Homeఆంధ్ర ప్రదేశ్కోటం రెడ్డి..నెక్ట్స్ స్టెప్ ఇదేనా..!

కోటం రెడ్డి..నెక్ట్స్ స్టెప్ ఇదేనా..!

ఆయనకు కొంచెం తిక్కుంది… దానికి ఓ..లెక్కుందండో… ప్రత్యర్దులు ఎంతటి వారైనా సరే పంచలు తడవాల్సిందేనట.. అలాంటిది ఆయన్నే గెలికితే .. అదీ సొంత పార్టీ నేతలు.. ఇంకేముంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టింది. ఇంతకు ఎవరా నేత ..

ప్రశాంతంగా ఉన్న ఆయన్ను గెలికి మరీ తలనొప్పి తెచ్చుకున్నారు వైసిపి పెద్దలు. అధికార పార్టీ ఎమ్మెల్యే పై నిఘా నేత్రాలు వదిలితే, వాటికే చుక్కలు చూపించారాయన. ఎవరు ఏమి ఇనాలనుకున్నారో అదే మాట్లాడి షాక్ కు గురి చేశారు. అంతా అయి పోయాకా నన్ను గెలకతారా.. నేనేంటో చూపిస్తా అని పార్టీ పెద్దలకు జలక్కిచ్చారు. దీంతో కంగు తిన్నారు వైసిపి పెద్దలు. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. రెండు సార్లు ఎమ్మెల్యే.

ఏమీ లేనప్పుడే కాకలు తీరిన నేతలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు కోటంరెడ్డి.. అధికార కాంగ్రెస్ పార్టీని ఎదురించి జగన్ పార్టీలో చేరారు. జగన్ ఒక్కడే ఉన్నప్పుడు అంతా తానై చూశాడు. అధికారంలోకి వచ్చాక మంత్రి వర్గంలో, ఆ తర్వాత చేపట్టిన విస్తరణలో అయనకు చోటు దక్క లేదు. అయినా భరించారు.. ఆ తరువాత కోటం రెడ్డి సేవలకు బహుమానంగా ఆయన్ను అరెస్టు చేసి అవమానించారు .. అయినా సహించారు.. చివరకు ఆయన పై నిఘా పెట్టారు. ఫోన్ ట్రాప్ చేసే పనిలో పడ్డారు వైసిపి పెద్దలు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది.

నా ఫోనే ట్రాప్ చేసే పనిలో పడ్డారు మావాళ్లు .. నెనేమైనా తెలివి తక్కువ వాడినా నాదగ్గర పన్నెండు సిమ్ములున్నాయ్ సామీ.. అయినా మీరు ఏదైతో వినకూడదో ఆమాటలు ఎప్పుడో మాటాడేసా.. అయితే ఏంది..ఇకపై చూసుకుందాం మీ పతాపమో…నాపతాపమో అంటూ బాంబు పేల్చారు. దీంతో ఒక్క సారిగా కంగు తిన్నారు వైసిపి అగ్ర నేతలు. అసలు కోటం రెడ్డి పై నిఘా పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. జగన్ ప్రధాన అనుచరుడిపై ఎందుకు నిఘా పెట్టారు.

కోటం రెడ్డి టార్గెట్ వెనుక ఎవరున్నారనేదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఈ చర్చ సెగ్మెంట్ వ్యాప్తంగానే కాక రాష్ట్ర రాజకీయాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు జగన్ అడుగులొ అడుగేసిన కోటం రెడ్డిని ఎందుకు అనుమానించారన్న ప్రశ్న జిల్లా వైసీపీ నేతల్లో, కేడర్ లో హాట్ టాపిక్ అయింది. మరోవైపు రాష్ట్రంలో ఎన్ని సర్వేలు జరిగినా కొటం రెడ్డి ముందంజలో ఉన్నారు. అయినా ఎందుకు అనుమానించి అవమానించారు అన్న సందేహం అందరిలోనూ తలెత్తింది.

