగ రేటు కూడా పెరుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. అయితే… ఉద్యోగం కోల్పోయిన కొందరు మాత్రం చాలా బాధపడుతున్నారు.. కానీ… ఉద్యోగులందరూ జాబ్ పోతుందని టెన్షన్ పడటం లేదు. పైగా కొందరు రిలాక్స్ అవుతున్నారట.

అదేంటి ఉద్యోగం ఊడితే హ్యాపీగా ఉంటారా..? అని అనుమానం రావచ్చు. కానీ…కొన్ని రిపోర్ట్‌లు కొత్త విషయం చెప్పాయి. “ఉద్యోగంలో నుంచి తీసేయడమే మాకు చాలా ప్రశాంతంగా ఉంది” అని చెబుతున్నారట కొందరు ఉద్యోగులు. కేవలం నెలకు ఒకసారి వచ్చే జీతం కోసం.. నచ్చినా నచ్చకపోయినా ఉద్యోగాలు చేసే వాళ్లంతా ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారట. అంతే కాదు. తమకు నచ్చిన పనులు చేసుకునేందుకు టైమ్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.కొందరు ఉద్యోగులు

  • “నచ్చిన పనులు చేసుకుంటూ హ్యాపీగా గడపాలని న్యూ ఇయర్ మొదలు కాగానే నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు నాకు ఉద్యోగం పోయింది. ఇప్పుడు నాకిష్టమైన పనులు చేసుకోడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు” అని తేల్చి చెబుతున్నారు కొందరు ఉద్యోగులు. “ఇలా జాబ్ పోవడం కంఫర్ట్‌గానే ఉంది. ఎమర్జెన్సీ ఫండ్‌ కూడా పెట్టుకున్నాం. ఎప్పుడిలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కదా” అని ఇంకొందరు చెబుతున్నారు. ఇక కొందరు ఎంప్లాయిస్ అయితే…లేఆఫ్‌ అవగానే వెంటనే జాబ్ సెర్చ్ మొదలు పెట్టి వారం గ్యాప్‌లోనే మరో ఉద్యోగం వెతుక్కుంటున్నారు.

అందుకే జాబ్ తీసేసినా “ఇదేమంత పెద్ద కష్టం కాదు” అని లైట్‌ తీసుకుంటున్నారు. కొందరైతే ఈ లేఆఫ్‌ల వల్ల లైఫ్‌ని కొత్త యాంగిల్‌లో చూసే అవకాశం దక్కిందని చాలా ఫిలాసఫికల్‌గా చెప్పేస్తున్నారు. మార్కెట్‌ ఎలా ఉంది..? కొత్త టెక్నాలజీలు ఏం వచ్చాయి..? అని తెలుసుకునేందుకు బోలెడంత టైమ్ దొరుకుతుందని అంటున్నారు. ఇంకొందరైతే “నాకిప్పుడే ఫ్రీడమ్ వచ్చినట్టుంది” అని నవ్వుతూ చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటాతో మొదలైన ఈ ట్రెండ్…అన్ని కంపెనీలకు విస్తరించింది. ఇప్పుడు మరోసారి మెటా కంపెనీ లేఆఫ్‌లు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా పలు టీమ్‌లకు అవసరమైన బడ్జెట్‌ను రిలీజ్ చేయలేదు. అంటే…ఇన్‌డైరెక్ట్‌గా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు సంకేతాలిచ్చింది.

ఉద్యోగులను తొలగించిన తరవాతే బడ్డెట్‌లు విడుదల చేయాలని భావిస్తోంది యాజమాన్యం. ఇప్పటికే ఉద్యోగుల్లో లేఆఫ్‌ల భయం మొదలైంది. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో అని కంగారు పడిపోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఒకేసారి 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం సంచలనమైంది. ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది 13%. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో మొత్తంగా కలిపి 11 వేల మందిని ఇంటికి పంపింది మెటా.

ఇటీవలే జుకర్‌ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తమకు ఎంతో కీలకమని చెప్పారు. మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. అప్పుడే మళ్లీ లేఆఫ్‌లు ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆ వార్తలు రావడం వల్ల దాదాపు ఖరారైనట్టే చెబుతున్నాయి కొన్ని రిపోర్ట్‌లు. అటు యాహూ కూడా లేఆఫ్‌లు మొదలు పెట్టింది. ఇప్పటికే 1600 మందిని తొలగించింది.

మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఇది 20%. అంతకు ముందు ఎంటర్‌టైన్‌మెంట్ కంపనీ డిస్నీ కూడా 7 వేల మందిని తొలగించింది. కంపెనీ నష్టాల్లో ఉందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని డిస్నీ సీఈవో బాబ్ ఇగర్ వెల్లడించారు. 2022 డిసెంబర్‌లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఐగర్‌కు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆయన వచ్చీరాగానే భూవివాదం చుట్టు ముట్టింది. ఇప్పటి వరకు డిస్నీ నియంత్రణలో ఉన్న వాల్ట్ డిస్నీ వరల్డ్ చుట్టుపక్కల ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకున్నారు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్.

  • అంతే కాదు నెట్‌ఫ్లిక్స్‌ డిసెంబర్‌లో తన వినియోగదారుల సంఖ్యను భారీగా పెంచుకుంది. అదే టైంలో డిస్నీ+కు సబ్‌స్క్రైబర్స్‌ తగ్గుతూ వస్తున్నారు..

    ఇది కూడా ఆయన ఎదుర్కొంటున్న పెద్ద సవాల్. ఖర్చులను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌ పాస్వర్డ్ షేరింగ్‌ ఆఫ్షన్‌ను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక మాంద్యం కారణంగా అనేక పెద్ద కంపెనీలు లేఆఫ్స్‌ ఇస్తున్నాయి. గూగుల్ దాదాపు 12 వేల మందిని విధుల నుంచి తొలగించింది. గూగుల్‌తో పాటు మెటా , అమెజాన్, మైక్రోసాఫ్ట్, శాప్, ఓఎల్ఎక్స్, మరికొన్ని పెద్ద కంపెనీలు తమ సిబ్బందిని పెద్ద ఎత్తున తొలగించాయి. అటు అమెజాన్‌లోనూ మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్‌లు ఉంటాయని తెలుస్తోంది.

    కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా పలు డిపార్ట్‌మెంట్‌లలోని ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి బడా కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యమూ ఇందుకు కారణమవుతోంది. ఆర్థిక మాంద్యం భయం కారణంగా దిగ్గజ కంపెనీలు ఇప్పటి కే వేలాది మందిని రోడ్డున పడేశాయి. లే ఆఫ్ లు ఇంకా పలు కంపెనీలలో కొనసాగుతున్నాయి.. అయితే.. ఎప్పెడెప్పుడు తమ ఉద్యోగం పోతుందోననే భయం ఉద్యోగుల్లో ఖచ్చితంగా ఉంటుంది.

    కానీ.. కొందరు ఉద్యోగులు మాత్రం ఉద్యోగం పోయినంత మాత్రాన సర్వం కోల్పోయామని భావించకుండా.. అది తమను మరింత ప్రతిభావంతమైన ఉద్యోగులుగా ఆధునిక టెక్నాలజీని తెలుసుకునేందకు ఉపయోగపడుతుందని భావిస్తుండగా.. మరికొందరు తమకు ఎలాంటి ఒత్తిడి లేకుండా.. జీవితంలో కొంతకాలం పాటు స్వేచ్చగా జీవించేందుకు సమయం దొరికిందని భావిస్తుండటం విశేషం.. ఏదేమైనా.. ప్రతి ఏటా లాభాల బాటలో నడుస్తున్న దిగ్గజ కంపెలు సైతం ఆర్థికంగా బలంగా ఉండేందుకు ముందుగానే ఉద్యోగులను తొలగించడం వల్ల అనేక మంది ఉద్యోగులకు వెంటనే కుటుంబ పోషణకు ఏం చేయాలో అర్థంకావడం లేదు. కానీ.. కొందరు ఉద్యోగులు మాత్రం జాబ్ పోయినప్పటికీ.. రిలాక్స్ అవుతున్నాం అని చెప్పడం విస్మయానికి గురి చేసే విషయమే..

    దిగ్గజ కంపెనీలు లే ఆఫ్ లను ప్రకటిస్తూ.. ఉద్యోగులను కలవరపెడుతుండటం చూస్తూనే ఉన్నాం.. కానీ.. ఇటీవల మారుతున్న ట్రెండ్ ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు ఆందోళన చెందకుండా.. తమకు స్వేచ్ఛ లభించిందని.. మరింత నైపుణ్యం పెంచుకునే సమయం దొరికిందని రిలాక్స్ అవుతున్నారనే రిపోర్ట్ లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

    Must Read

    spot_img