Homeసినిమాపుష్పరాజ్ దారిలో యంగ్ హీరోలు

పుష్పరాజ్ దారిలో యంగ్ హీరోలు

కరోనా మహమ్మారి తర్వాత సినిమా కంటెంట్ లో అలాగే ప్రేక్షకుల అభివృద్ధిలో కూడా చాలా వరకు మార్పులు చోటుచేసుకున్నాయి.దాంతో చాలా వరకు మాస్ సినిమాలకు రోజులు చెల్లిపోయాయని అనుకున్నారు. దాంతో ఆ తర్వాత కంటెంట్ ఉన్న కథలు సినిమాల వైపులు అడుగులు పడ్డాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో మాస్ బొమ్మలకు భారీగా డిమాండ్ పెరిగింది.ఒక రంగస్థలం, పుష్ప, కేజీఎఫ్ సిరీస్, వాల్తేర్ వీరయ్య లాంటి సినిమాలతో మాస్ హీరోయిజంకి ఎంత డిమాండ్ ఉందో అర్ధం అవుతూనే ఉంది. సామాన్య జనం నుంచి పుట్టుకొచ్చే హీరో అంటే జనం నీరాజనాలు పడతారు.

చెమటలు చిందించే పేదోడికి కోపం వచ్చి ఎదురుతిరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగే పేదలకి కష్టాన్ని దోచుకునే రాబందులని చీల్చి చెండాడేవాడు ఒకడుంటే వాడే హీరో అయితే ఎలా ఉంటుంది. ఇలాంటి ఇంటరెస్టింగ్ అంశాలు ఎప్పుడూ కూడా సామాన్య జనం మనసుకి దగ్గరవుతాయి. ఆ సినిమాలలో మాస్ ఆడియన్స్ అందరూ తమని తాము చూసుకుంటారు. ఆ హీరోని తమలో ఒకడు అనుకుంటాడు. అందుకే అలాంటి మాస్ అంశాలు పుష్కలంగా ఉండే చిత్రాలకి టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.

అయితే చెప్పే విషయాన్ని ఎంత నేచురల్ గా చెబితే అంత పెర్ఫెక్ట్ గా ఆడియన్స్ ని రీచ్ అవుతుంది. అతిశయోక్తి జోడించి ఓవర్ గా చూపిస్తే ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ కావడం లేదు. ఈ విషయాన్ని కూడా చాలా సినిమాలు చూపించాయి. దేనికైనా కచ్చితంగా స్టోరీని తీసుకుంటే మాస్ అంశాలు పుష్కలంగా ఉంటే కచ్చితంగా దేశ వ్యాప్తంగా ఉన్న మాస్ ఆడియన్స్ కి దగ్గర అవుతుంది అనేది సౌత్ లో వచ్చిన మాస్ మసాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ నేపధ్యంలో కుర్ర హీరోలుకూడా ఇప్పుడు అలాంటి మాస్ మసాలా స్టొరీలైన్స్ వైపు శ్రద్ధ చూపించారు.

ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వం చేస్తున్న సినిమా మారేడుమల్లి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ నడిచే ఓ స్మగ్లర్ కథగా ఉంది. అలాగే నాని చేసిన దసరా మూవీ రాయలసీమ నేపధ్యంలో ఓ అణగారిన వర్గానికి చెందిన యువకుడి కథగా ఉంది. ఇక రామ్ పోతినేని అయితే ఏకంగా ఊరమాస్ దర్శకుడిగా పేరున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోయే సినిమా పక్కా మాస్ మసాలా సినిమా అని తెలుస్తుంది. ఇక యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కూడా మాస్ మసాలా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా యంగ్ హీరోలు అందరూ కూడా ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని కథలని ఎంపిక చేసుకోవడం టాలీవుడ్ లో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Must Read

spot_img