Homeసినిమాగాసిప్స్ప్రభాస్ నెక్స్ట్ మూవీ షూట్ పై లేటెస్ట్ అప్డేట్!

ప్రభాస్ నెక్స్ట్ మూవీ షూట్ పై లేటెస్ట్ అప్డేట్!

ప్రభాస్ ప్రస్తుతం వీలైనంత త్వరగా షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆదిపురుష్‌ సినిమాను అనుకున్న టైమ్‌లో రిలీజ్‌ చేయలేకపోవడంతో మిగితా సినిమాలను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టడంతో.. ప్రభాస్‌ తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెడుతున్నాడు.

ప్రస్తుతం ఆయన సలార్, ప్రాజెక్ట్‌-K సినిమాలతో పాటు మారుతి సినిమాను కూడా సైలెంట్‌గా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ సెకండ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటుంది. సెకండ్‌ షెడ్యూల్‌ 15రోజుల పాటు సాగనుందట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

ఒక వైపు ఆదిపూరుష్, మరోవైపు సలార్, ఇంకో వైపు ప్రాజెక్ట్ కె. ఆ తర్వాత స్పీరిట్, మారుతి ప్రాజెక్ట్. ఇలా గ్యాబ్ లేకుండా వందల కోట్ల సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు ప్రభాస్. అయితే మారుతి సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. సీన్ కట్ చేస్తే… ఈ సినిమాలో ఓ సీనియర్‌ హీరోయిన్‌ భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది. ‘ఖుషీ, ఒక్కడు, సింహాద్రి వంటి సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా అప్పట్లో ఓ మెరుపు మెరిసిన భూమికా ఈ మూవీలో నటించనున్నట్లు తెలుస్తుంది. లడ్డు బాబు సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన భూమిక.. సెకండ్‌ ఇన్నింగ్స్‌ను చక్కగా ప్లాన్‌ చేసుకుంటుంది. ఇటీవలే సీతారామంలో సమంత్‌ భార్యగా గెస్ట్‌ రోల్‌లో కనిపించింది.

కాగా తాజాగా ప్రభాస్ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం మేకర్స్‌ భూమికను ఎంపిక చేసుకున్నారట. ప్రభాస్‌కు అక్కగా భూమిక నటించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజా డిలక్స్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టు తిరిగే తాతా-మనవళ్ల కథతో ఈ సినిమా రూపొందనుందట. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో పాత కాలం నాటీ థియేటర్‌
సెట్‌ వేశారట. ఈ ఒక్క సెట్‌ కోసమే మేకర్స్‌ దాదాపు 6 కోట్లు ఖర్చుచేశారట. ప్రస్తుతం ఇక్కడే షూటింగ్‌ జరుగుతుంది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధీ కుమార్‌లు నటిస్తున్నారు. బాలీవుడ్‌ యాక్టర్ సంజయ్‌దత్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు ఏ స్టార్‌ హీరోతో సినిమా చేయని మారుతి.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో సినిమా చేస్తుండటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రం ఒకింత భయంగానే ఉన్నారు. ఎందుకంటే రీసెంట్‌గా మారుతి తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్‌ను మారుతి ఎలా హాండిల్‌ చేస్తాడో అనే డౌట్ అభిమానుల్లో మెదులుతుంది.

Must Read

spot_img