HomePoliticsఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..?

సీబీఐ దూకుడు .. అదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయా..? అందుకే తాజాగా మరోసారి నోటీసు జారీ చేసిందా..?
దీనిపై కవిత నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నదే కీలకంగా మారిందా..? లెట్స్ వాచ్..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? విచారణ పేరిట సీబీఐ దూకుడు గమనిస్తే ఔననే సమాధానం వచ్చేలా ఉంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే కవితకు సన్నిహితులుగా ఉన్నవారిని విచారించి, కొందరిని అరెస్టు చేసిన సీబీఐ కవితను కూడా ఆమె నివాసంలో సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను విచారించిన సీబీఐ.. ఆ విచారణ ముగిసిన అనంతరం ఆమెకు మరో నోటీసు జారీ చేసింది. తొలి నోటీసు సీఆర్పీసీ 160కింద ఇచ్చిన సీబీఐ.. ఆ నోటీసు మేరకు విచారణ పూర్తయిన తరువాత ఇచ్చిన నోటీసు సీఆర్పీసీ 91 కింద ఇచ్చింది.

అంటే తొలి నోటీసులో ఆమె వివరణ తీసుకుందుకు మాత్రమే నంటూ ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ విచారణ జరుపుతామని పేర్కొన్న సీబీఐ.. ఆమె ఎంపిక చేసుకున్న విధంగా ఆమె నివాసంలోనే విచారించింది. అయితే రెండోసారి జారీ చేసిన నోటీసులో మాత్రం ఆమెకు అటువంటి వెసులు బాటు ఇవ్వలేదు. ఈసారి సీబీఐ తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆమె విచారణ నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది. తొలి నోటీసు మేరకు ఆమె నివాసానికి వెళ్లి దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు మలి నోటీసుకు సంబంధించి మాత్రం సమయం, తేదీ, ప్రాంతం తరువాత తెలియజేస్తామని పేర్కొంది. ఈ నోటీసులు విచారణకు వచ్చేముందు ధ్వంసం చేసి ఫోన్లు, లిక్కర్ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నిటినీ తమకు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా పరిగణిస్తారు.

మలి నోటీసు మేరకు కవితను విచారించిన అనంతరం ఆమెను లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా చేర్చే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇక ఫోన్ల ధ్వంసం సంబంధించిన కచ్చితమైన ఆధారాలను నిర్దారణ చేసుకున్న తరువాతనే సీబీఐ అధికారులు ఆమెను సీఆర్పీసీ 91 కింద నోటీసు జారీ చేశారని భావిస్తున్నారు. అయితే మలి నోటీసు మేరకు ఆమెను ఎప్పుడు విచారిస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే విచారణకు ఎక్కడకు హాజరు కావాలి, ఏ తేదీన హాజరుకావాలి, ఏ సమయంలో హాజరు కావాలని అన్న వివరాలను త్వరలోనే తెలియజేస్తామని సీబీఐ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఇక కవితను సీబీఐ హస్తినకు పిలిపించుకుని విచారణ జరిపే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు.

విచారణ పూర్తి అయిన వెంటనే కవిత తన నివాసం నుంచి నేరుగా ప్రగతి భవన్ కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. విచారణ తీరును వివరాలను.. కవిత కేసీఆర్ తో భేటీ తరువాత మీడియాకు ప్రకటిస్తారని అంతా భావించినా అది జరగలేదు. కేసీఆర్ తో బేటీ అనంతరం కవిత ప్రగతి భవన్ నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. దీంతో ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్సీ కవితను నీడలా వెంటాడనుందా.. సాక్షి నుంచి తానూ నిందితురాలిననే ఒప్పించనుందా.. ఈమేరకు సీబీఐ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిన్నటి వరకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి కేవలం సాక్షిగానే పరిగణించిన సీబీఐ.. తాజాగా సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చి షాక్‌ ఇచ్చింది. సాక్షిగా స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్న సమయంలో ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కవిత వద్ద ఢిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నట్లు సీబీఐ భావిస్తుందని సమాచారం. అందుకే 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్న మాట. సీఆర్పీసీ 91 కింద సీబీఐ జారీ చేసిన నోటీసీలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. సాక్షిగా ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ కవితను ఫిక్స్‌ చేసింది. ఏడున్నర గంటలపాటు జరిపిన విచారణలో ఈమేరకు కవిత కూడా తనకు తెలిసిన వివరాలు చెప్పింది. ఈమేరకు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకుంది. న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరైన కవిత తాను చెప్పిన వివరాలన్నీ నిజమైనవే అని స్టేట్‌మెంట్‌పై సంతకం కూడా చేసినట్లు తెలిసింది.

