Homeఅంతర్జాతీయంఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు ఏమైంది?

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు ఏమైంది?

ఉత్తరకొరియా చిచ్చరపిడుగు కిమ్ జాంగ్ ఉన్ గత కొన్ని వారాలుగా కనిపించడం లేదు. దాంతో మళ్లీ ఆయన గురించిన వార్తలు హెడ్ లైన్స్ లోకి వచ్చాయి. ఏదో రకంగా నేనున్నానంటూ ముందుకు వచ్చే కిమ్ అసలు కనిపించకుండా పోవడంతో అదో వార్తగా మారిపోయింది. త్వరలో రాజధాని ప్యాంగ్యాంగ్ లో పెద్ద ఎత్తున శుభకార్యం జరగనుండగా తను కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఒకటి కాదు రెండు కాదు..గత 40 రోజుల నుంచి కిమ్‌ జాడ లేదు. మధ్య తన కూతురిని వెంటేసుకుని క్షిపణి ప్రయోగం కోసం వచ్చినప్పుడే చూడటం..ఆ తరువాత ఏరకంగానూ కిమ్ జాంగ్ ఉన్ దర్శనం ఇవ్వలేదు. నలబై రోజుల నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో పొరుగుదేశాలలో చర్చలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న అమెరికాను హెచ్చరిస్తూ వచ్చిన ప్రకటన ఆయనే చేసారా లేక అధికారులు విడుదల చేసారా అని అనుమానిస్తున్నారు. పైగా ఈ వారం ఉత్తర కొరియా దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ 75వ వార్షికోత్సవ పరేడ్‌ జరగనుంది. సరిగ్గా ఈ సమయంలోనే ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి తానే స్వయంగా వస్తుంటారు కిమ్ జాంగ్ ఉన్.. అలా రాకపోవడంతో ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి..

ఇప్పటికే ఆయన ఆరోగ్యం బాగోలేదని ప్రచారం జరుగుతోంది. 2014 తర్వాత కిమ్‌ దాదాపు 40 రోజులపాటు అదృశ్యం కావడం ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయంగా చెబుతున్నారు విశ్లేషకలు. ఆదివారం జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. ప్యాంగ్యాంగ్‌లో ఉ.కొరియా సైన్యం సైనిక కవాతుకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఆ సైన్యం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ దేశం సొంతంగా తయారు చేసిన క్షిపణులు, అణ్వాయుధాలను ఈ పరేడ్‌లో ప్రదర్శించే అవకాశాలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరకొరియా సాధాన చేస్తున్న దృశ్యాలను వాణిజ్య ఉపగ్రహాలు గుర్తించాయి. అంతే తప్ప అక్కడి నుంచి ఏ వార్త కూడా బయటకు వచ్చే దైర్యం చేయలేదు. అంతగా నిఘా పనిచేస్తుంటుంది.

సోమవారం జరిగిన మిలటరీ కమిషన్‌ సమావేశానికి మాత్రం కిమ్‌ అధ్యక్షత వహించినట్లు స్థానిక మీడియా కథనంలో పేర్కొంది. కానీ, ఎలాంటి ఫొటోలను విడుదల చేయలేదు. కీలక రాజకీయ సైనిక అంశాలపై ఆయన చర్చించినట్లు వెల్లడించింది. యుద్ధ సన్నద్ధతను మరింత పెంచుకోవాలని ఆయన అన్నట్లు కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ తెలిపింది. అయితే ఇది ఆయన తన అధికారులకు రొటీన్ గా చెప్పే విషయాలుగానే ఉంటాయి..అయితే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ దక్షిణ కొరియా సందర్శించడాన్ని ఉత్తరకొరియా గత వారం తప్పుపట్టింది. అమెరికా ఉద్రిక్తత పాలసీలను అనుసరించనంత కాలం తాము చర్చలకు సిద్ధపడమని గత గురువారం తేల్చిచెప్పింది. తమ పొరుగుదేశాలతో కలసి సైనిక విన్యాసాలను చేయడం ఆయుధాలను ప్రదర్శించడం చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు కిమ్.

మొత్తానికి ఈయన కనిపించినా వార్తే.. కనిపించకుండా పోయినా వార్తే.. చాలా రోజులుగా కిమ్. ఆరోగ్యం బాగోలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏమైనా జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. ఇంతకీ కిమ్‌కు ఏమైంది. ? ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? కిమ్ జాంగ్ ఉన్..అంటే ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ప్రపంచానికి దాదాపుగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. నిత్యం ఎక్కడో ఒకచోట ఆయుధాలను పరీక్షిస్తూ వార్తల్లో కెక్కుతారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు. బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తూ.. అమెరికా సహా పలు శత్రు దేశాలకు వార్నింగ్ ఇస్తూ.. ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించారు. అయితే అనూహ్యంగా 40 రోజుల నుంచి కిమ్ ఎక్కడా కనిపించలేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆధునిక నియంతగా పేరున్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్..గురించి అధికారంలో ఉన్న వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. కిమ్ జాంగ్ ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో రెండుసార్లు ఆయన ఇలా అదృశ్యం అయ్యారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. 2020లో కిమ్ జొంగ్ ఉన్ కార్డియో వాస్కులర్ బారిన పడ్డారు. విపరీతంగా పొగతాగడం, భారీ శరీరం కావడం వల్ల కార్డియో వాస్కులర్‌ కు గురయ్యారు. దీనితో ఆయన హ్యూయంగ్‌సాన్‌లోని ఓ విల్లాలో సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తు జరిగింది. కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తరువాత కిమ్ జోంగ్.. రాజధాని ప్యాంగ్యాంగ్‌కు తిరిగి వచ్చారని, అనంతరం అబ్జర్వేషన్‌లోకి వెళ్లారని డెయిలీఎన్‌కే ఆన్‌లైన్ న్యూస్ పేపర్ తెలిపింది.

Must Read

spot_img