నెల్లూరు జిల్లాలో కొటం రెడ్డి బలమైన నాయకుడు .. ప్రేమతో చూడాలే తప్ప..అతనిపై బల ప్రయోగం చేయకూడదనే సంగతి అదిష్టానం మరిచిందా .. పెడ చెవిన పెట్టిందా అని వైసిపి శ్రేణులు అగ్రనేతలను ప్రశ్నిస్తున్నారు. దీంతో కొండనాలుకకు మందేస్తె…ఉన్న నాలుక ఊడిందన్న చందంగా సొంత పార్టీ ఎమ్మెల్యే విషయంలోనే అధిష్టానం ఇలా చేస్తే మొదటికే మోసం వచ్చుద్దన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది.

అయితే దీనికి ప్రధాన కారణం .. ఆయన అధిష్టానంపై అలిగారని తెలుస్తోంది. అయితే ఆయన అలగడమే కాదు.. చాలా కోపంగా కూడా ఉన్నారు. అంతేనా పార్టీ పెద్దలతో తాడో పేడో తేల్చుకోవాలనుకున్నారు. నన్నే అనుమానించి అవమానిస్తారా .. బస్తీమే సవాల్ .. ఇక తాడో పేడో తేల్చుకొవాల్సిందేనని డిసైడ్ అయ్యారట కోటం రెడ్డి. ఆయన ఆగ్రహానికి ఇక వైసిపి తో కటీఫ్ తప్పదన్న టాక్ వెల్లువెత్తింది.

గ్రామ స్థాయి కార్యకర్త దగ్గర నుండి కార్పోరేటర్ వరకు పిలిచి మరీ తనకు జరిగిన అవమానం గురించి చెప్పారు. దీంతో పార్టీ క్యాడర్ కడుపు మండింది. అనుమానం ఉన్న చోట ఒక్క క్షణం కూడా ఉండొద్దు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నెల్లూ రూరల్ నేతలు. మరోపక్క కొటంరెడ్డిపై ఇంటిలిజెన్స్ నిఘా పెట్టడంపై జిల్లావ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రజల్లొ పట్టున్న నాయకులను పోగొట్టు కుంటే చివరకు నష్ట పోయేది పార్టీ అన్న సంగతి జగన్ మరిచారని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

దీంతో అసలు కొటం రెడ్డి చేసిన తప్పేంటి, ప్రజా సమస్యల పరిష్కారం లొ అధికారులను నిలదీయడం తప్పా .. లేక కార్యకర్తలకు ఇబ్బంది కలిగితే మాటాడటం తప్పా అంటూ వైసిపి పెద్దలను నిలదీస్తున్నారు. ఆ విషయానికొస్తె జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు కాంగ్రెస్ పార్టీలో ఎంపి గా ఉండి, వైయస్ మరణాంతరం ఓదార్పు యాత్రను అదిష్టానం వద్దన్నందుకు ఎదురు తిరిగారు. సొంత పార్టి పెట్టారు. తనకు అన్యాయం జరిగితే ఒక లెక్క.. ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్న నేతలు అభివృద్ధి కార్యక్రమాలపై నోరెత్తితే మరో లెక్కనా.. నేరమా అంటున్నారు వైసిపి లో కొందరు నేతలు.

నెల్లూరు జిల్లా లొ కొటంరెడ్డి దెబ్బకు ఒక్కసారిగా రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. కోటం రెడ్డి నిర్ణయం కోసం టిడిపి నేతలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ గ్యాప్ లొ కోటం రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి వలవేసే పనిలో ఉన్నారు వైసిపి నేతలు. లక్మణుడు రాముడి మాట జవదాటడు అన్న మాట ఎంత నిజమో ఈ అన్నదమ్ములు కూడా అంతె. తమ్ముడు గిరిధర్ రెడ్డి అంటె అన్నకు ప్రాణం. ఒకవేళ వైసిపి అధిష్టానం తమ్ముడికి టికెట్ ఇస్తె తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని కొటం రెడ్డి ప్రకటించారు. తమ్ముడు అంటె అంత ప్రేమన్నమాట.