దీని ఆధారంగానే సీబీఐ సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చింది. దీనిలో రెండు క్లాజ్‌లు ఉన్నాయి. సీఆర్పీసీ 91 క్లాజ్‌ 1 కింద తన దగ్గర ఉన్న ఆధారాలు పత్రాలు, ఫోన్లు, డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు, సీడీలు, కాల్‌ రికార్డులు ఇలా కీలకమైన ప్రతీ ఆధారం.. సీబీఐకి ఎవరితో అయినా పంపిచొచ్చు. ఇక క్లాజ్‌ – 2 ప్రకారం అయితే.. కవితనే స్వయంగా సీబీఐ ఆఫీస్‌కు వెళ్లి ఆధారాలు తాము చెప్పిన చోట, నోటీసు అందుకున్న వ్యక్తి హాజరుకావాల్సి ఉంటుంది.

అడిగిన పత్రాలు, ఆధారాలు ఇవ్వాల్సిందే. దీంతో సీబీఐ వేస్తున్న అడుగులు చూస్తుంటే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. సీఆర్పీసీ 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ తర్వాత 91 కింద నోటీసులు ఇవ్వడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు కవితకు కొన్ని ఆధారాలు చూపించారని సమాచారం. వాటితో అప్పటి వరకు ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో కనిపించిన కవిత.. విచారణ తర్వాత ముఖంపై లేని వన్వును తెచ్చుకుని కార్యకర్తలకు, మీడియా ముందుకు వచ్చారు. దీనిద్వారా కవితలో ఏదో టెన్షన్‌ మొదలైందన్న అభిప్రాయం అందరికీ అర్థమవుతుంది. మరోవైపు కవిత మీడియాతో మాట్లాడకుండా, విచారణ తర్వాత హడావుడిగా ప్రగతి భవన్‌కు వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సాక్షిగా వివరణ ఇస్తే ఇంత టెన్షన్‌ ఎందుకన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కవిత విచారణ పూర్తికాగానే అప్‌డేట్స్‌ తెలుసుకునేందుకు, తర్వాత ఏం చేయాలి, ఎలాంటి స్టెప్‌ వేయాలన్న విషయమై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ ఉదయమే న్యాయ నిపుణులు, రిటైర్డ్‌ జడ్జీలు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులను ప్రగతి భవన్‌కు పిలిపించినట్లు తెలిసింది.

సుమారు పది మంది న్యాయ నిపుణులు రోజంతా ప్రగతిభవన్‌లోనే ఉన్నారని సమాచారం. విచారణ అనంతరం కవిత ప్రగతిభవన్‌కు వెళ్లిన తర్వాత సీబీఐ అడిగిన ప్రశ్నలు, వాటికి కవిత ఇచ్చిన సమాచారం, సీబీఐ అధికారులు చూపించిన ఆధారాల గురించి న్యాయ నిపుణులకు వివరించినట్లు తెలిసింది. ఈమేరకు రాత్రంతా మంతనాలు సాగినట్లు తెలుస్తోంది. కవిత, కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా పోయిందని ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్‌ ఆరోరా రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపైనే సీబీఐ కవితను ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ తాను అనుకున్ననంత ఈజీగా జరుగలేదన్న విషయం మాత్రం అందరికీ అర్థమవుతోంది.

సీబీఐ దగ్గర ఉన్న ఆధారాలతో నిందితులుగా చేర్చే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీబీఐ వేస్తున్న అడుగులు చూసుక్తంటే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. సీఆర్పీసీ 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ తర్వాత 91 కింద నోటీసులు ఇవ్వడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మరోవైపు కవితను సీబీఐ ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో నిందితురాలిగా చేర్చవచ్చన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేశారు. దీంతో ముందస్తు బెయిల్‌ లేదా నిందితురాలిగా చేర్చే అంశంపై ముందస్తుగా కోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశాలను కవిత, సీఎం కేసీఆర్‌ న్యాయ నిపుణులతో చర్చించారని తెలుస్తోంది. మొన్నటి వరకు సహకరిస్తానని చెప్పిన కవిత ఇప్పుడు స్టే తెచ్చుకుంటే మాత్రం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినట్లు అవుతుంది. మరోవైపు ఇన్నాళ్లు కవితకు అండగా నిలిచిన గులాబీ శ్రేణులు కూడా పునరాలోచనలో పడే అవకాశం ఉంది.

మరి నెక్ట్స్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img