యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిన విషయమే. తెలుగులోనే కాకుండా హిందీలోనూ ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అయితే కార్తికేయ 3 సినిమా కోసం మరో ఏడాది సమయం పట్టే ఆవకాశం ఉంది.
కార్తికేయ-2 పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ నిలిచింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన కార్తికేయ2 బంపర్ విజయాన్ని అందుకుంది. హిందీ బాక్సాఫీస్ ని వసూళ్లతో ఊపిరాడకుండా చేసింది. 50 థియేటర్లో రిలీజ్ అయిన సినిమా 1000 థియేటర్లకి విస్తరించింది. బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేసింది. కృష్ణతత్వం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ నెంబర్ ని సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే ఓవర్సీస్ లోనూ కార్తికేయ-2 తడాఖా చూపించింది.
అక్కడా అనూహ్యా వసూళ్లతో విజయదుందుబీ మోగించింది. అక్కడ ఏకంగా విజయవంతంగా 50 రోజుల రన్ను పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. ఓ తెలుగు సినిమా దేశం కాని దేశంలో అర్ధశతదినోత్సవం పూర్తిచేసుకోవడం అంటే చిన్న విషయం కాదు.
దాన్ని అతి పెద్ద సక్సెస్ గానే భావించి యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. అందుకే కార్తికేయ -3ని అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు చందు మొండేటి ప్రకటించాడు. అప్పుడే స్ర్కిప్ట్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇటీవలే నికిల్ తో సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా డిస్కస్ చేసాడుట. అది లాక్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కథ సిద్దం కావడానికే ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నారట.
ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా భావి స్తున్న నేపథ్యంలో కథలోయూనిక్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అలాగని పూర్తిగా ఇన్నోవేటివ్ గా వెళ్లకుండా బ్యాలెన్స్ డ్ గానే స్ర్కిప్ట్ ని డిజైన్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చందు గీతా ఆర్స్ట్ లో చేయాల్సిన సినిమాని సైతం తాత్కాలికంగా పక్కనబెట్టేసాడని తెలుస్తోంది.
కార్తికేయ-3 కథ సిద్దం చేసే వరకూ మరో ఆలోచన లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కొత్త నిర్మాలు అడ్వాన్సులు ఇస్తామన్నా తీసుకోవడం లేదుట. కార్తియేక- 2 ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్-విశ్వ ప్రసాద్ యథావిధిగా మూడవ కార్తికేయని నిర్మించడానికి ముందుకొస్తున్నారు. ఖర్చు విషయంలో ఆలోచించాల్సిన పనిలేదని…ఎంత కాలమైనా వెచ్చించి మంచి కథ సిద్దం అయిన తర్వాతే సినిమా చేద్దామని చందుకి నిర్మాతలు అభయ హస్తం ఇచ్చినట్లు సమాచారం. స్ర్కిప్ట్ పూర్తవ్వడానికి ఏడాది సమయం పడుతుందని అంటున్నారు. అంటే వచ్చే ఏడాది ముగింపులోనే కార్తికేయే -3 ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.