Homeసినిమాట్విట్టర్ కు దూరంగా కెజియఫ్ డైరెక్టర్

ట్విట్టర్ కు దూరంగా కెజియఫ్ డైరెక్టర్

కేజీయఫ్‌ సినిమాలతో పాన్‌ ఇండియా క్రేజ్ సాధించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈసినిమాలతో హీరో యష్ కంటే ఎక్కువగా ప్రశాంత్ నీల్ కే పేరు వచ్చింది. క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్‌ నీల్‌. ఇలాంటి డైరెక్టర్ తెలుగు కుర్రాడి వల్ల హార్ట్ అయ్యాడు. అంతేకాదు సోషల్ మీడియాకు దూరం అయ్యాడు. ఇంతకీ ప్రశాంత్ నీల్ ఎందుకు హార్ట్ అయ్యారు..? కారణం ఏంటి..?

కె.జి.ఎఫ్ తో సెన్సేషనల్ విక్టరీ సాధించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ ఫ్రాంచైజ్ తో స్టార్ డైరెక్టర్ గా నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉన్నాడు. అతను చూపించిన హీరోయిజానికి సాధారణ ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ అయిపోయారు. కెజిఎఫ్ 2 తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఆ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నాడు. సలార్ వర్క్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ సడెన్ గా తన ట్విట్టర్ ఖాతాని డిలీట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.

రీసెంట్ గా కెజిఎఫ్ హీరో యశ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు ప్రశాంత్ నీల్. అదే అతని చివరి ట్వీట్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశాడు. అయితే ప్రశాంత్ నీల్ ఇలా చేయడానికి గల కారణాలు రెండు ఉన్నాయని అంటున్నారు. సలార్ సినిమాను పూర్తి చేసేందుకు తన ఫోకస్ అంతా సినిమా మీద పెట్టేలా.. కొన్నాళ్లు సోషల్ మీడియాకి దూరంగా ఆఫ్ లైన్ లో ఉండాలనే ఆలోచనతో ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ఖాతా డిలీట్ చేశాడని అంటున్నారు.

ఇక మరోపక్క యశ్ కి చెప్పిన బర్త్ డే విషెస్ మెసేజ్ ఉర్దూలో పెట్టాడు. అయితే దాని వల్ల ప్రశాంత్ నీల్ పై నెటిజన్లు బాగా ఆడేసుకున్నారు. అది తట్టుకోలేకనే ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ఖాతా డిలీట్ చేశాడని అంటున్నారు. వీటిలో ఏది నిజమో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రశాంత్ నీల్ అఫీషియల్ గా కూడా తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశానన్న స్టేట్ మెంట్ ఇవ్వలేదు. మరి అక్కడ అసలేం జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

Must Read

spot_img