Homeతెలంగాణరాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని .. మళ్లీ కేసీఆర్ చూపించారా..?

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని .. మళ్లీ కేసీఆర్ చూపించారా..?

వాళ్లిద్దరూ స్నేహితులు, తెలంగాణ పోరాటంలో ప్రత్యేక రాష్ట్రం కలిసి కొట్లాడారు. టీఆర్ఎస్ ఆవిర్భావం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్. వారిలో ఒకరు కేసీఆర్ అయితే మరొకరు ఈటల రాజేందర్. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా సాధ్యం అనేదానికి వీరిద్దరే నిదర్శనం. రాజకీయం మారింది స్నేహితులు కాస్తా బద్ద శత్రువులయ్యారు. టీఆర్ఎస్ జెండానే మాది అన్న ఈటలను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో బీజేపీలో చేరిన ఈటల .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు.

అయితే ఈ ఎన్నికల్లో ఈటలను ఓడించాలని టీఆర్ఎస్ విశ్వప్రయత్నమే చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. గత సమావేశాల్లో నిరసన చేసిన ఈటలను సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే అప్పట్లో ఓ టాక్ కూడా వినిపించింది. కేసీఆర్ సభలోకి అడుగుపెట్టేటప్పుడు ఈటల సభలో ఉండకూదని భావించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవన్నీ జస్ట్ ఆరోపణలే అని తాజా బడ్జెట్ సమావేశాలు తేల్చేశాయి. ఈ సమావేశాలు చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చజరిగింది.

ఈ చర్చ వేళ ఈటల రాజేందర్ పదే పదే కేసీఆర్ ను ప్రస్తావించడం, వివాదం తర్వాత తొలిసారి కేసీఆర్ నోటి వెంట తొలిసారి ఈటల పేరు వినిపించడం ఈ సమావేశాల్లో హైలెట్ గా నిలిచాయి. వీటిని చూసినవాళ్లంతా మళ్లీ కేసీఆర్-ఈటల స్నేహం చిగురించిందని అంటున్నారు. కాంగ్రెస్ పాలనలో బ్రోకర్లు, పైరవీలుచేసినవాళ్లు గెలిచారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. సన్నబియ్యం సలహా ఆనాడు ఈటల రాజేందర్ ఇచ్చారన్నారు. మాట్లాడితే జై శ్రీరామ్ అంటారు.. కానీ గుండెల్లో మాత్రం ఉండదు వాళ్లకు అని బీజేపీని విమర్శించారు. కమ్యూనిటీ హాల్స్ పర్ ఆల్ కమ్యూనిటీస్ .. దీనికి పేరు కూడా మా ఈటెల రాజేందరే పెట్టారన్నారు.

ఉద్యోగులకు మళ్లీ జీతాలు పెంచుతామన్నారు. మోదీ సంకుచితమైన రాజకీయాలు వదులుకోవాలని కేసీఆర్ సూచించారు. ‘మేము మీకు సహకరిస్తాం- మీరు మాకు సహకరించండి’ అనే ధోరణి పాటించాలన్నారు. డైట్ ఛార్జీలు పెంచాలని ఈటల రాజేందర్ కోరిక మేరకు పెంచుతున్నామన్నారు. ఈటల రాజేందర్ చెప్పారు కాబట్టి చేయం అని అనొద్దని, కావాలంటే ఈటల రాజేందర్ కు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ పై ఈటల రాజేందర్ సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఆర్టీసీ బస్సులు, రైతు రుణమాఫీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో ఈటల రాజేందర్ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సమస్యలు రెండుసార్లు చెప్పకుండా కంటిన్యూగా చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

తన పేరును కేసీఆర్ పదే పదే ప్రస్తావించడంపై పట్ల ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రియాక్టయ్యారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడారని ఆరోపించారు. అసెంబ్లీలో పదే పదే ఈటల పేరు ప్రస్తావించడం వెనుక కేసీఆర్ రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈటలను ఎటూ కాకుండా చేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూడడం, బీఆర్ఎస్ లోకి రప్పించడం, ఆది నుంచి బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల కన్నా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటల బెటర్ అని తెలిసేలా ఫోకస్ చేయడం, బీజేపీ ఈటలను నమ్మకుండా మరింత దూరం పెట్టేలా చేయడం, ప్రతిపక్ష పార్టీల్లో కూడా కేసీఆర్ కోవర్ట్ లు ఉన్నారని ఈ మధ్య ఈటల చేసిన కామెంట్లకు రివర్స్ పంచ్ వేయడం కావొచ్చని రాజకీయ విశ్లేషకులుఅంటున్నారు.

దీంతో బీఆర్ఎస్ ఈటలను పక్కా వ్యూహంతోనే టార్గెట్ చేసినట్లు భావించవచ్చు. గతంలో జానారెడ్డిని కూడా ఇదే రీతిలో ఆన్ పాపులర్ చేశారని, ఇప్పుడు ఈటల అదే వ్యూహంలో టార్గెట్ చేశారని సర్వత్రా అనుమానాలు లేకపోలేదు. ఈటల రాజేందర్‌.. ఈ పేరు ఒక ఫెర్‌ బ్రాండ్‌. తెలంగాణలో తనకు తిరుగులేదనుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఒక్క విజయంతో దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన వీరుడు. కేసీఆర్‌తో విభేదించిన వారంతా రాజకీయాల్లో కనుమరుగైతే.. అదే కేసీఆర్‌ను విభేదించి, మంత్రి పదవిని గడ్డిపోచలా వదులుకుని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అధికార పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాడు. కాదు కాదు.. అభ్యర్థి రూపంలో ఉన్న కేసీఆర్‌నే ఓడించారు.

తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఓటమితో తల కొట్టేసినంత పనైన కేసీఆర్‌ రెండు అసెంబ్లీ సెషన్లలో ఈటల ముందు తలెత్తుకోలేక చిన్నచిన్న కారణాలతో ఆయనను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయించారు. కానీ, తాజా బడ్జెట్‌ సమావేశాల్లో కేసీఆర్‌ మైండ్‌గేమ్‌ మొదలు పెట్టారు. ఈటల నామస్మరణతో చివరి రోజు తరించారు కేసీఆర్‌. ఒకటి రెండుసార్లు కాదు.. ఏకంగా 18సార్లు ఈటల రాజేందర్, మా ఈటల రాజేందర్‌ అంటూ పదేపదే ప్రస్తావించారు. తన మైండ్‌గేమ్‌ ద్వారా తెలంగాణలో రాజకీయ చర్చకు తెరలేపారు కేసీఆర్. ఈటలకు అది తెలుసు, ఈటలకు ఇది తెలుసు. ఈటలకు అన్నీ తెలుసు అని కేసీఆర్‌ అన్నారు. సమస్య ఉంది కాబట్టే ఈటల మాట్లాడుతున్నారని ఆకాశానికెత్తేశారు. గతంలో పేరెత్తడానికీ ఇష్టపడలేదు.. దాదాపు రెండేళ్లుగా ఈటల పేరు ఎత్తడానికి కూడా కేసీఆర్‌ ఇష్టపడలేదు.

పొట్టోడు.. పొడుగోలు.. భూమికి జానెడు ఉన్నోడు.. అంటూ వివిధ సందర్భాల్లో విమర్శలు కూడా చేశారు. ఈటల చేసిన ప్రతీ విమర్శకు ఎదురు దాడితో సమాధానం చెప్పారు.ఈటల గెలిచిన తర్వాత ఆయన భూములను కూడా స్వాధీనం చేసుకున్నామని ప్రచారం చేయించారు. పేదలకు పంచామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈటల తన ఇంచ్‌ భూమి కూడా పోలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈటల కూడా వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌పై పోటీ చేస్తానని సవాల్‌ చేశారు. ఈమేరకు పని కూడా మొదలు పెట్టానని ప్రకటించారు.

అసెంబ్లీలో కేసీఆర్‌ పదే పదే ఈటల నామస్మరణ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌లో మార్పు వచ్చిందా? లేక తనపైనే పోటీచేస్తానని ఈటల రాజేందర్‌ చేసిన సవాల్‌కు భయపడే ఈటలను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారా? లేక ఈటల మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి రావాలని భావిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీలో ఇమడలేకపోతున్న ఈటలను మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించే ప్రయత్నం జరుగుతోందన్న చర్చ నడుమ కేసీఆర్‌ ఆయన్ను పొగడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

నాలుగు నెలల క్రితం కూడా ఇలాంటి ప్రస్తావనే వచ్చింది. మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని కేసీఆర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పుడు ఆ వార్తలను ఖండించిన ఈటల, అదంతా కేసీఆర్‌ కుటిల గేమ్‌ ప్లాన్‌ అని ఆరోపించారు. తాజాగా అసెంబ్లీలో తన పేరును సీఎం
కేసీఆర్‌ పదేపదే ప్రస్తావించడంపై ఈటల ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. తనను డ్యామేజ్‌ చేసే వ్యూహంతోనే కేసీఆర్‌ అలా మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు.కేసీఆర్‌ అబద్దాన్ని అటూ చెప్పగలరు.. ఇటూ చెప్పగలరని ఈటల మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లో తిరిగి చేరేది లేదని స్పష్టం చేశారు. తనది పార్టీ మారే చరిత్ర కాదని, గెంటేసినవాళ్లే స్వయంగా పిలిచినా పోయే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.

రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎప్పుడూ కేసులు, ఇతర కక్ష సాధింపులతోనే కాదు.. అప్పుడప్పుడూ అభిమానం చూపించడం ద్వారా టార్గెటెడ్ నేతను ఇరుకున పెట్టొచ్చు. ఇలాంటి రాజకీయ వ్యూహాల్ని అమలు చేయడంలో కేసీఆర్ చాలా పకడ్బందీగా ఉంటారు. తాజాగా అసెంబ్లీలో ఆయన ఈటల రాజేందర్‌కు తన మార్క్ రాజకీయం రుచి చూపించారు. ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ను మళ్లీ టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారన్న ప్రచారం జరిగింది. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం కన్నా చనిపోవడం మంచిదని ఈటల అంతే ఘాటుగా స్పందించారు.

Must Read

spot_img