Homeతెలంగాణసినీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణ..

సినీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణ..

సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురష్కరించుకోని తెలంగాణ టీవీ, డిజిటల్‌ మీడియా టెక్నీషియన్స్‌ ఆధ్వర్యంలో సారూ…కేసీఆరూ..అంటూ పాడిన పాటను విడుదల చేశారు. ఈ హైదరాబాద్ యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరై పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన గొప్పనేత సీఎం కేసీఆర్‌ అని అన్నారు. చలనచిత్ర, టీవీ పరిశ్రమల్లో లక్షలాది మంది జీవనం పొందుతున్నారని అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వివిధ భాషలకు చెందిన కళాకారులకు అనేక అవకాశాలు లభిస్తున్నట్లు చెప్పారు.

ఒకప్పుడు చలనచిత్ర పరిశ్రమ అంటే చెన్నై పేరు గుర్తొచ్చేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్‌ అడ్రస్‌గా మారింటం మనకెంతో గర్వకారణం అన్నారు. ఇటీవలే కాలంలో ప్రజలు టీవీ సీరియల్స్ పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. చలనచిత్ర పరిశ్రమ, టీవీ ఫెడరేషన్‌లోని ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌లలో అర్హులైన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద పెండ్లికి ఆర్థిక సహాయం, ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ నటులు, అసోసియోషన్ సభ్యులు పాల్గొన్నారు.

Must Read

spot_img