  • కొటంరెడ్డి ని వైసిపి పెద్దలు అనుమానించడమే కాకుండా అన్నాతమ్ముల మద్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

జిల్లాలొ పాత తరం నాయకులతో కొటం రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ వ్యవహారం చూసి అందరూ ఫోన్ చేసి కోటం రెడ్డి నీకు మేము అండగా ఉన్నాము .. నువు ధైర్యం గా ముందుకెళ్లు అని చెబుతున్నారట. కోటం రెడ్డి ధైర్య సాహసాలు అందరికీ తెలిసిందే.. ఎదిరించాలని ఒకసారి డిసైడ్ అయితే అవతలి వాడు ఎంతటి వాడైనా వెనుకంజ వేయరు. జగన్ సోనియా గాంధీ ని ఎదురించి ఎలా మొండిగా తిరిగారో .. అలాంటి జగన్ ను ఎదిరించి తిరగగల సత్తా ఉన్న వాడు కొటంరెడ్డి. పిరికితనం కొటం రెడ్డి బ్లడ్ లోనే లేదు. ఏటికి ఎదురీదగల ఉక్కుమనిషి కోటంరెడ్డి.

ఆయన దగ్గర కుప్పిగంతులు వేస్తే అస్సలు కుదరదబ్బా అంటున్నారు క్యాడర్. వాస్తవానికి గత ఎన్నికల్లోనె టిడిపి నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందట…
దాన్ని సున్నితంగా తిరస్కరించి జగన్ వెంటే నడిచారు కోటం రెడ్డి. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నొ పోరాటాలు చేశారు కోటం రెడ్డి.వకాని ఏనాడు పొలీసులు అయన్న అరెస్టు చేయలేదు. కానీ అధికారం లొకి వచ్చాక సొంతపార్టీ పవర్ లోవుండగా ఓ చిన్న కేసు విషయంలో అయన్ని అరెస్టు చేసారు.

ఆప్పుడే కొటం రెడ్డి తీవ్రంగా కలత చెందారని, పార్టీ మారుతారన్న సందేహం ఎక్కడా కనపడలేదు. కానీ ఇప్పుడెందుకు అ సందేహం రావాల్సి వచ్చిందని తీవ్రంగా కలత చెందారు కొటం రెడ్డి. నిరంతరం జనంలొ ఉంటూ..కార్యకర్తల కష్టాల్లొ పాలు పంచుకుంటున్న కొటం రెడ్డి ని బయటకు పంపే కుట్ర జరుగుతుందనే తెలుస్తుంది. అయినా ఆయన బయటకు వెళితే నెల్లూరు జిల్లాలో వైసిపి ఖాళి అవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.

చీమా.. చీమా.. ఎందుకు కుట్టావంటె.. నా బంగారు పుట్టలో ఏలెడితె కుట్టనా అందట…ఇదిగో ఇట్టుంటది మరి వైసిపి పెద్దల చిలిపి చేష్టలు. అని సెటైర్లు వేస్తున్నారు కార్యకర్తలు. తాజా పరిణామాలతో కోటంరెడ్డి టీడీపీలోకి వెళుతున్నారంటూ వైసీపీ జిల్లా సీనియర్లు కొందరు వ్యాఖ్యానించడం మరింత రచ్చకు కారణమైంది. తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారన్న కోటంరెడ్డి వ్యాఖ్యల్ని త్రోసిపుచ్చిన నేతలు.. టీడీపీలోకి జంప్ అంటూ అనడం చర్చనీయాంశమవుతోంది. అసలు.. కోటంరెడ్డిని టార్గెట్ చేయడం వెనుక కథేంటన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా .. కోటంరెడ్డి రివర్స్ ఎటాక్ .. పార్టీలోని నేతలకు టెన్షన్ తెచ్చిపెట్టాయని సర్వత్రా చర్చ వెల్లువెత్తుతోంది.

మరి కోటం రెడ్డి .. నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది..

Must Read

spot_img